Keesari NarsiReddy

Keesari NarsiReddy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Keesari NarsiReddy, Social service, Thunbavi post Panthangi modal CHOTUPALLA dist nalgonda pin, Pin.

సుద్దులు  -నవతెలంగాణ సంపాదకీయం ‘కులం పునాదుల మీద మనం దేనినీ నిర్మించలేము. ఒక నీతిని కానీ, ఒక జాతిని కానీ’ అని అంబేద్కర్‌...
25/08/2024

సుద్దులు
-నవతెలంగాణ సంపాదకీయం

‘కులం పునాదుల మీద మనం దేనినీ నిర్మించలేము. ఒక నీతిని కానీ, ఒక జాతిని కానీ’ అని అంబేద్కర్‌ మహాశయుడు స్పష్టంగానే సెలవిచ్చారు. అతను మన రాజ్యాంగ నిర్మాత, రూపశిల్పి. ఈ దేశం ఏ విలువలతో నడవాలో, నవభారతాన్ని ఎలా నిర్మించుకోవాలో రాజ్యాంగం మనకు చెబుతుంది. నిర్దేశిస్తుంది. ‘కులం కులం అని కుత్సితాలు పెంచుకోకు, ఓ కూటికి లేనివాడా… మతం మతం అని మాత్సర్యం పెంచుకోకూ’… అని చిన్నపుడు పాడుకునేవాళ్లం. ‘కులమతాలు గీచుకున్న గీతలజొచ్చి, పంజరానగట్టు వడనునేను, నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తరుగులేదు విశ్వనరుడ నేను’ అని జాషువా మహాకవి కులాల, మతాల పంజరాన్ని తన దరికి రానీయనని తేల్చిచెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ నిచ్చెనమెట్ల కులవ్యవస్థే, మన దేశం అభివృద్ధిలో వెనకపడటానికి ప్రధాన కారణమని ఎన్నో విశ్లేషణలు వచ్చాయి. ఇప్పటికీ కుల,మత భేదాలతో, వివక్షతలతో మనుషులనే హతమారుస్తున్న సంఘటనలు కోకొల్లలు. చదువుకున్న వాళ్లలోనూ, చదువురాని వాళ్లలోనూ, పట్టణాల్లో, గ్రామాల్లో ఎక్కడ చూసినా ఈ కుల దుర్వాసన వీడటంలేదు మనల్ని.

మన సమాజంలో ఎన్నో మార్పులొచ్చాయి. అనేక సంప్రదాయాలు చెదిరిపోయాయి. కానీ కులం మాత్రం చెదరలేదు. చెదిరినా, కులంగానే చెదిరింది. పొద్దంతా కూటికోసం పనిచేసే మనుషులు సాయంత్రానికి గూటిలోకి చేరుకున్నట్లు, కులంలోకి చేరుకుంటారు. వివక్షతలు, ఘర్షణలు, తగాదాలు, చంపుకోడాలు, రక్తప్రవాహాలు, సమీకరణలు, పదవులు, ఉద్యోగాలు, చదువులు, సంబంధాలు…అన్నిట్లో అన్ని సందర్భాల్లో నూ కులం వెన్నెంటే ఉంటుంది. ఆ మధ్య ఒక యాడ్‌లో ‘వేర్‌ యు గో, ఐ ఫాలో’ అన్నట్లుగా మన కళ్లలో కులం చూపుకొనసాగుతునే ఉంది. కులం గురించి కులపరంగానే మాట్లాడుతాం, కులం పోవాలనీ చర్చలు చేస్తాం. అన్ని మాటలకే పరిమితం. ఆఖరికి చర్చల్లోనే కుల నిర్మూలన మిగిలింది. ఇది అసలైన విషాదం! ఆఖరికి కులం వల్ల అనేక బాధలకు, ఇబ్బందులకు గురవుతున్న వాళ్లు కూడా నిర్మూలన మాటెత్తడంలేదు. ఎందుకంటే వివక్షతనే నిర్మూలించలేకపోయామనే నిస్పృహ కావచ్చు.

ఆ చర్చనలా ఉంచితే, ఈ మధ్య ఆరెస్సెస్‌. వారి పాంచజన్య పత్రిక సంపాదకీయంలో కులం గురించి వారి నిజమైన నైజాన్ని బయటపెట్టింది. ఇదే సందర్భంలో పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీని ఉద్దేశించి, కులగణన ప్రస్తావనలో బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాగూర్‌ అసలు ‘నీ కులమేమిటి’ అని అనుచితమైన వ్యాఖ్య చేశారు. ఇప్పుడీ పాంచజన్య – భారతీయ సమాజంలో కులం అ

సమన్యాయం.. సమాఖ్య స్ఫూర్తి.. పునర్విభజనకు ప్రాతిపదికలు                  -రిత్విక శర్మ న్యాయ నిపుణులు, విధి సెంటర్‌ ఫర్‌ ...
25/08/2024

సమన్యాయం.. సమాఖ్య స్ఫూర్తి.. పునర్విభజనకు ప్రాతిపదికలు
-రిత్విక శర్మ
న్యాయ నిపుణులు, విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ

మన లోక్‌సభలో 543 సీట్లు ఉన్నాయని అందరికీ తెలుసుకానీ, వాటిని ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారనే దానిపై చాలామందికి పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. ప్రతి రాష్ట్రానికీ దాని జనాభాను బట్టి నియోజకవర్గాలను కేటాయించాలని 81వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తోంది. జనాభా హెచ్చు తగ్గులను బట్టి నిర్ణీత కాలవ్యవధిలో నియోజకవర్గాలను పునర్విభజించాల్సి ఉంటుంది. కొంతకాలంగా ఈ ప్రక్రియ వాయిదాపడుతూ వస్తోంది.

లోక్‌సభ ఎన్నికల తరవాత నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని 2023 సెప్టెంబరులో కేంద్ర హోంమంత్రి వెల్లడించారు. మొదట జనగణన నిర్వహిస్తామని, ఆపై నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని ప్రకటించారు. ఇక్కడ నియోజకవర్గమంటే ప్రజలే తప్ప మరొకటి కాదు. నియోజకవర్గ ప్రజలు, అంటే ఓటర్లు తమ తరఫున లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించడానికి ఒక సభ్యుణ్ని ఎన్నుకుంటారు. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలవారీగా నియోజకవర్గాల విభజన, స్థిరీకరణ జరుగుతుంది.

జనాభా అధికమైనప్పుడు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుంది. రాజ్యాంగం పౌరులందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పిస్తోంది కాబట్టి... నియోజకవర్గాలు జనాభాకు అనుగుణంగా ఉండేలా చూడాలన్నది పాత సూత్రం. ఒక పౌరుడి ఓటు విలువ మరే ఇతర పౌరుడి ఓటు విలువకూ తీసిపోని విధంగా అంటే సమానంగా ఉండేలా చూడటమే ఇందులోని పరమార్థం. దీన్నే ‘ఒక వ్యక్తి- ఒక ఓటు- ఒకే విలువ’ సూత్రం అంటారు. తద్వారా జనాభాపరంగా నియోజకవర్గాల మధ్య సమతుల్యత ఉండేలా చూస్తున్నారు.

పదేపదే వాయిదా...
పదేళ్లకు ఒకసారి జరిగే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. జనాభా పెరిగితే నియోజకవర్గాల సంఖ్యనూ పెంచాలని అది పేర్కొంది. కానీ, 1970 దశకం నుంచి దేశ జనాభా పెరిగినా నియోజకవర్గాల సంఖ్యను పెంచలేదు. 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణే దీనికి కారణం. 1971 జనగణన ప్రకారం నిర్దేశించిన లోక్‌సభ నియోజకవర్గాలే 2001 వరకు కొనసాగుతాయని 42వ రాజ్యాంగ సవరణ పేర్కొంది. కుటుంబ నియంత్రణను సమర్థంగా పాటించి జనాభా పెరుగుదలకు పగ్గాలు వేసిన దక్షిణాది రాష్ట్రాలు తమ విజయాలే శాపాలై లోక్‌సభలో తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని అప్పట్లోనే ఆందోళన వెలిబుచ్చాయి. దాన్ని ఉపశమింపజేయడానికే నియోజకవర్గాల పునర్విభజనను 2001వరకు వాయిదా వేశార

ఎల్‌ఐసి బలోపేతమే…        స్వాతంత్రోద్యమ స్ఫూర్తి                – పి.సతీష్‌               94417 97900లైఫ్‌ ఇన్సురెన్స్‌ ...
25/08/2024

ఎల్‌ఐసి బలోపేతమే…
స్వాతంత్రోద్యమ స్ఫూర్తి
– పి.సతీష్‌
94417 97900

లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి)లో ప్రభుత్వ వాటాల అమ్మకం మరోసారి జరగనుందనే వార్తలు గుప్పుమంటున్నాయి.ఇప్పటికే 2022లో 3.5శాతం వాటాలు అమ్మి, రూ 21వేల కోట్లు ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంది. ‘సెబి’ నియమావళి ప్రకారం, ఒకసారి స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయిన ప్రభుత్వ రంగ సంస్థలు మూడేండ్లలో 25శాతం వాటాలు అమ్మాలి. అయితే,ఈ నిబంధనకు ఎల్‌ఐసికి మినహాయింపుతో మూడేండ్లు కాకుండా పదేండ్ల సమయ మిచ్చారు. దీనర్థం, 2032 మే లోపు, ఎల్‌ఐసి 25 శాతం వాటాలు విక్రయించాల్సి ఉంటుంది. మరి ఈలోగా ఐదు శాతం వాటాలు అమ్మాల్సిన అవసరం ఏమిటి? ఎల్‌ఐసి షేర్‌ విలువ భారీగా పెరిగిన దృష్ట్యా, ఒకవేళ ఐదు శాతం వాటాలు అమ్మితే, ప్రభుత్వానికి ఆర్థిక ప్రయోజనం కలిగిస్తుంది తప్ప, ఎల్‌ఐసికి ఒరిగేదేమీ లేదు.పైపెచ్చు, ప్రభుత్వ వాటాల అమ్మకం స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి విఘాతం.
స్వాతంత్రోద్యమ సమయంలో వెల్లివిరిసిన జాతీయ స్పృహలో అంతర్భాగమే బీమా జాతీయకరణ ఆలోచన.స్వాతంత్రోద్యమం కేవలం వలస పాలన నుండి విముక్తిని పొందడమే కాకుండా, స్వేచ్చాయుతమైన సమసమాజ స్థాపనను లక్ష్యంగా పెట్టుకుంది.దోపిడీని అంతమొందించాలంటే, రాజకీయ స్వేచ్ఛతో బాటు, ఆకలితో ఉన్న లక్షలాది మంది నిజమైన ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని 1931లో కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సదస్సు ప్రకటించింది. 1934లో జరిగిన కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ గ్రూప్‌ సమావేశంలో పొందుపరిచిన చార్టర్‌ ఆఫ్‌ ఫ్రీడంలో ‘ప్రజల చిన్న మొత్తాల పొదుపులను జాతీయం చేయాల్సిన అవసరం ఉందనీ, దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం ప్వ్యూహాత్మక స్థానాన్ని కలిగిఉండాలని కాంగ్రెస్‌ గట్టిగా నమ్ముతుందని రాసుకున్నారు’. అందువల్ల, ప్రజల పొదుపుపై ప్రభుత్వం నియంత్రణ కలిగి ఉండాలని, వాటిని ప్రయివేటు సంస్థల పరం చేయకుండా జాతీయాభివృద్ధికి మాత్రమే ఉపయోగించు కోవాలనేదానిపై, స్వాతంత్రోద్యమం చాలా స్పష్టమైన అవగాహనతో ఉందని మనకు అర్ధమౌతుంది.

జీవిత బీమా అనేది దీర్ఘకాల పెట్టుబడి అయిన కారణంగా, బీమా వ్యాపారం కేవలం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అందుచేతనే, బీమా రంగం ప్రభుత్వ అజమాయిషీలోనే ఉండాలని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ తన స్టేట్స్‌ అండ్‌ మైనారిటీస్‌ గ్రంథంలో పేర్కొన్నారు. బీమా వ్యాపార నిర్వహణ, యాజమాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వానికి బదిలీ చేసే చట్టాన్ని అమలు చేయడానికి వ

** రైతు భరోసా ఆలస్యమేనా?August 12, 2024  1:52 amFarmer assurance delayed?– వానాకాలానికి అందనట్టేనా?– సబ్‌ కమిటీ నివేదిక ...
17/08/2024

** రైతు భరోసా ఆలస్యమేనా?
August 12, 2024 1:52 am
Farmer assurance delayed?– వానాకాలానికి అందనట్టేనా?
– సబ్‌ కమిటీ నివేదిక రావాలి
– అసెంబ్లీలో చర్చ.. ఆ తర్వాతే రైతు సాయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతు భరోసా (రైతుపెట్టుబడి సాయం) ఆలస్యం కానుందా? ఈ వానాకాలం సీజన్‌కు అందనట్టేనా? తాజాగా రైతుల్లో నెలకొన్న సందేహాలివి. రాష్ట్ర ప్రభుత్వం సబ్‌ కమిటీ వేయడం, అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పడంతో మరింత కాలయాపన అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ కమిటీ ఇప్పటికే పది జిల్లాల్లో పర్యటించింది. పలువురు మేధావులు, రైతు సంఘాలు, రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇంకా నివేదిక రూపొందించాల్సి ఉన్నది. దాని ఆధారంగా అసెంబ్లీల్లో చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు దఫాలుగా చెప్పిన విషయం తెలిసిందే. జూన్‌ మొదటివారం నుంచి వానాకాలం సీజన్‌ ప్రారంభమయ్యింది. ఆ సమయంలో వానలు కురిశాయి. విత్తనం నాటడం మొదలైంది. రైతులకు పంట పెట్టుబడి సాయం అవసరమవుతున్నది. మరో రెండు నెలలైతే యాసంగి సీజన్‌ కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఆరుతడి పంటలతోపాటు వరి నాట్లు పూర్తి కావొస్తున్నాయి. కానీ రైతు భరోసా అందలేదు. మరింత ఆలస్యమవుతుందని ప్రభుత్వం సాంకేతాలిస్తున్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయాన్ని అందిస్తామని చెప్పింది. దానికి అనుగుణంగా రైతుబంధు ఇవ్వడంలో కొనసాగిన లోపాలను సరిదిద్దాలని నిర్ణయించింది. అందులో భాగంగా ముగ్గురు మంత్రులతో కూడిన సబ్‌ కమిటీని నియమించింది. రైతు బంధు తీసుకుంటున్న రైతుల వివరాలను సేకరించడంతోపాటు విధి, విధానాలను ఖరారు చేయనుంది. బీఆర్ఎస్‌ ప్రభుత్వం పాస్‌బుక్‌ ఉన్న ప్రతీ రైతుకు రైతు బంధు పథకం కింద ఎకారకు రూ ఐదువేల చొప్పున ఏడాదికి పదివేల రూపాయల పెట్టుబడి సాయం అందజేసింది. దీంతో సాగు చేయని భూములకు, రహదారులు, రియల్‌ ఎస్టేట్‌ భూములకు, ఇండ్లకు, ప్లాటింగ్‌ చేసిన భూములకు రైతు బంధు అందిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు 1.50 కోట్ల ఎకరాల సాగు చేస్తున్నారు. రైతు భరోసా కింద అనర్హులను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నది. గత ప్రభుత్వం ప్రతి సీజన్‌కు రూ 7560వేల కోట్ల చొప్పున వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి దాదాపు రూ 15వేల కోట్ల చొప్పున ఇచ్చింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు రూ.7500 చొప్పున ఏడాదికి రూ 15వేల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చింది. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ ఇప్పటికే రుణమాఫీ కోసం రూ 30వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పింది. రెండు దఫాలుగా రుణమాఫీ చేసింది. దీంతో రైతు భరోసాకు కావాల్సిన నిధులు సమకూర్చడం సర్కారుకు పెను సవాల్‌గా మారింది. ప్రభుత్వం అనుకున్న రైతు రుణమాఫీ పూర్తి అయిన తర్వాతే రైతు భరోసాపై దృష్టి సారించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొంత ఆలస్యమైనా, రైతులు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నా ఆ తర్వాత ఎకరాకు సీజన్‌కు రూ. 7500 చొప్పున ఇస్తామని భరోసా ఇస్తున్నది.

ప్రజాస్వామ్య లోటుతో బంగ్లా ప్రళయం                  -పి. చిదంబరం  కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులుజూలై 4, ...
17/08/2024

ప్రజాస్వామ్య లోటుతో బంగ్లా ప్రళయం
-పి. చిదంబరం
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు

జూలై 4, 1776న పదమూడు అమెరికా రాష్ట్రాలు తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాయి. ఫ్రెంచ్‌ విప్లవం సంభవించి రెండు శతాబ్దాలకు పైగా గడిచిపోయింది. బ్రిటిష్‌ సామ్రాజ్యం నుంచి స్వేచ్ఛ పొందిన తొలి వలస రాజ్యం ఆస్ట్రేలియా (1901లో). భారత్‌ 1947లో స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నది. అమెరికా, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా ఇప్పటికీ స్వతంత్ర, ప్రజాస్వామిక దేశాలుగా వర్థిల్లుతున్నాయి. వలస పాలనా శక్తుల (బ్రిటన్‌, ఫ్రాన్స్‌, బెల్జియం, పోర్చుగల్‌ మొదలైనవి) నుంచి విముక్తి పొందిన దేశాలన్నీ చిరకాలం నిజంగా ‘స్వతంత్ర’ దేశాలుగా లేవు. పలు దేశాల పౌరులు అందరూ పౌర స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు పూర్తిగా నోచుకోవడం లేదు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షికమైన ఎన్నికలలో తాము కోరుకుంటున్న వారిని ఎన్నుకోలేని దుస్థితి నెదుర్కొంటున్నారు. ఒక అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో కేవలం 20 శాతం మంది మాత్రమే నిజమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను పొందుతున్నారు. ప్రజాస్వామిక హక్కులను అనుభవిస్తున్నారు. ఆ అదృష్ట భాగ్య దేశాలలో భారత్‌ కూడా ఉన్నది. ఇది మనకు సంతోషకరమేకాదు, గర్వకారణం కూడా.

ప్రజాస్వామ్యం ఒకరు ఇచ్చేది కాదు. మరొకరి నుంచి స్వీకరించేదీ కాదు. ఆగస్టు 14, 1947న పాకిస్థాన్‌ స్వతంత్ర దేశంగా ప్రభవించింది. అయితే అనేకమార్లు సైనిక నియంతృత్వ పాలనలోకి వెళ్లింది. మన మరో పొరుగు దేశం (తొలుత పాకిస్థాన్‌లో ఒక రాష్ట్రంగా ఉన్న) బంగ్లాదేశ్‌ పాకిస్థాన్‌ను ఏలిన సైనిక ప్రభుత్వాల పద ఘట్టనలో దశాబ్దాల పాటు నలిగిపోయింది. సైనిక పాలకులపై తిరుగుబాటుగా గెరిల్లా ఉద్యమం ఆరంభమయింది. క్రమేణా బలోపేతమై విముక్తి పోరాటంగా పరిణమించింది. భారత్‌ జోక్యంతో 1971లో బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1975–91 సంవత్సరాల మధ్య పలువురు సైనిక పాలకులు వచ్చారు, పోయారు. ప్రధాన రాజకీయ పక్షాలు అవామీ లీగ్‌, బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ (బిఎన్‌పి) కలసికట్టుగా సైనిక పాలకులను వ్యతిరేకించాయి. ప్రజాస్వామ్యం కోసం పోరాడాయి. 1991లో పౌర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అవామీ లీగ్‌ అధినేత్రి బేగం షేక్‌ హసీనా ప్రధానమంత్రిగా 1996లో ప్రప్రథమంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2008, 2014, 2019, 2024లో ఆమె ప్రధానమంత్రిగా ఎన్నికవుతూ వచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఎన్నికలను ప్రతిపక్షాలు బాయ్‌కాట్‌ చేశాయి.

షేక్‌ హసీనా నేతృత్వంలో బంగ్లాదేశ్‌ గణనీయమైన ఆర్థిక పురోగతిని సాధించింది. బంగ్లా తలసరి ఆదాయం భారత్‌ తలసరి ఆదాయం కంటే అధికం. శ్రీలంక, పాకిస్థాన్‌, నేపాల్‌ మొదలైన ఇతర దక్షిణాసియా దేశాల కంటే కూడా బంగ్లాదేశ్‌ ముందంజ వేసింది. మానవాభివృద్ధి సూచీలో బంగ్లాదేశ్‌, శ్రీలంక తరువాయి స్థానంలో ఉన్నది; భారత్‌, నేపాల్‌, పాకిస్థాన్ కంటే ఉన్నత స్థాయిలో ఉన్నది. బంగ్లాదేశ్‌లో శిశు మరణాల రేటు భారత్‌లో కంటే తక్కువగా నమోదవుతోంది. ఇదిలా ఉంటే ఎన్నికల నిర్వహణలో ఢాకా పాలకుల వ్యవహార శైలిని ఫ్రీడమ్ హౌజ్‌ నివేదిక తూర్పార బట్టింది. అలాగే పత్రికా స్వాతంత్ర్యం, న్యాయ వ్యవస్థ స్వతంత్రత, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విషయంలో కూడా బంగ్లా పాలకుల తీరు తెన్నులు అంతర్జాతీయ సంస్థల ఆమోదాన్ని పొందలేదు. ప్రజాస్వామ్య స్వేచ్ఛలను అదుపు చేస్తే లేదా నిరుద్యోగిత, అసమానతలు, వివక్షలపై ప్రజల అసంతృప్తి తగ్గితేనే ఆర్థికాభివృద్ధి సుసాధ్యమవుతుందని పాలకులు భావించడం కద్దు. అయితే ఇది చాలా చాలా అరుదుగా మాత్రమే నిజం. బంగ్లాదేశ్‌లో పాలకుల పట్ల ప్రజల వ్యతిరేకత మహోధృతంగా వెల్లువయింది. ప్రభుత్వోద్యోగాలలో వివక్షాపూరిత, ఆశ్రిత పక్షపాత రిజర్వేషన్ల విధానంతో విద్యార్థిలోకం ఆగ్రహావేశాలకు అవధులు లేకపోయాయి. ప్రజాస్వామ్య ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లాయి.

ఇదిలా వుండగా ఆర్థిక వ్యవస్థ పెరుగుదల మందగించింది. ధరలు పెరిగాయి. ఉద్యోగాలు మృగ్యమయ్యాయి. పరిస్థితులు విషమిస్తున్నాయన్న వాస్తవాన్ని షేక్‌ హసీనా గుర్తించలేదు. గుర్తించినా నిరాకరిస్తూ వచ్చింది. ఇది నియంతలు అందరూ చేసే తప్పే. రిజర్వేషన్ల విధానం ఆందోళనాగ్నులకు ఆజ్యం పోసింది. అవినీతి, పోలీసు క్రౌర్యాలు, న్యాయవ్యవస్థ ఉదాసీనత మొదలైనవి కూడా బంగ్లా ప్రజల ఆందోళనను మరింత తీవ్రం చేశాయి. పర్యవసానాలు సుపరిచితమైన కథే కదా. సకల జనులు వీథుల్లోకి వచ్చారు. పోటెత్తారు. పోరాటాల వెల్లువలకు అడ్డు లేకపోయింది. ఇటువంటి పరిణామాలు ప్రభుత్వాలను కూల్చివేయడం సహజమే.

ప్రజలు పూర్తిగా ఆశాభావాన్ని కోల్పోయినప్పుడే సామూహికోద్యమాలు ప్రజ్వరిల్లుతాయి. స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని మార్చివేసే మార్గం పూర్తిగా మూసుకుపోయినప్పుడు ప్రజల అసంతృప్తి, ఆగ్రహానికి అంతు ఉండదు. ప్రజాందోళనలు ఒకసారి ప్రారంభమయితే అందులో సామాన్య ప్రజలు మాత్రమే ఉండరు. తీవ్రవాద శక్తులు ఉగ్రవాద బృందాలు కూడా పాల్గొంటాయి బంగ్లాదేశ్‌లో ఇదే జరిగింది. వివిధ సంస్థలు, పలువురు వ్యక్తులు ఈ వాస్తవాన్ని ధ్రువీకరించారు. విదేశీ జాతీయులు, మైనారిటీ వర్గాలు ఉద్యమ తీవ్రతను చవిచూడడం అనివార్యమవుతుంది. అల్పసంఖ్యాక వర్గాల గృహాలపై దాడులు జరుగుతాయి. వారి వ్యాపార సంస్థలు, ఆరాధనా మందిరాలను ధ్వంసం చేస్తారు.

బంగ్లాదేశ్‌లో పరిస్థితులు అందుకు భిన్నమైనవి కావు. చాలా దేశాలలో అటువంటి ఉపద్రవాలలో మైనారిటీలు తీవ్ర ఇక్కట్లనే ఎదుర్కొన్నారు. కారణమేమిటి? ప్రజాస్వామ్య లోటు. దానివల్లే ప్రజలు వీథుల్లోకి వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అనివార్యమవుతుంది. పరిష్కారమేమిటి? ప్రజాస్వామ్య లోటును పూరించడమే. ప్రజాస్వామ్య లోటును పూరించడమనే కళలో అమెరికా, బ్రిటన్‌లు దాదాపుగా సమగ్ర ప్రావీణ్యాన్ని, పరిణతిని సాధించాయి. పార్టీలోను, పార్లమెంటులోను, ప్రజలలోను అసంతృప్తి తీవ్రమయినప్పుడు బ్రిటిష్‌ ప్రధానమంత్రులు థాచర్‌, జాన్సన్‌, మే స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలిగి కొత్త నాయకుడిని ఎన్నుకొనే అవకాశాన్ని తమ పార్టీకి కల్పించారు. అమెరికా అధ్యక్షుడు లిండన్‌ బి జాన్సన్‌, జో బైడెన్‌లు అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేసేందుకు నిరాకరించారు. జవాబుదారీతనాన్ని డిమాండ్‌ చేసి ప్రభుత్వాధినేతల రాజీనామాలు సాధించవచ్చు. పదవీకాల పరిమితులు కూడా చాలా ఉపయోగపడతాయి. పత్రికా స్వేచ్ఛ సంపూర్ణంగా ఉంటే పరిస్థితులను చక్కదిద్దడం మరింత తేలికవుతుంది సుప్రీంకోర్టు అప్రమత్తంగా ఉండి ప్రజాస్వామ్య కాపలాదారుగా వ్యవహరించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. స్వతంత్ర ఎన్నికల సంఘం ప్రతి ఐదేళ్లకు ఒకసారి విధిగా ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించడం వల్ల పేదలు, అణగారిన వర్గాలవారు, నిర్లక్ష్యానికి గురవుతున్న వారికి ఎంతైనా ఉపశమనం కలుగుతుంది. పార్లమెంటు ప్రతి నెలా విధిగా సమావేశమవుతూ సభాపతి అనవసర జోక్యం లేకుండా ప్రతి రోజూ అధికార, ప్రతిపక్షాల మధ్య వాద ప్రతివాదనలు అనుమతించడమే ప్రజాస్వామ్య లోటుకు అంతిమ సమాధానమని నేను భావిస్తున్నాను.

ప్రజాస్వామ్య లోటుకు బంగ్లాదేశ్‌ భారీ మూల్యాన్ని చెల్లించింది. ప్రజా ప్రళయాగ్నులలో ఆహుతి అయిన వారి కోసం నేను దుఃఖిస్తున్నాను.

అదానీ గ్రూపులో సెబీ చీఫ్‌ పెట్టుబడులు– భర్త కూడా వాటాదారే– వాటాల నికర విలువ రూ. 83 కోట్లు– అందుకే చర్యల్లేవు– షెల్‌ కంపె...
12/08/2024

అదానీ గ్రూపులో సెబీ చీఫ్‌ పెట్టుబడులు

– భర్త కూడా వాటాదారే
– వాటాల నికర విలువ రూ. 83 కోట్లు
– అందుకే చర్యల్లేవు
– షెల్‌ కంపెనీలకు సొమ్ము తరలించినా మౌనం వహించారు
– బాంబు పేల్చిన హిండెన్‌బర్గ్‌

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ సంస్థ అదానీ గ్రూపు కంపెనీపై శనివారం రాత్రి మరో బాంబు పేల్చింది. అదానీ గ్రూపుతో సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) ఛైర్‌పర్సన్‌ మాధబి పూరి బచ్‌కు ఉన్న సంబంధాలను బహిర్గతం చేసింది. బెర్ముడా, మారిషస్‌కు చెందిన కొన్ని విదేశీ కంపెనీల్లో గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ నియంత్రణలో ఉన్నాయని, వీటిలో సెబి ఛైర్‌పర్సన్‌, ఆమె భర్త ధావల్‌ బచ్‌కు వాటాలు ఉన్నాయని తెలిపింది. ఈ దంపతుల వాటాల నికర విలువ సుమారు రూ.83 కోట్ల వరకూ ఉండవచ్చునని చెప్పింది. అదానీ గ్రూపుకు వ్యతిరేకంగా గత సంవత్సరం జనవరిలో తాను ఇచ్చిన నివేదికపై చర్యలకు ఈ కారణంతోనే సెబీ విముఖత చూపిందని వివరించింది. అయితే ఈ ఆరోపణలను సెబీ ఛైర్‌పర్సన్‌, ఆమె భర్త తోసిపుచ్చారు. ఇవి నిరాధార ఆరోపణలని అంటూ హిండెన్‌బర్గ్‌ తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని మండిపడ్డారు. సెబీ చీఫ్‌పై హిండెన్‌బర్గ్‌ పది ప్రధాన ఆరోపణలు చేసింది. ఆ వివరాలు…

షెల్‌ కంపెనీలకు నిధుల తరలింపు
అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్‌ నివేదిక ఇచ్చి 18 నెలలు గడిచాయి. అదానీ గ్రూప్‌ సంస్థల వాటాల విలువను కృత్రిమంగా పెంచేందుకు మారిషన్‌ ఫండ్లను ఉపయోగించారు. వీటిలో సెబీ చీఫ్‌, ఆమె భర్త వాటాలు కొనుగోలు చేశారు. మారిషస్‌, ఆఫ్‌షోర్‌ షెల్‌ కంపెనీల వివరాలను అదానీ గ్రూపు బయటపెట్టనప్పటికీ సెబీ ఎలాంటి ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అదానీ డైరెక్టర్‌ ఒకరు ఇండియా ఇన్ఫోలైన్‌ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌ఎల్‌) ద్వారా ‘ఐపీఈ ప్లస్‌ ఫండ్‌’ పేరిట మారిషస్‌లో ఓ చిన్న ఆఫ్‌షోర్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశారని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. అదానీ గ్రూపు సొమ్మును గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ ఆ ఫండ్‌లోకి తరలించారు. అందుకోసం విద్యుత్‌ పరికరాల కొనుగోలు ఇన్వాయిస్‌ను పెంచి చూపారు. దానిని భారతీయ మార్కెట్‌లో పెట్టుబడికి ఉపయోగించారు. నిధుల తరలింపు కోసం అదానీ గ్రూపు ఉపయోగించుకున్న రెండు ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌లో సెబీ చీఫ్‌, ఆమె భర్త వాటాలు కొనుగోలు చేశారని విజిల్‌బ్లోయర్‌ పత్రాల ద్వారా తెలుస్తోందని హిండెన్‌బర్గ్‌ అంటోంది. అదానీ ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌లో ఎవరు పెట్టుబడులు పెట్టారో సెబీ కనుగొనలేక పోయిందని సుప్రీంకోర్టు తెలి పింది. గత సంవత్సరం హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికలో ఆ పెట్టుబడిదారుల సమాచారం ఉంది. అయితే దానిని సెబీ ఛైర్‌పర్సన్‌ పరిశీలించలేదు.

ఆఫ్‌షోర్‌ సింగపూర్‌ సంస్థపై ఆసక్తి
ఈయూ రీసర్జెంట్‌ ఫండ్‌, ఎమర్జింగ్‌ ఇండియా ఫోకస్‌ ఫండ్‌ పేరిట భారతీయ సంతతికి చెందిన అదానీ వాటాదారులే ఐఐఎఫ్‌ఎల్‌ను నిర్వహించారని, వారిపై కూడా సెబీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని హిండెన్‌బర్గ్‌ తెలిపింది. 2017 ఏప్రిల్‌ నుండి 2022 మార్చి వరకూ మాధబి బంచ్‌ సెబీలో హోల్‌టైమ్‌ సభ్యురాలు. అరోగా పార్ట్‌నర్స్‌ అనే ఆఫ్‌షోర్‌ సింగపూర్‌ కన్సల్టింగ్‌ సంస్థపై ఆమె నూరు శాతం ఆసక్తి చూపారు. సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితురాలు అయిన రెండు వారాల తర్వాతే… అంటే 2022 మార్చి 16న ఆమె తన వాటాలను భర్త ధావల్‌ బచ్‌కి బదిలీ చేశారని హిండెన్‌బర్గ్‌ ఆరోపిస్తోంది. ధావల్‌ బచ్‌ 2019లో బ్లాక్‌స్టోన్‌ కంపెనీ సీనియర్‌ సలహాదారుగా నియమితులయ్యారు. అప్పుడు ఆమె సెబీలో హోల్‌టైమ్‌ సభ్యురాలుగా ఉన్నారు. లింకెడిన్‌లో ధావల్‌ బచ్‌ ప్రొఫైల్‌ను పరిశీలించగా…రియల్‌ ఎస్టేట్‌లో కానీ, క్యాపిటల్‌ మార్కెట్లలో కానీ ఆయన ఎన్నడూ ఫండ్‌ కోసం పనిచేయలేదని తేలింది.

నిరాధారం : సెబీ ఛైర్‌పర్సన్‌
హిండెన్‌బర్గ్‌ తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని, దాని నివేదిక దూషణలతో కూడి ఉన్నదని మాధబి పురి బచ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. తమకు సంబంధించిన అన్ని ఆర్థిక పత్రాలను ఎవరికైనా, ఏ సంస్థకైనా చూపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హిండెన్‌బర్గ్‌ తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడడం విచారకరమని ఆమె వాపోయారు.

వాస్తవాన్ని మరుగుపరచి…
ధావల్‌ బచ్‌ బ్లాక్‌స్టోన్‌ కంపెనీ సీనియర్‌ సలహాదారుగా, ఆయన భార్య సెబీ అధికారిగా ఉన్న సమయంలో బ్లాక్‌స్టోన్‌ సంస్థ మైండ్‌స్పేస్‌ అండ్‌ నెక్సస్‌ సెలక్ట్‌ ట్రస్టును స్పాన్సర్‌ చేసింది. ఇది భారత్‌లో ఐపీఓకు సెబీ అనుమతి పొందిన రెండవ, నాలుగవ రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రెయిట్‌). బ్లాక్‌స్టోన్‌కు ధావల్‌ బచ్‌ సీనియర్‌ సలహాదారుగా ఉన్నప్పుడు రెయిట్‌ నిబంధనల్లో గణనీయమైన మార్పులకు సెబీ అనుమతి ఇచ్చింది. రెయిట్‌ను ‘భవిష్యత్తులో తన అనుకూల ఉత్పత్తులు’గా మాధబి బచ్‌ అభివర్ణించారు. దానిలో మదుపు చేయాల్సిందిగా పెట్టుబడిదారులను ప్రోత్సహించారు. ఈ పెట్టుబడుల కారణంగా తన భర్త సీనియర్‌ సలహాదారుగా ఉన్న బ్లాక్‌స్టోన్‌ కంపెనీ లబ్ది పొందుతుందన్న వాస్తవాన్ని మాత్రం ఆమె దాచిపెట్టారు.

జీతం కంటే ఆ రాబడే అధికం
తన భర్త డైరెక్టర్‌గా ఉన్న భారతీయ కన్సలింగ్‌ కంపెనీ అరోగా అడ్వయిజరీలో మాధబి బచ్‌కు 99 శాతం వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. 2022లో ఈ సంస్థ కన్సల్టెంగ్‌ సేవల ద్వారా 261,000 డాలర్లు ఆర్జించిందని, సెబీలో ఆమె పొందే జీతం కంటే ఇది 4.4 రెట్లు అదనమని తెలిపింది.

నెటిజన్ల విసుర్లు
అదానీ గ్రూపు కంపెనీలో సెబీ ఛైర్‌ పర్సన్‌, ఆమె భర్త పెట్టుబడులు పెట్టారని, అందుకే తాను ఇచ్చిన నివే దికపై సెబీ ఎలాంటి చర్య తీసుకోలేదని హిండెన్‌బర్గ్‌ చేసిన తాజా ఆరో పణపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘హిండెన్‌ బర్గ్‌ నివేదిక ఇచ్చిన కొన్ని నిమిషాలలోనే సెబీ ఇండియా తన ట్విటర్‌ ఖాతాను మూసేసింది. భయానక వాతా వరణం కన్పిస్తోంది’ అని రోషన్‌ రారు అనే నెటిజన్‌ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌, సెబీ చీఫ్‌ మాధబి బచ్‌…ఈ ఇద్దరు మహిళలు కలిసి ఒంటిచేత్తో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని సన్నీ దాస్‌ అనే నెటిజన్‌ మండిపడ్డారు. ఆయన నిర్మల, మాధబి బచ్‌ కలిసి ఉన్న ఫొటోను కూడా పోస్ట్‌ చేశారు.

బంగ్లాదేశ్‌ అస్థిరతకు అమెరికా, పాక్‌ కుట్ర           -బుడ్డిగ జమిందార్‌ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం                984...
12/08/2024

బంగ్లాదేశ్‌ అస్థిరతకు అమెరికా, పాక్‌ కుట్ర
-బుడ్డిగ జమిందార్‌
ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం
98494 91969

17 కోట్ల జనాభా కల్గిన బంగ్లాదేశ్‌లో గడచిన సంవత్సరాలలో జీడీపీ పెరుగుదల 2009లో 5శాతం ఉండగా 2019 నాటికి7.9 శాతం పెరిగింది. కరోనా కష్ట కాలంలో 3.4 శాతానికి పడిపోగా, మరలా 2021 నాటికి 6.9 శాతం, 2022 నాటికి 7.15 శాతానికి పెరిగింది. ఈ సంవత్సరానికి మరలా 7 శాతానికి చేరుతుందని ఆసియన్‌ డవలప్‌మెంటు బ్యాంకు చెబుతుంది. కానీ ఏమి ప్రయోజనం ఈ జీడీపి ఉద్యోగాలను కల్పించే జీడీపి కాదు. ‘జాబ్‌లెస్‌’ జీడీపి. మన ఆర్థిక వ్యవస్థలోనూ ఇదే తరహా జీడీపి వృధ్దిరేటు జరుగుతున్నది. నిరుద్యోగం 2010 లో 3.4 శాతం నుంచి 2023 కు 5.1 శాతం అధికారికంగా పెరిగిందని సమాచారం. కానీ వాస్తవానికి ప్రస్తుతం కోటి ఎనభై లక్షలకు పైగా యువత నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వపరంగా వస్తున్న కొద్దిపాటి ఉద్యోగాల్లో 30 శాతం 1971 బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులకు వర్తిస్తాయని కొద్ది నెలల క్రితం షేక్‌ హసీనా తీసుకొన్న నిర్ణయంతో ఒప్పుకోని విద్యార్థులు ఉప్పెనలా కొన్ని వారాల నుంచి ఉద్యమాన్ని నడిపారు. హైకోర్టు 7 శాతానికి రిజర్వేషన్లు తగ్గించినా ససేమిరా అన్నారు. ప్రజాస్వామ్యవాదిగా రాజకీయాలను ప్రారంభించి నియంతగా మారిన హసీనా కొద్ది వారాలలోనే 300 విద్యార్థుల్ని దారుణంగా చంపించింది. ప్రత్యర్థులను జైళ్లకు పంపింది. ఫేస్‌బుక్‌లో ఒక విద్యార్థి ప్రభుత్వ వ్యతిరేక పోస్టింగు పెట్టినందుకు జైలులో నిర్బంధించి అనేక కేసులు తనపై పెట్టింది. ఎంత నియంతైనా ప్రజాగ్రహానికి ఆత్మహత్య అయినా చేసుకోవాలి లేదా దేశాన్ని వదిలి పారిపోవాలి! ఇది చరిత్ర మనకు చెబుతున్న గుణపాఠం. సరిగ్గా హసీనా కూడా భారతదేశానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో పారిపోయి రావటం దీనినే సూచిస్తుంది. ఇకపై హసీనా రాజకీయాలకు దూరంగా ఉంటానంటుంది.
ఐతే ఈమెకు ప్రత్యామ్నాయంగా ఒకవేళ భవిష్యత్తులో ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారనేదే వెయ్యి డాలర్ల ప్రశ్న! అభివృద్ధి నిరోధక, అప్రజాస్వామిక మతోన్మాద శక్తులు అధికారంలోకి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇది మన దేశానికి మరింత ఆందోళనను కలుగజేస్తుంది. జమాత్‌ఎ ఇస్లామీ బంగ్లాదేశ్‌ విద్యార్థి విభాగం ‘ఇస్లామీ ఛత్ర శిభిర్‌’ పాత్ర ప్రముఖంగా ఉందని ఇండియా టుడే రాసింది. ఈ సంస్థకు పాకిస్తాన్‌ ఇంటిలిజెన్సీ ఏజన్సీ ఐఎస్‌ఐ మద్దతు ఉందని తెలుస్తుంది. అమెరికా నుంచి నిధులు కూడా అందాయని విశ్లేషణలు వస్తున్నాయి. గత రెండేళ్లలో బంగ్లాదేశ్‌లోని అనేక విశ్వవిద్యాలయాల్లో ఇస్లామీ ఛత్ర శిభిర్‌ కార్యకర్తలు విద్యార్థులుగా యూనివర్శిటిల్లోకి ప్రవేశించారు. ఇక్కడ నుంచే విద్యార్థులను హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడగట్టి తిరుగుబాటు చేయించారని, దీనికి పరోక్షంగా అమెరికా అండతో మిలిటరీలోని ఒక వర్గం సహకరించిందని వార్తలు వస్తున్నాయి. జమాత్‌ఎ ఇస్లామీ 1975 లో స్థాపించారు. బంగ్లాదేశ్‌లోని అతిపెద్ద ఇస్లామిక్‌ పార్టీలలో ఒకటిగా ఎదిగింది. గతంలో మాజీ ప్రధాని ఖలీదాజియా పార్టీ జిఎన్‌పితో పొత్తు పెట్టుకొంది.ప్రస్తుత విద్యార్థి ఉద్యమ పరిస్థితి పెనం మీది రొట్టి పొయ్యిలో పడిన చందంగా ఉంది. ప్రపంచంలో వామపక్షపార్టీలు బలంగాలేనిచోట్ల మితవాద, మతవాద, ఫాసిస్టు పార్టీలు అధికార పగ్గాలు చేపట్టటం మనం అనేక చోట్ల చూస్తున్నాము.

బంగ్లాదేశ్‌తో మనకు గల 4,096 కిలోమీటర్ల సరిహద్దులో పశ్చిమబెంగాల్‌ (2,217 కి.మీ), త్రిపుర (856 కి.మీ), మేఘాలయ (443), అస్సాం (262), మిజోరం (318) రాష్ట్రాలు ఉన్నాయి. ఈశాన్యంలో భారతదేశానికి మధ్యనున్న బంగ్లాదేశ్‌కు కేవలం దక్షిణమున అరేబియా సముద్రం మాత్రమే ఉన్నది. చికెన్‌నెక్‌ పైభాగాన నేపాల్‌, భూటాన్‌లు ఆపైన చైనాలు ఉన్నాయి. సుమారు 15 సంవత్సరాలు బంగ్లాదేశ్‌ ప్రధానిగా పాలించిన హసీనా మన ప్రధానితో ఈ సంవత్సరం చాలాసార్లు కలుసుకున్నారు. ఇరు దేశాల మధ్య ఈ సంవత్సరం 1600 కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగింది. బంగ్లాదేశ్‌ ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌కు చైనాతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. బంగ్లాదేశ్‌ పరిణామాలు మన దేశాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. రాను రాను మన విదేశాంగ విధానం మసకబారుతూ, సరిహద్దు దేశాలతో స్నేహపూరిత వాతావరణం దూరమవ్వటం దేశానికి శ్రేయస్కరం కాదు.

1971 బంగ్లాదేశ్‌ విమోచనోద్యమం తర్వాత అప్పటి యువతరం చాలామంది లక్షల్లో యు.కె, అరబ్‌ దేశాలు, అమెరికా, కెనడాలకు వెళ్లి స్థిరపడ్డారు. కానీ నేటి యువతరం బంగ్లాదేశ్‌లోనే ఉండి దేశాన్ని అభివృద్ధి చేసి ఇక్కడే ఉద్యోగాలు పొందాలని కృత నిశ్చయంతో ఉన్నారు. ప్రస్తుత ఉద్యోగాలు సృష్టించలేని ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా యువత పోరాడుతుంది. ఇదే పరిస్ధితి భవిష్యత్తులో మన దేశంలో కూడా ఏర్పడి మన యువత అమెరికా వెళ్లబోమని, మన దేశాన్ని అభివృద్ధి చేయమని అడిగిననాడు మన పాలకులు కూడా పలాయనం చిత్తగించాల్సిన అవసరం ఏర్పడక తప్పదు. మన దేశం ‘మానవ వనరుల’ ఎగుమతిగా తయారయింది. అమెరికాలో వర్షం కురిస్తే మనం గొడుగు పట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడటం విచారకరం.

హసీనాకు అమెరికాతో మొదటి నుంచి మంచి సంబంధాలు లేనేలేవు. 1975 ఆగస్టు15 నాడు హసీనా తండ్రి వామపక్షవాది షేక్‌ ముజిబూర్‌ రెహమాన్‌తో పాటుగా మరో 15 మంది కుటుంబ సభ్యులను దారుణంగా చంపటంలో అమెరికా పాత్ర ఉందని ఎప్పటి నుంచో హసీనా ఆరోపిస్తుందని ది హిందూ పత్రిక రాసింది. ‘ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎప్పుడైనా తన అనుకూల ప్రభుత్వాలను అమెరికా మార్చగలదని, బంగ్లాదేశ్‌లో వారికి అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని’ లోగడ హసీనా చెప్పింది. తను ఏ విదేశీ కూటమిలోనూ సభ్యత్వం తీసుకోనని ఖరాకండీగా చెప్పింది. అమెరికా,ఆస్ట్రేలియా, జపాన్‌, యు.కె.లతో కలిసిన ‘క్వాడ్‌’ మిలిటరీ కూటమికి దూరంగా ఉంటానని చెప్పింది. చిట్టగాంగ్‌కు దగ్గరిలోని సైంట్‌ మార్టిన్‌ దీవిలో విదేశీ నౌకాస్థావరాన్ని, మిలిటరీ స్థానాన్ని రానివ్వనని ధైర్యంగా హసీనా చెప్పగలిగింది. ఒక విదేశీ తెల్లజాతివారు బంగ్లాదేశ్‌ను క్రిస్టియన్‌ దేశంగా మార్చటానికి జరిగే ప్రయత్నాలను ఆపుతానని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి అన్నది. ఈ వ్యాఖ్యలను బట్టి హసీనా ప్రభుత్వాన్ని కూల్చటంలో అమెరికా హస్తమున్నట్లుగా భావించవచ్చని మీడియాలో వార్తలొస్తున్తాయి.

** కేంద్రం చేతిలో కీలుబొమ్మలు__ఎ కోటిరెడ్డి    రచయిత మార్క్సిస్టు     ఎడిటోరియల్ బాధ్యులుబిజెపికి దేశప్రజలు తగిన గుణపాఠం...
11/08/2024

** కేంద్రం చేతిలో కీలుబొమ్మలు

__ఎ కోటిరెడ్డి
రచయిత మార్క్సిస్టు
ఎడిటోరియల్ బాధ్యులు

బిజెపికి దేశప్రజలు తగిన గుణపాఠం
చెప్పి, ఆ పార్టీకి పార్లమెంటులో స్థానాలను తగ్గించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన స్థానాల కన్నా తక్కువ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీలు బిజెపికి ఆ లోటు కనబడకుండా చేశాయి. దానికి ఎక్కువ స్థానాలు వచ్చినప్పటి లాగానే ఇప్పుడూ వ్యవహరించటానికి అవసరమైన మద్దతును రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు అందించాయి. బిజెపికి పార్లమెంటులో తగినంత బలం లేని పరిస్థితిని ఉ పయోగించుకొని, ఆ పార్టీపై వత్తిడి తీసుకొచ్చి, రాష్ట్ర ప్రయోజనాలను సాధించటానికి మారుగా, ఆ పార్టీ ప్రభుత్వానికి మద్దతివ్వటమే మహాభాగ్యం అన్నట్లుగా ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలలో టిడిపి 16, జనసేన, బిజెపి, వైసిపిలు తలో మూడు స్థానాల చొప్పున గెలుచుకున్నాయి. బిజెపి గెలిచిన మూడు స్థానాలు టిడిపి, జనసేన మద్దతుతో గెలుచుకున్నవి మినహా రాష్ట్రంలో స్వంతంగా ఒక్క స్థానాన్ని గెలిచే బలం కూడా ఆ పార్టికి లేదు. ఆ విధంగా పార్టీని అప్పనంగా మూడు స్థానాలలో గెలిపించటమే కాక, తాము గెలిచిన 19 స్థానాలతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని బలపరచటంతో పాటు, ప్రభుత్వంలో భాగస్వాములు కూడా అయ్యారు. టిడిపి కూటమికి వ్యతిరేకంగా (ఆ కూటమిలో ఉన్న బిజెపికి కూడా వ్యతిరేకంగా) పోటి చేసి, మూడు స్థానాలలో గెలిచిన వైసిపి కూడా బిజెపికి షరతులతో కూడిన మద్దతిస్తామని చెబుతూ బేషరతు మద్దతును అందిస్తున్నది.

బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉ ండటానికి, చట్టాలను ఆమోదించుకోవటానికి పార్లమెంటులో టిడిపి బలం ప్రధానం కాగా, రాజ్యసభలో వైసిపి బలం అత్యవసరంగా ఉ న్నది. రాజ్యసభలో కూడా బిజెపికి మెజారిటీ లేదు. రాష్ట్రం నుండి 11 మంది రాజ్యసభ

సభ్యులు ఉండాలి. ఇప్పుడు 11 మందీ వైసిపి ఆ సభ్యులే ఉన్నారు. మొత్తం 240 మంది = సభ్యులున్న రాజ్యసభలో బిజెపికి 97 మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీఎకు 117 మంది ఉన్నారు. రాజ్యసభలో మెజారిటికి బిజెపి 242 స్థానాల దూరంలో ఉండగా, ఎన్డీఎ 2 కూటమిగా చూసినా నాలుగు స్థానాలు తక్కువ ఉన్నాయి.

ఇటువంటి పరిస్థితులలో బిజెపిపై ఒత్తిడి చేయటానికి, మన రాష్ట్రానికి రావలసిన నిధులు, హక్కులను సాధించుకోవటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కాని రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హెూదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, విశాఖ రైల్వేజోన్, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు తదితరాలపై టిడిపి, జనసేన, వైసిపిలు నోరు మెదపటం లేదు. ముఖ్యంగా విశాఖ ఉ క్కుఫ్యాక్టరి ప్రైవేటీకరణను నిలుపు చేయించే విషయంలో పాలకపార్టీల అవకాశవాదానికి గో హద్దులు లేకుండా పోతున్నాయి. విశాఖ ఉ క్కును ప్రైవేటీకరిస్తున్నామని మూడున్నర సంవత్సరాల క్రితమే బిజెపి ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం అప్పటి నుండి ఉ క్కు ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు ప్రైవేటీకరణను ప్రతిఘటిస్తూ, పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి విశాఖ నగరం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంపూర్ణంగా మద్దతిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసే వరిశ్రమలలో విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రధానమైనది. కాని రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై - దాగుడుమూతలు ఆడుతున్నాయి. వైసిపి, • టిడిపిలు ప్రజాభిప్రాయానికి జడిసి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పటం మినహా వాస్తవంగా ప్రైవేటీకరణను ఆ పార్టీలు వ్యతిరేకించటం లేదు. గతంలో అధికారంలో ఉన్న వైసిపి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టిడిపిలు ప్రైవేటీకరణను విడనాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయటం లేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడి మొదటి ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులతో చేసిన చర్చలలో ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిలుపు చేసే అంశం కనీసం ప్రస్తావనకు కూడా నోచుకోలేదు.

పార్లమెంటులో ప్రభుత్వానికి మద్దతు • ఇస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్కు చట్టబద్ధంగా రావలసిన నిధులు ఇవ్వాలని, విభజన • సమస్యలను పరిష్కరించాలని మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. బడ్జెట్ రాష్ట్రానికి ఇచ్చింది నామమాత్రమైనా ఏదో గొప్పగా ఇచ్చినట్లు, టిడిపి సాధించినట్లు అతిశయోక్తులు ప్రచారం చేసుకొంటున్నారు. బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశ పెట్టిన రోజు రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15 వేలకోట్ల రూపాయలు గ్రాంటుగా ఇచ్చినట్లు టిడిపి ప్రచారం చేసుకుంది. మీడియాలోని ఒక సెక్షన్లో కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. కాని వాస్తవంగా రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ సంస్థల నుండి 15 వేలకోట్ల రూపాయల రుణం ఇప్పిస్తామని మాత్రమే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చెప్పింది. రాజధానికి, రాష్ట్రానికి నిధులు ఇస్తామని
నిర్దిష్టంగా చెప్పకపోయినా, విభజన సమస్యలలో ఏ ఒక్కదానిని పరిష్కరిస్తామని ప్రకటించకపోయినా, కేంద్ర బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి ఏదో ఒరగబెట్టబోతున్నట్లుగా టిడిపి ప్రచారం చేసుకోవటం మన రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది. కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్రానికి అన్ని ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవటం ఎవరికి ప్రయోజనం కలిగించటానికి? ఏమీ ఇవ్వకపోయినా ఎక్కువగా ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవటం రాష్ట్రాభివృద్ధిని గురించి పట్టించుకోని కేంద్ర ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత రాకుండా చూడటానికి, రాష్ట్రానికి నిధులు, విభజన హామీలను సాధించలేని తమ చేతగాని తనాన్ని కప్పిపెట్టుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. రాష్ర ప్రయోజనాలకు ఏ మాత్రం దోహదం చేయదు. పోలవరానికి నిధులిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అదేదో గొప్ప కార్యమైనట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. అది ఎప్పుడూ చెబుతున్న మాటే. పోలవరానికి సంబంధించి పెరుగుతున్న ప్రాజెక్టు వ్యయాన్ని, అందులో భాగమైన పునరావాస, పునర్నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు పూర్తిగా ఇస్తామని అంగీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చును కూడా తర్వాత ఎపుడో ఇవ్వటం మినహా ముందస్తుగా నిధులు ఇస్తున్నదీ లేదు. ఇపుడు బిజెపి ప్రభుత్వం అదనంగా ఇస్తామన్నదీ లేదు.

టిడిపి 2014 లో అధికారానికి వచ్చినపుడు కూడా ఇలాగే వ్యవహరించింది. విభజన హామీలను అమలు చేయించే అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా తామేదో గొప్పగా సాధించినట్లు ప్రచారం చేసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హెూదా ఇవ్వటం లేదని, దానికి బదులుగా ప్యాకేజి ఇస్తామని ఆనాడు కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేయటానికి పూనుకున్నా దానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజి పేరుతో ఏమీ ఇవ్వకుండానే రాష్ట్రానికి ఏదో గొప్పగా చేస్తున్నట్లు మోసం చేయటానికి ప్రయత్నం చేస్తే, దానిలో వీరు కూడా భాగస్వాములై దానిని ప్రజల చేత మింగించటానికి ప్రయత్నం చేశారు. చివరికి ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకతను గమనించి, ప్రత్యేక హెూదా, ఇతర సమస్యలను సాధిస్తామంటూ ఎన్నికలు జరగటానికి సంవత్సరం ముందు కేంద్ర ప్రభుత్వం నుండి బయటికి వచ్చినా,

ఎన్నికలలో ప్రజలు వారి అవకాశవాదానికి తగిన శిక్ష వేసి అధికారానికి దూరం చేశారు. ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ప్రదర్శించిన విన్యాసాలనే ఈనాడు కూడా ప్రదర్శిస్తున్నారు. దీనిని రాష్ట్ర ప్రజలు సహించరు. అందువలన తెలుగుదేశం పార్టీ తమ అవకాశవాదాన్ని పక్కన పెట్టి, రాష్ట్ర ప్రయోజనాల సాధనకు పూనుకుంటేనే ప్రజలిచ్చిన అధికారానికి న్యాయం చేసినవారవుతారు. కేవలం కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాలే లక్ష్యంగా బిజెపితో అంటకాగటానికి ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరవు. టిడిపి ఈ అంశాలను గమనంలో ఉంచుకొని వ్యవహరిస్తే రాష్ట్రంతో పాటు ఆ పార్టీకి కూడా మేలు జరుగుతుంది.

* ప్రజలపై భారాలు తగ్గటానికి శ్వేతపత్రాలు దోహదం చేస్తాయా?

టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి ప్రభుత్వం వివిధ రంగాలలో వ్యవహరించిన తీరు, ప్రజలపై వేసిన భారాలపై శ్వేతపత్రాలు ప్రకటించాలని నిర్ణయించారు. ఆ విధంగానే వివిధ రంగాలపై శ్వేతపత్రాలను ప్రకటించారు. వైసిపి ప్రభుత్వ ఆర్థిక విధానాల ఫలితంగా ఏడు లక్షల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయామని శ్వేతపత్రాలలో చెప్పారు. ఎక్సైజ్ విధానం వలన 18,860 కోట్ల రూపాయలు, విద్యుత్లంగంలో 1,29,503 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని శ్వేతపత్రాలలో చెప్పారు. విద్యుత్ రంగానికి సంబంధించిన నష్టంలో వినియోగదారులపై వేసిన భారం 32,166 కోట్ల రూపాయలు, విద్యుత్ సంస్థలకు వాటిల్లిన నష్టం 49,496 కోట్ల రూపాయలు, అసమర్ధ నిర్వహణ వలన వచ్చిన నష్టం 47,741 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. ఇంకా ఇసుక, మైనింగ్ విధానం వలన వచ్చిన నష్టాలను కూడా ఆయా రంగాలకు సంబంధించి జారీ చేసిన శ్వేతపత్రాలలో పేర్కొన్నారు.
విద్యుత్ రంగ సంస్థలతో గానికి బంధించిన శ్వేతపత్రంలో నష్టాలతో పాటు ప్రజలపై వేసిన భారాలను పేర్కొన్నారు. గత ఐదు సంవత్స రాల కాలంలో రాష్ట్రంలో గృహ వినియోగ దారులపై 32,166 కోట్ల రూపాయల భారాలను వేసినట్లు చెప్పారు. అంటే సంవత్సరానికి సగటున 6,400 కోట్ల రూపాయలకు పైగా భారాలను వేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల, గతంలో వాడిన విద్యుత్కు అదనంగా చెల్లించాల్సిన ఛార్జీల రూపంలో వైసిపి ప్రభుత్వ హయాంలో ఈ భారాలను మోపారు. గత వినియోగానికి వసూలు చేస్తున్న ఛార్జీలను ప్రజలు ఇప్పటికీ చెల్లిస్తున్నారు. టిడిపి ప్రభుత్వం ఈ అదనపు ఛార్జీల వసూలును ఉపసంహరించటానికి చర్యలు తీసుకొంటే ప్రజలకు తక్షణ ఉ పశమనం లభిస్తుంది. గత ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీలను పెంచటం ద్వారా అనవసర భారం మోపింది కాబట్టి రానున్న ఐదు సంవత్సరాలలో విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉండదు. గతంలో వినియోగించిన విద్యుత్కు చెల్లించాల్సిన అదనపు ఛార్జీల పేరుతో భారం మోపాల్సిన అవసరం కూడా ఉండదు.

నిర్వహణను మెరుగుపరిస్తే విద్యుత్ సంస్థల ఆదాయాలు పెరుగుతాయని శ్వేతపత్రాలు వెల్లడిస్తున్నాయి. అలా చేస్తే ఆ సంస్థలు చెల్లించాల్సిన రుణాలు తగ్గుతాయి. గత ప్రభుత్వం సౌర విద్యుత్ కొనుగోలు కోసం సెకితో ఒప్పందం చేసుకున్నపుడు ధరల విషయంపై చర్చలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఉన్న మార్కెట్ ధర కన్నా అధిక ధరకు 25 సంవత్సరాల పాటు సెకి నుండి విద్యుత్ను కొనుగోలు చేస్తూ ఒప్పందం చేసుకున్నది. అది ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపుతుంది. వ్యవసాయ మోటార్లకు, గృహ వినియోగానికి స్మార్ట్ మీటర్లు బిగించటంతో వేలకోట్ల రూపాయల భారం ప్రజలపై పడటంతో పాటు రైతాంగంపై వ్యవసాయ విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపే ప్రమాదం పొంచివుంటుంది. విద్యుత్ సంస్థలు, వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల అవసరం లేదు. ఇటువంటి భారాలను తగ్గించటానికి టిడిపి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. శ్వేతపత్రాలలో వెల్లడించినట్లు వైసిపి ప్రభుత్వ హయాంలో కోల్పోయిన ఏడు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని రానున్న ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ఖజానాకు సమకూరేలా చూడాలి. దానికి అదనంగా పెరుగుతున్న ఆదాయం తోడయితే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో వేగంగా పురోగమించేలా చేయవచ్చు.

అలా కాకుండా వైసివి తప్పుడు విధానాల కారణంగా పోయిన ఆదాయాన్ని పొందటానికి చర్యలు తీసుకోకపోతే కేవలం జగన్మోహన రెడ్డిని విమర్శించటానికి మాత్రమే రూపొందించిన చిట్టాగా శ్వేతపత్రాలను ప్రజలు భావిస్తారు. జగన్మోహనరెడ్డి పరిపాలన సరిగా లేదనే ప్రజలు టిడిపికి అధికారం అప్పగించారు. శ్వేతపత్రాలలో పేర్కొన్నట్లుగా ఆదాయం పెంచకపోయినా, ప్రజలపై వేసిన భారాలను తగ్గించకపోయినా టిడివి ప్రభుత్వం రూపొందించిన శ్వేతపత్రాలకు ఎటువంటి విలువా ఉండదు. టిడిపి ప్రభుత్వం ఈ అంశాలను గమనంలో ఉంచుకొని పరిపాలన సాగిస్తుందో లేదో చూడాలి. వీటి పై వ్యవహరించే తీరే ప్రభుత్వం ప్రయాణించే మార్గాన్ని నిర్దేశిస్తుంది.

ప్రభుత్వ విధానాలలోని లోపాలను సరిదిద్ది, శ్వేతపత్రాలలో పేర్కొన్న ఆదాయాలను సక్రమంగా రాబడితే రాష్ట్రాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ప్రజలపై భారాలు తగ్గుతాయి. వారి పరిస్థితులు మెరుగు పడతాయి.

* బిజెపి -హిందూత్వ

పార్లమెంటు ఎన్నికలలో ఓట్లు, సీట్లు తగ్గినప్పటికీ భారతదేశాన్ని హిందూరాష్ట్రగా మార్చటానికి బిజెపి ప్రయాణం కొనసాగు తుందని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు స్పష్టం చేస్తున్నాయి. గతం నుంచి అమలు జరుగుతున్న మూడు చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్, ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిడ్యూర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలను 2023, డిసెంబరు 23న పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టాలు ప్రజాస్వామ్య వ్యతిరేకమైనవి. పోలీసులకు అపరిమితమైన అధికారాలను కట్టబెడతాయి నిరంకుశ విధానాలను మరింత ముందుకు తీసుకుపోవటానికి దోహదం చేస్తాయని ప్రతిపక్షాలు, ప్రజలు, అనేక సంస్థలు
జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదు. రాష్ట్రాలను పట్టించుకోని కేంద్రం నిరంకుశ పోకడలే ఇందుకు కారణం. తనకు పూర్తి మెజారిటీ వచ్చినపుడు వ్యవహరించిన విధంగానే మైనారిటీ ప్రభుత్వంలో కూడా బిజెపి వ్యవహరిస్తున్నదని ఈ విషయాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అన్ని విషయాలలోనూ యధేచ్చగా వ్యవహరించటం సాధ్యం కాకపోవచ్చు. కాని తన మౌలికమైన హిందుత్వ విధానాల కొనసాగింపులో వెనక్కు తగ్గదని బిజెపి వ్యవహరిస్తున్న తీరు స్పష్టం చేస్తున్నది. బిజెపికి మద్దతిస్తున్న టిడిపి, జెడి(యు), ఇతర పార్టీలు తమ స్వప్రయోజనాలు మినహా దేశప్రయోజనాలను పట్టించుకొనే స్థితిలో లేవు. ఇక మతోన్మాద పోకడలను అవి ప్రతిఘటిస్తాయని భావించటం అత్యాశే అవుతుంది. కాబట్టి, బిజెపి మతోన్మాదాన్ని ప్రతిఘటించటానికి ప్రతిపక్షాలు ప్రజలను . సమీకరించాలి. కార్మికులు, కర్షకులు, కష్టజీవులైన ప్రజల ఉమ్మడి ప్రతిఘటనే హిందుత్వ వైపుకు సాగకుండా బిజెపిని , నిలువరిస్తుంది.
____________________________

Address

Thunbavi Post Panthangi Modal CHOTUPALLA Dist Nalgonda Pin
Pin
508242

Telephone

+919490098388

Website

Alerts

Be the first to know and let us send you an email when Keesari NarsiReddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Keesari NarsiReddy:

Share

Category