27/06/2024
• ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ-అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేరిన కర్నూలు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గ్రీన్ కో సంస్థ పర్యావరణ నిబంధనల ఉల్లంఘన, అటవీ భూముల ఆక్రమణలు మీడియా కథనాలు, ఫిర్యాదులు.
• వెంటనే అటవీ శాఖ ముఖ్య అధికారులతో మాట్లాడిన శ్రీ పవన్ కల్యాణ్ గారు. గ్రీన్ కో సంస్థ చేసిన పర్యావరణ ఉల్లంఘనలు, అటవీ భూముల ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం. నివేదికతో రేపు సమావేశానికి రావాలని ఆదేశం
• రాష్ట్రంలో పారిశ్రామిక కాలుష్యంపై పొల్యూషన్ ఆడిట్ నివేదిక ఇవ్వాలని కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు. పొల్యూషన్ ఆడిట్ పై రేపు సమీక్ష