Telugu Desam Party: Penukonda

Telugu Desam Party: Penukonda Official Page of TDP Penukonda

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో గుర్తించిన 65 క్రీడా విభాగాల జాబితాను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూపొంద...
03/06/2026

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో గుర్తించిన 65 క్రీడా విభాగాల జాబితాను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూపొందించారు. ఇందులో బ్రిడ్జ్ అనేదాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఇందులో పేక ముక్కలు ఉంటాయి కానీ ఇది గొడ్డలి పార్టీ నేతలు ఆడించే పేకాట కాదు. తెలివి ఉపయోగించి ఆడే ఆట. గొడ్డలి పార్టీ వాళ్లకు అంత నాలెడ్జ్ ఎక్కడిది? అందుకే ఈ మాటలు.



03/06/2026

తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తానని ఎన్నికల సమయంలో వాగ్దానం చేశాను. ఆ మాటను నిలబెట్టుకుంటూ అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే చేశాను. ఎలాంటి పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాం.



03/06/2026

భూముల డివిజన్ జరిగినప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలను రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత ఐదు సంవత్సరాల్లో పరిష్కారం కాని కొన్ని అంశాలు ఇప్పుడు పరిష్కారం అవుతున్నాయి.

*‘అధినేత’లతో మంత్రి సవిత* కార్యకర్తకు టీడీపీలో ఎంతటి గౌరవం ఉంటుందో మంత్రి సవిత ఆత్మీయ పలుకరింపు మరోసారి రుజువు చేసింది.....
03/06/2026

*‘అధినేత’లతో మంత్రి సవిత*

కార్యకర్తకు టీడీపీలో ఎంతటి గౌరవం ఉంటుందో మంత్రి సవిత ఆత్మీయ పలుకరింపు మరోసారి రుజువు చేసింది... కార్యకర్తే అధినేత... ఇదీ టీడీపీ మూల సిద్ధాంతం... అధిష్టాన నిర్ణయాన్ని తూ.చ. తప్పకుండా పాటించే వారిలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామంత్రి ఎస్.సవిత ముందు వరుసలో ఉంటారు.. . బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన అధినేతలను(కార్యకర్తలను) మంత్రి సవిత ఆప్యాయంగా పలుకరించారు. వారితో కలిసి భోజనం చేశారు. ఒక్కొక్కరినీ పలుకరిస్తూ... ఏ ప్రాంతం నుంచి వచ్చారు... ఎందుకు వచ్చారు... వచ్చిన పని అయ్యిందా... వారి కుటుంబ నేపథ్యం ఏంటి..? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి సవితమ్మ తమకు గౌరవం ఇవ్వడంపై అక్కడున్న కార్యకర్తల్లో ఆనందం నింపింది . మరే పార్టీలోనూ కార్యకర్తల సంక్షేమం గురించి పట్టించునే నాథుడుగాని, నాయకత్వంగాని ఉండదని... అదీ టీడీపీలోనే మాత్రమే సాధ్యమని మంత్రి సవిత ఎదుట వారు సంతోషం వెలిబుచ్చారు.. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆవిష్కృతమైన ఈ దృశ్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.


జగన్ కంటే అజ్ఞాని ఎవరుంటారులే అనుకుంటే నేనున్నా అని ముందుకు వచ్చాడు పేర్ని నాని.  బ్రిడ్జ్ ఆట అంటే పేకాట అంట. 2024 మార్చ...
03/06/2026

జగన్ కంటే అజ్ఞాని ఎవరుంటారులే అనుకుంటే నేనున్నా అని ముందుకు వచ్చాడు పేర్ని నాని. బ్రిడ్జ్ ఆట అంటే పేకాట అంట. 2024 మార్చి 4న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక మార్గదర్శకాల ప్రకారం 'బ్రిడ్జ్' ఆట అనేది ఒక అధికారిక 'మైండ్ స్పోర్ట్'. అలాగే Bridge Federation of India కు కూడా కేంద్ర గుర్తింపు ఉంది.



03/06/2026

డీఎస్సీ 2025 పై ప్రభుత్వం స్పష్టమైన వివరణలు ఇచ్చినా కొందరు తప్పుడు ప్రచారం ఆపడం లేదు. మెరిట్ ప్రకారం ఇవ్వాల్సిన పోస్టులను పక్కదోవ పట్టించారనే తప్పుడు వాదనలు వినిపిస్తున్నారు. మెరిట్ లిస్టులు ఆన్ లైన్ లో డిలీట్ చేశారనే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా లాంటివి జరగలేదని, ఆన్ లైన్ లో సమాచారం అంతా ఉందని అధికారులు చెప్పినా పట్టించుకోకుండా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.

ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ & డీప్ టెక్  హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు. రష్యాలోని ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర...
03/06/2026

ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ & డీప్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు.

రష్యాలోని ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. భారతదేశంలోని బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు స్బేర్ బ్యాంక్ యొక్క గిగాచాట్ ఎల్ఎల్ఎంను విస్తరించే అవకాశాలపై చర్చించారు.

ప్రపంచ స్థాయి ఏఐ భాగస్వామ్యాలతో భవిష్యత్ సాంకేతికతలకు ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా మార్చాలన్నదే లక్ష్యం.




తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర  పలువురు సందర్శకులు, శెట్టి బలిజ సామాజిక వర్గీయులు, కూటమి నాయకులు, కార్యకర్తల...
03/06/2026

తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పలువురు సందర్శకులు, శెట్టి బలిజ సామాజిక వర్గీయులు, కూటమి నాయకులు, కార్యకర్తలు కలసి వినతులు అందచేశారు. వారు అందజేసిన వినతులు పరిశీలించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చాను.

ఐదేళ్ళు నిరుద్యోగుల విలువైన కాలాన్ని నాశనం చేసింది చాలక, కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పెడుతుంటే అడ్డుకోడానికి జగన్ 241 క...
03/06/2026

ఐదేళ్ళు నిరుద్యోగుల విలువైన కాలాన్ని నాశనం చేసింది చాలక, కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పెడుతుంటే అడ్డుకోడానికి జగన్ 241 కేసులు వేయించాడు. అయినా డీఎస్సీ జరిగేసరికి తట్టుకోలేక కష్టపడి చదివి పరీక్షలు రాసి టీచర్ ఉద్యోగాలు సాధించిన వాళ్ళని డబ్బులిచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారు అంటూ అవమానిస్తున్నాడు. ఇది విని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీచర్లు.



మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియ గురించి జగన్ చేస్తున్న ప్రచారం మొత్తం ఫేక్ ప్రచారమే. దరఖాస్తుల సమర్పణ నుంచి...
03/06/2026

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియ గురించి జగన్ చేస్తున్న ప్రచారం మొత్తం ఫేక్ ప్రచారమే. దరఖాస్తుల సమర్పణ నుంచి ధ్రువపత్రాల అప్‌లోడ్, పరిశీలన, ధృవీకరణ, ప్రాధాన్యత జాబితా తయారీ వరకు మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించడం ద్వారా పూర్తి పారదర్శకత మరియు బాధ్యతాయుత మైన నియామకాలు జరిగాయి.



Address

Penukonda

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Penukonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Penukonda:

Share