Meer Mahmood Ali Yuva Sena

Meer Mahmood Ali Yuva Sena Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Meer Mahmood Ali Yuva Sena, Political organisation, Pargi.

కొడంగల్ లో కూల్చిన దర్గాను యధా స్థానంలో ఏర్పాటు చేయాలి : బిఆర్ఎస్ మైనారిటీ నాయకులుమైనార్టీలను కలవడానికి వెళ్లిన మాజీ ఎమ్...
25/09/2025

కొడంగల్ లో కూల్చిన దర్గాను యధా స్థానంలో ఏర్పాటు చేయాలి : బిఆర్ఎస్ మైనారిటీ నాయకులు

మైనార్టీలను కలవడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి

నరేందర్ రెడ్డి అరెస్టు చేసి దోమ పోలీస్ స్టేషన్ కు తరలింపు

దోమ లో మహేష్ రెడ్డి, మీర్ మహేమూద్ అలీ, బిఆర్ఎస్ నాయకులు అరెస్టు చేన్గోముల్ పి యస్ కు తరలింపు

పరిగి, సెప్టెంబర్ 25 (ప్రజాజ్యోతి) :
కోడంగల్ పట్టణంలోని కోస్గి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా దర్గా, స్మశాన వాటికలను తొలగించడం లో కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటు చర్యగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. గురువారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అలాగే మాజీ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇబ్రహీం ఇసాక్ కొడంగల్ మైనారిటీ నాయకులను కలవడానికి వెళ్లిన నేపథ్యంలో కొడంగల్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దోమ పోలిస్ స్టేషన్ కు మాజీ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇబ్రహీం ఇసాక్ పరిగి పోలిస్ స్టేషన్ కు తరలించారు. ఈ సమాచారం అందిని వెంటనే పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తోపాటు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మీర్ మహేమూద్ అలీ, ప్రవీణ్ కుమార్ రెడ్డి, సురేందర్ మాజీ కౌన్సిలర్ మీర్ తాహేర్ అలీ తోపాటు బిఆర్ఎస్ నాయకులు దోమ పోలిస్ స్టేషన్ కు బయలుదేరి పట్నం నరేందర్ ని కలిసారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ లకు ద్రోహం చేస్తూ ఇప్పుడు దౌర్జన్యానికి దిగిందని, ఈ ప్రభుత్వంలో ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అన్ని విధాలుగా బాధలు ఎదుర్కొంటున్నారని, అన్నారు. లగచర్ల లో గిరిజనులపై కక్ష పెట్టుకొని సీయం రేవంత్ రెడ్డి వారిని జైలుకి పంపించాడని గుర్తు చేశారు. అదేవిధంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మీర్ మహేమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి మైనార్టీలు వ్యతిరేకం కాదని దర్గాతో పాటు స్మశానవాటికలను తొలగించడం సరైంది కాదన్నారు, తొలగించిన దర్గాను, యధా స్థానంలో ఉండే విధంగా చూడాలన్నారు, ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం ఆలోచించి యధా స్థానంలో దర్గాను, ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు, ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్న ఒక్క ముస్లిం మంత్రి నియమించపోవడం శోచనీయం అని, అది డిల్లీ లో అధికారంలో వున్న పెద్దలకు సంతోష పెట్టడానికే అని అన్నారు. కొడంగల్ తన స్వంత నియోజకవర్గంలో రోడ్డు విస్తారణ సాకుతో దాదాపు 500 సంవత్సరా మూడు ముస్లిం స్మశాన వాటికలను అలాగే రెండు మెహేబూబ్ సుభాని దర్గలను ముఖ్యమంత్రి ఆదేశంతో అర్దరాత్రి రెండు గంటల సమయంలో కూల్చడంతో ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని మైనార్టీ నాయకులు మీర్ మహేమూద్ అలీ అన్నారు, అనంతరం సీయం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో ధర్నా నిర్వహించడంతో దోమ పోలీసులు పరిగి బిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి చెన్గోముల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి వర్గం వారు ఇబ్బందులు ఎదుర్కొంటన్నారని అక్రమ అరెస్టులతో భయపడదు లేదని హక్కులను కాపాడుకునే వరకు ప్రభుత్వం పై పోరాటం సాగుతుందని మైనార్టీల నాయకులు తెలిపారు.

ఉగ్రవాదుల దాడి అమానుషం మైనార్టీ నాయకులు మీర్ మహమ్మద్ అలీ.. ఉగ్రవాదులు అమాయకులను పొట్టన పెట్టుకోవడం అత్యంత బాధాకరమని మైనా...
23/04/2025

ఉగ్రవాదుల దాడి అమానుషం మైనార్టీ నాయకులు మీర్ మహమ్మద్ అలీ..

ఉగ్రవాదులు అమాయకులను పొట్టన పెట్టుకోవడం అత్యంత బాధాకరమని మైనార్టీ నాయకులు మీర్ మహమ్మద్ అలీ అన్నారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడి ఘటనను అన్ని కోణాల్లో పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదానికి బలి అయిన అమాయకుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో సయ్యద్ ఆదిల్ హుస్సేన్ ఉగ్రవాదులతో పోరాడి భారత పర్యటకులను రక్షించే ప్రయత్నం చేసి ఈ ప్రయత్నంలో ఉగ్రవాదుల చేతిలో బలైపోయాడని ఆయన పేర్కొన్నారు. మానవత్వం మరిచి హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ఉగ్రవాదులు అందరిని చంపారని అలీ పేర్కొన్నారు. మతాల మధ్య రాజకీయాలు చేయకుండా వాస్తవాలను పరిశీలించి ఉగ్రవాదులను అంతమొందించే లక్ష్యం భారత్కు ఉండాలని అన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని కోరారు. ఈ సమయంలో వాస్తవాలను పక్కదారి పట్టించకుండా నిజాలను నిర్భయంగా వెలికి తీసి ఈ సంఘటనకు కారణమైన ఉగ్రవాదులను అత్యంత కిరాతకంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదానికి కులం మతం లేదని భారతీయులను చంపడమే లక్ష్యంగా వాళ్ళు వచ్చినట్టు కనిపిస్తుందని దేశంలోకి అడుగుపెట్టి అమాయకులను అత్యంత పాషవికంగా చంపిన ఉగ్రవాదాన్ని రూపుమాపాలని అలీ కోరారు. భారతదేశంలో ఆర్మీ వెంట అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని అందరూ ముక్తకంఠంతో ఉగ్రవాదాన్ని నశింపజేయడమే కోరుతున్నారని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ ఘటనలో గాయపడ్డ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు..

تَقَبَّلَ اللهُ مِنَّا وَمِنكُم
11/04/2024

تَقَبَّلَ اللهُ مِنَّا وَمِنكُم

Today Attend Mahender Reddy Garu Daughter's Marriage  at GMR Arena Novotel function plaza shamshabad airport ,KODANGAL M...
14/05/2023

Today Attend Mahender Reddy Garu Daughter's Marriage at GMR Arena Novotel function plaza shamshabad airport ,KODANGAL MLA Narender Reddy Garu Meer Mahmood Ali garu, Mpdo Pargi,Mpdo Kodangal, Meer Taher Ali..

02/11/2022

పరిగి పత్రికా ప్రకటన మొన్న కొడంగల్ లో 11 సంవత్సరాల బాలుడైన రజఖాన్ హత్యకు నిరసనగా ఈరోజు పరిగి పట్టణంలో అంబేద్కర్ కూడలి నుండి గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీతో అతని ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. వివిధ ప్రజా సంఘాల నాయకులు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మీర్ మహమూద్ అలీ స్వేరో నెట్వర్క్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంచంపల్లి శ్రీనివాస్, స్వేరో సర్కిల్ జిల్లా అధికార ప్రతినిధి ఎరన్ పల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థిని హత్య చేయడం,అతి కిరాతకంగా చంపిన మూర్ఖుడు అజయ్ ని వెంటనే ఉరితీయాలని అదేవిధంగా ఇటువంటి అంశాలు మళ్లీ పునరావృతం కాకూడదని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి సంఘ విద్రోహ శక్తులైనటువంటి మూర్ఖులకు బుద్ధి రావాలంటే వెంటనే ఉరిశిక్ష లేదా ఎన్కౌంటర్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు ఆనంద్ గౌడ్ అడ్వకేట్, బండలింటి మైపాల్, (కాంగ్రెస్ సీనియర్ నాయకులు), రఫీ, వెంకట్ రెడ్డి, (HRC), వినోద్ కుమార్, అనంతయ్య, గోవింద్ నాయక్, శ్రీనివాస్ నాయక్, బొంపల్లి రమేష్ (ఎమ్మార్పీఎస్) పార్టీ నాయకులు పాల్గొన్న

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ మంత్రివర్యులు , యం.యల్.సి. గౌ శ్రీ డా ॥ పట్నం మహేందర్ రెడ్డి అన్నా Patnam Mahender ...
21/09/2022

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ మంత్రివర్యులు , యం.యల్.సి. గౌ శ్రీ డా ॥ పట్నం మహేందర్ రెడ్డి అన్నా Patnam Mahender Reddy గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎊🍰🎂💐

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు🥧🍰🎊🎂...
17/09/2022

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు🥧🍰🎊🎂💐 Ranjith Reddy - TRS

03/05/2022
ఈ రోజు 29-04-2022 శుక్రవారం నాడు పరిగి పట్టణంలో S గార్డెన్స్ లో తెలంగాణ ప్రభుత్వం మరియు కొప్పుల మహేష్ రెడ్డి గారు ఏర్పాట...
29/04/2022

ఈ రోజు 29-04-2022 శుక్రవారం నాడు పరిగి పట్టణంలో S గార్డెన్స్ లో తెలంగాణ ప్రభుత్వం మరియు కొప్పుల మహేష్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఇప్తార్ విందు కు హాజరై ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్ష ను విరమింపచేసిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారు మరియు తెరాస రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి గారు. తెరాస నాయకులు జిల్లా మాజీ కో - ఆప్షన్ సభ్యులు మీర్ మహమ్మద్ అలీ గారు

ఈ సందర్భంగా ముస్లిం సోదరి సోదరులకు ముందుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు..

ఈ కార్యక్రమంలో పరిగి మండల మరియు మున్సిపల్ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్స్, స్థానిక నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు..

28/04/2022

Assalamualaikum warahmatullahi Wabarakatuhu
Kal Baroze Juma 29-04-2022
Telangana Hukumath Ki Jaanib Say Iftar Party Aur Taam Ka Intezaam Hy
Hy Sabhi Hazraath Say Shirkath Ki Guzaarish 6:30Pm
S Garden Kodangal Road Pargi.....

From.....
K.Mahesh Reddy
MLA Pargi.
Meer Mahmood Ali
Ex ZP Cooption Member

Address

Pargi

Website

Alerts

Be the first to know and let us send you an email when Meer Mahmood Ali Yuva Sena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share