Telugu Desam Party: Guntur East

Telugu Desam Party: Guntur East Official Page of TDP Guntur East

• ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ. 65, 887 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేశాం.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం ...
02/06/2026

• ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ. 65, 887 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేశాం.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం పర్యటనలో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు

• నియోజకవర్గాల అభివృద్ధిపై దిశానిర్దేశం చేసేందుకు నేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు

• రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యం.. ముంబయి సదస్సులో స్పష్టం చేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• ఉపాధ్యాయ నియామకాలపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాలను ఎండగడుతూ విశాఖ తీరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన డీఎస్సీ అభ్యర్థులు

• కోటిమంది భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాలు యోగాంద్ర కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు.. మంత్రి సత్య కుమార్ యాదవ్

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/QE0HV


01/06/2026

పేదల జీవన ప్రమాణాలు పెంచటంతో పాటు ఆర్ధిక అసమానతలు తొలగించేందుకే పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించాం.

#పేదలసేవలో






01/06/2026

"అమ్మా.. నువ్వు కుట్టు మిషన్ కుట్టుకోవటం కాదు.. అవసరం అయితే చదువుకో, ఏదో ఒక రోజు నిన్ను నేను టీచర్ గా చూడాలని అనుకుంటున్నా.."

పేదల సేవలో కార్యక్రమంలో పీ4లో భాగంగా మార్గదర్శులు బంగారు కుటుంబాలతో సంభాషించిన సీఎం

#పేదలసేవలో






దశాబ్దాల కలకు సాకారం.. నేటి నుంచి విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం..రాష్ట్ర ప్రజల చిరకాల కల విశాఖ కేంద్రంగా దక్...
01/06/2026

దశాబ్దాల కలకు సాకారం.. నేటి నుంచి విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం..

రాష్ట్ర ప్రజల చిరకాల కల విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాకారం అయ్యింది. 2019 ఎన్నికలకు ముందే కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రకటన చేసినా, గత వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. భూములు అప్పగించాలని కేంద్రం ఎన్ని సార్లు కోరినా పట్టించుకోలేదు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఒక్కో విభజన హామీ పరిష్కారం అవుతుంది. రాజధాని చట్టబద్ధత, పోలవరం నిర్మాణం, విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజ్, రైల్వే జోన్ సహా అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి.


• నేటి నుంచే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభం. ఫలించిన సీఎం చంద్రబాబు పట్టుదల • సింగపూర్ బ...
01/06/2026

• నేటి నుంచే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభం. ఫలించిన సీఎం చంద్రబాబు పట్టుదల

• సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2026 పురుషుల డబుల్స్ లో చిరాగ్ తో కలిసి స్వర్ణ పథకం సాధించిన కోనసీమ కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

• నంద్యాల జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ధ్వంసం వైసీపీ కార్యకర్త పనే.సీసీ కెమెరాల ఫుటేజీ తో బట్టబయలైన సైకో బ్యాచ్ నాటకం. వైసీపీ తీరుపై ధ్వజమెత్తిన ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• నేడు కాకినాడ జిల్లా చామవరం లో "ప్రజావేదిక" లో పాల్గొని ,ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

• పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రేపటి నుంచి ఆరు రోజులపాటు రష్యాలో పర్యటించనున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/oc1l


మెగా డిఎస్సీ-2025ను TCS ION CBT వ్యవస్థలో నిర్వహించడం మూలంగా ప్రతి డేటా సురక్షితంగా భద్రపరచబడతాయి. అలాంటప్పుడు డేటా డిలీ...
31/05/2026

మెగా డిఎస్సీ-2025ను TCS ION CBT వ్యవస్థలో నిర్వహించడం మూలంగా ప్రతి డేటా సురక్షితంగా భద్రపరచబడతాయి. అలాంటప్పుడు డేటా డిలీట్ చేసారని జగన్ చేస్తున్న ప్రచారం అబద్దం. విషయాలను అర్థం చేసుకోవడంలో జగన్ కు ఉన్న అవగాహనలేమికి ఇది నిదర్శనం.


31/05/2026

డీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ చేయడం ఎవరి తరం కాదు..

ఆరు నుంచి పది మంది నిపుణులు కలిసి ఒక్కో సబ్జెక్టుకు ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు. ఒక్కో సబ్జెక్టుకు సుమారు 3,000 ప్రశ్నలతో ప్రశ్నల బ్యాంక్ (Question Bank) సిద్ధం చేస్తారు. మొత్తం 42 వేల ప్రశ్నలు అందులో ఉంటాయి.

నిపుణులు తయారుచేసిన ప్రశ్నపత్రాలను టీసీఎస్ (TCS) సర్వర్‌లో అప్‌లోడ్ చేస్తారు. ప్రశ్నల బ్యాంక్‌కు శాశ్వత ఉద్యోగులైన ఇద్దరికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ప్రతి రోజూ పాస్‌వర్డ్లు మారుతూ ఉంటాయి.

సిస్టమ్‌లో ఎన్‌క్రిప్ట్ చేసిన ప్రశ్నపత్రాలు పరీక్ష సమయంలో మాత్రమే డీక్రిప్ట్ అవుతాయి. అంతేకాకుండా ప్రతి అభ్యర్థికి ప్రశ్నల క్రమం జంబుల్ (Jumble) రూపంలో వెళ్తుంది. అందువల్ల ప్రశ్నపత్రాల లీకేజీకి ఏమాత్రం అవకాశం ఉండదు.

31/05/2026

టీచర్ రిక్రూట్మెంట్ కోసం కొత్తగా నిబంధనలు రూపొందించాం. ప్రతి అంశాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి, వెబ్‌సైట్లలో పొందుపరిచాం. గత డీఎస్సీల నిర్వహణ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను నిర్వహించాం.


31/05/2026

సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో భాగంగా ముందుగా సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని నిబంధన పెట్టాం. అయితే వేర్వేరు చోట్ల చదివిన కారణంగా, వెరిఫికేషన్ సమయంలోనే సర్టిఫికెట్లు చూపిస్తామని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. కొందరు అభ్యర్థులు ఈ నిబంధనను సడలించాలని కోరడంతో దానిని సవరించాం.

గత అనుభవాల దృష్ట్యా వెయిటింగ్ లిస్ట్‌కు బదులుగా 1:1 పద్ధతిలో అభ్యర్థులను పిలిచాం. ఈ విషయాన్ని అప్పుడే అందరికీ స్పష్టంగా తెలియజేశాం. వెరిఫికేషన్‌లో ఎవరైనా అనర్హులుగా తేలితే, వారి తర్వాతి ర్యాంకులో ఉన్న అభ్యర్థిని వెరిఫికేషన్‌కు పిలిచాం.



Address

Guntur East
Ponnur
522124

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Guntur East posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Guntur East:

Share