జనసేన పాడేరు నియోజకవర్గం

  • Home
  • India
  • Paderu
  • జనసేన పాడేరు నియోజకవర్గం

జనసేన పాడేరు నియోజకవర్గం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from జనసేన పాడేరు నియోజకవర్గం, lochalaputtu near government degree college, Paderu.

విశాఖ పట్నం విచ్చేసిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు *శ్రీ నాదెండ్ల మనోహర్* గారికి ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికిన ర...
15/10/2025

విశాఖ పట్నం విచ్చేసిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు *శ్రీ నాదెండ్ల మనోహర్* గారికి ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికిన రాష్ట్ర జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమి చైర్మన్,పాడేరు జనసేన పార్టీ ఇంచార్జీ *డా.. గంగులయ్యగారు.*
*విశాఖ పట్నం 1 ఎమ్మెల్యే గారు గౌరవ శ్రీ వంశి కృష్ణ యాదవ్, జనసేన పార్టీ సేవాదళ్ అధ్యక్షులు బోగీల శ్రీనివాస్ పట్నాయక్*. *వంపూరు సురేష్,కుంచె ప్రసాద్*.తదితర విశాఖపట్నం నాయకులు.
ఈ సందర్భంగా చైర్మన్ *డా.. గంగులయ్య భీమిలి శాసన సభ సభ్యులు శ్రీ గంట శ్రీనివాస్* గారిని కూడా కలవడం జరిగింది.

ఈ రోజు స్వచ్చాంద్ర ఆంధ్ర అవార్డ్స్ ప్రదానం కార్యక్రమం స్థానిక జిల్లా కలెక్టర్ వారి ఆఫిస్ లొ జరిగింది ఈ కార్యక్రమంలో జిల్...
06/10/2025

ఈ రోజు స్వచ్చాంద్ర ఆంధ్ర అవార్డ్స్ ప్రదానం కార్యక్రమం స్థానిక జిల్లా కలెక్టర్ వారి ఆఫిస్ లొ జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.రాష్ట్ర జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమి చైర్మన్ జనసేన పార్టీ ఇంచార్జీ డా.. గంగులయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొని సేవ భావంతో పని చేయగలిగితే గిరిజన ప్రాంతాలను స్వచ్ఛ శ్యామలం చేయగలం .వైద్యారోగ్యశాఖ లో డాక్టర్లు ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ఎంతా ముఖ్యమైన పాత్ర పోసిస్తారో అలాగే స్వచ్ఛత కోసం పారిశుధ్య కార్మికులు కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తారని అటువంటి అధికారులను,కార్మికులను గౌరవించుకోవాలన్నారు.
గతంలో పంచాయితీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని నిధులు లేక పంచాయితీలు అభివృద్ధి లో మధ్యంతరంగా ఆగిపోయిందని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సారథ్యంలో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ,రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పంచాయితీ రాజ్ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ స్వచ్చాంద్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని ప్రతి అధికారి కూటమి నాయకులు స్వచ్ఛత పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిర్దిష్ట లక్ష్యాలు చేరుకునేందుకు శ్రమించి పని చేయాలని కోరుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,అధికారులు పాల్గొన్నారు.

*ఆటో డ్రైవర్ల సేవలో పథకం  కూటమి ప్రభుత్వం తలపెట్టిన మరో సంక్షేమపథకం*రాష్ట్ర జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమి చైర్మన్ పా...
05/10/2025

*ఆటో డ్రైవర్ల సేవలో పథకం కూటమి ప్రభుత్వం తలపెట్టిన మరో సంక్షేమపథకం*
రాష్ట్ర జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమి చైర్మన్ పాడేరు ఇంచార్జీ
*డా.. వంపూరు గంగులయ్య*
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్న పథకంలో భాగంగా ఈ రోజు కూటమి నాయకులు, ఆటో యునియన్ సంఘాల నాయకులు డ్రైవర్లు తో గిరిజన సంక్షేమ మరియు మాతాశిశు సంరక్షణ మంత్రి శ్రీమతి శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది.పాడేరులో, ఆటో డ్రైవర్లు,కూటమి నాయకులతో భారీఎత్తున ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.పాడేరు జనసేన పార్టీ నుంచి రాష్ట్ర జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమి చైర్మన్, పాడేరు ఇంచార్జీ డా.. గంగులయ్య గారు ఈ కార్యక్రమానికి హాజరై వాహన మిత్ర లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 435.35 కోట్ల రూపాయలతో సుమారు 2,90,234 మంది ఆటో రిక్షా, మాక్సి క్యాబ్,మోటర్ క్యాబ్ డ్రైవర్లు ఖాతా లో ఒక్కొక్కరికి 15000 రూపాయలు కూటమి ప్రభుత్వం జమచేయనుందనీ మన గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ పథకానికి లబ్ధిదారులు గా ఉన్న మన సోదరులు ఉన్నారని వారు ఈ పథకానికి తమ పూర్తిస్థాయి అర్హతలతో లబ్దిపొందేల వినియోగించుకోవాలని కోరుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,తెదేపా పార్టీ ఇంచార్జీ శ్రీమతి గిడ్డి ఈశ్వరి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్,ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ తిరుమణి శ్రీపూజ జఆటో డ్రైవర్లు బీజేపీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్లకు దసరా కానుకను ఇస్తోంది కూటమి ప్రభుత్వం. ఈరోజు ఉదయం 11 గంటలకు 2,90,234 మంది ఆటో రిక్షా/ మాక్సి క్యాబ్/ మోటా...
04/10/2025

ఆటో డ్రైవర్లకు దసరా కానుకను ఇస్తోంది కూటమి ప్రభుత్వం. ఈరోజు ఉదయం 11 గంటలకు 2,90,234 మంది ఆటో రిక్షా/ మాక్సి క్యాబ్/ మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.435.35 కోట్లు జమ చేయనుంది.




.VampuruGangulaiah

ఈ నెల 30 వ తేదిన  విశాఖపట్నం  మున్సిపల్ స్టేడియం లో జరగబోయే *సైన్యం తో  జనసేనాని...* *జనసైనికులతో జనసేనాని* విస్తృత స్థా...
26/08/2025

ఈ నెల 30 వ తేదిన విశాఖపట్నం మున్సిపల్ స్టేడియం లో జరగబోయే *సైన్యం తో జనసేనాని...* *జనసైనికులతో జనసేనాని*
విస్తృత స్థాయి సమావేశానికి జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు ,ఉత్తరాంధ్ర ముఖ్య నాయకులు పాల్గొని ఏర్పాట్లకు సంబంధించి సన్నాహక సమావేశం ఈ రోజు నిర్వహించారు.
ఈ సమావేశంలో పాడేరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ ఇంచార్జీ ,రాష్ర్ట జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమి చైర్మన్ *డా.. గంగులయ్య* గారు పాల్గొన్నారు.అలాగే జరగ బోయే ఈ విస్తృత స్థాయి సమావేశంలో సాంస్కృతిక విభాగానికి అధ్యక్షత వహిస్తూ విభిన్న సాంప్రదాయక నృత్య కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలకు సంబంధించి కళలను పర్యవేక్షణ చేస్తున్నారు.
పెందుర్తి శాసనసభ సభ్యులు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు *శ్రీ పంచ కర్ల రమేష్ బాబు గారు,అనకాపల్లి శాసన సభ సభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు,యలమంచిలి శాసన సభ సభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు,చోడవరం ఇంచార్జీ శ్రీ P.V.N.S రాజు గారు*,తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

*పెందుర్తి నియోజకవర్గం లో  ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు*.ముఖ్య అతిథిగా..పెందుర్తి నియోజకవర్గం శాసన సభ సభ్యులు *శ్రీ పం...
10/08/2025

*పెందుర్తి నియోజకవర్గం లో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు*.
ముఖ్య అతిథిగా..పెందుర్తి నియోజకవర్గం శాసన సభ సభ్యులు *శ్రీ పంచకర్ల రమేష్ బాబు*, విశీస్ట అతిథులు గా పాడేరు జనసేన పార్టీ ఇంచార్జీ *డా..వంపూరు గంగులయ్య* గారు,స్థానిక 97 కార్పొరేటర్ *శ్రీమతి సేనాపతి వసంత శంకర్రావు* *CP శంఖ బ్రత భాగ్షి* గారు హాజరయ్యారు.
ఈ వేడుకలు పెందుర్తి ఏరియా గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు,*లకే చిట్టిబాబు* దీసరి *భాస్కర్ రావు*,*శెట్టి జయదాసు* తదితర గిరిజన ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గిరిజన ఉద్యోగుల అభ్యున్నతికి మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటుందని, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నమని శాసన సభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు తెలిపారు అలాగే డా.. గంగులయ్య గారు మాట్లాడుతూ గిరిజన ఉద్యోగులకు ఎటువంటి సహాయ సహకారాలు అయిన జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

*రాష్ట్ర ముఖ్యంత్రి శ్రీ .official గారితో పాడేరు  ఇంచార్జీ .vampuru_gangulaiah     🏹⚔️⚔️
10/08/2025

*రాష్ట్ర ముఖ్యంత్రి శ్రీ .official గారితో పాడేరు ఇంచార్జీ .vampuru_gangulaiah 🏹⚔️⚔️

అల్లూరి సీతారామరాజు జిల్లాలో *04.08.2025న* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మాత్యులు *గ...
03/08/2025

అల్లూరి సీతారామరాజు జిల్లాలో *04.08.2025న* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మాత్యులు *గౌరవ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి పర్యటన షెడ్యూల్*..............................................
*ఉదయం 11 గంటలకు :* మినుములూరు డిఆర్ డిపో పరిశీలన
*11:30 గంటలకు*
పాడేరు మండలం సుందరపుట్టులో MLS పాయింట్ లో తనిఖీలు
*మధ్యాహ్నం 12 గంటలకు*
పాడేరు కలెక్టరేట్లో పౌరసరఫరాల శాఖ అధికారులతో రివ్యూ

*మధ్యాహ్నం 1 : 10 గంటలకు* పాడేరు PMRC లో మధ్యాహ్న భోజనం

*మధ్యాహ్నం 2 గంటలకు*
పాడేరు పీఎంఆర్సి, కించుమండ FP షాప్ తనిఖీలు
*రెండు 45 నిమిషాలకు* అరకువేలీలో MLS పాయింట్ వద్ద తనిఖీలు
*రాత్రికి*
అనంతగిరి మండలం హరిత రిసార్ట్ లో బస

*05.08.2025న*
ఉదయం 8 గంటలకు రేషన్ షాప్ డీలర్లతో సమీక్షా సమావేశం
*8:30 గంటలకు* అనంతగిరి నుంచి విశాఖ ప్రయాణం

పేదల సేవలో... మరో మంచి నిర్ణయం89,788, మంది వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరునెలకు రూ.4000 చొప్పున మంజూరుడా.వంపూ...
24/04/2025

పేదల సేవలో... మరో మంచి నిర్ణయం
89,788, మంది వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు
నెలకు రూ.4000 చొప్పున మంజూరు
డా.వంపూరు గంగులయ్య |జనసేన పాడేరు (అరకు పార్లమెంట్ ఇన్చార్జ్)
#

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఉపాధి పనుల ఆకస్మిక తనిఖీలు !• కూలీలకు తప్పకుండా కనీస వేతనం 300 వచ్చేలా అధ...
20/02/2025

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఉపాధి పనుల ఆకస్మిక తనిఖీలు !

• కూలీలకు తప్పకుండా కనీస వేతనం 300 వచ్చేలా అధికారుల చర్యలు

• 347 గ్రామ పంచాయతీలలో 985 పనులు పరీశీలించిన అధికారులు


vampuru_gangulaiah

*పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా!! వంపూరు గంగులయ్య, గారు ...
18/01/2025

*పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా!! వంపూరు గంగులయ్య, గారు మరియు జనసేన నాయకుల చేతుల మీదుగా శతఘ్ని న్యూస్ వారి ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరింప చెయ్యడం జరిగింది..* _ఈ సందర్భంగా డా!! వంపూరు గంగులయ్య గారు మాట్లాడుతూ వార్తల సేకరణలో ముందుంటూ జనసేన పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమించి కృషి చేస్తూ నిత్యం ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ నిత్యం జనసేన నాయకులను చైతన్య పరుస్తూ సమాజ శ్రేయస్సు కోరి వివిధ విభిన్న కథనాలను ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరిలో సామాజిక స్పృహను కలిగించేలా కృషి చేస్తూ సమ సమాజ నిర్మాణానికి పాటుపడుతున్న శతఘ్ని న్యూస్ జనగళమే మా గళం ప్రతి సంవత్సరం ప్రజల ఆదరణను పెంపొందించుకుంటూ పోతున్న మాదిరిగానే ఈ 2025 సంవత్సరంలో మీడియా రంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రజా ఆదరణతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శతఘ్ని న్యూస్ పాఠకులకు మరియు, జనసేన నాయకులకు వీరమహిళలకు, కూటమి నాయకులకు,అభిమానులకు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.. ఈ కార్యక్రమంలో ఐటీ ఇంచార్జ్ సాలేబు.అశోక్,పాడేరు మండల ఉపాధ్యక్షులు ఏస్.భూపాల్,కార్యనిర్వహణ సభ్యులు వంపూరు సురేష్, మండల నాయకులు మాదేల.నాగేశ్వర్రావు, ముదిలి.సుబ్బారావు,కుంచె. దేవేంద్ర ప్రసాద్, వంపూరు. రమేష్,జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు_

*అల్లూరి జిల్లా స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారికి సరస్వతి విగ్రహం బహుకరించిన జ...
05/11/2024

*అల్లూరి జిల్లా స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారికి సరస్వతి విగ్రహం బహుకరించిన జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా!! వంపూరు.గంగులయ్య గారు:* _ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా ఇంచార్జ్ స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు పాడేరు విచ్చేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత గ్యాస్ సిలిండర్ ల పంపిణీ కార్యక్రమం,గుంతలు పూర్చే కార్యక్రమం, మరియు అధికారులతో సమీక్ష సమావేశం, అనంతరం దరఖాస్తు దారులతో ఫిర్యాదులు స్వీకరించడం మొదలగు కార్యక్రమాల నిమిత్తం పాడేరు విచ్చేసిన స్త్రీ శిశు సంక్షేమం,గిరిజన శాఖ మంత్రి మరియు అల్లూరి జిల్లా ఇంచార్జ్ అయిన శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారికి జ్ఞాపికను జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా!! శ్రీ వంపూరు గంగులయ్య గారు సరస్వతి విగ్రహం బహుకరించడం జరిగింది... గంగులయ్య గారు తెలుపుతూ సరస్వతి విగ్రహం బహుకరుస్తున్న తరుణంలో గిరిజన ప్రాంతంలో సరస్వతి కుసుమాలు విరజల్లెటట్లు ఈ విగ్రహం చూసినప్పుడల్లా మీరు గుర్తుచేసుకుంటూ గిరిజన ప్రాంతం యొక్క విద్యాభివృద్ధికి కృషి చెయ్యాలని కోరడం జరిగింది.. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి కిట్లంగి. పద్మ, అధికార ప్రతినిధి శ్రీమతి బొనుకుల.దివ్యలత, ఐటీ ఇంచార్జ్ సాలేబు.అశోక్, అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గొర్లె.వీరవెంకట్ పాడేరు మండల అధ్యక్షులు నందోలి.మురళీకృష్ణ, ఐటీ టీమ్ కో ఆర్డినేటర్ సీ.హెచ్.అనిల్ కుమార్, జీ. మాడుగుల మండల అధ్యక్షులు మాసాడ.భీమన్న, గౌ!! అధ్యక్షులు తెరవాడ.వెంకట రమణ పాడేరు టౌన్ ప్రెసిడెంట్ మజ్జి నగేష్,కార్యనిర్వహణ సభ్యులు తాంగుల.రమేష్, గూడెం మండల అధ్యక్షులు కోయ్యం బాలరాజు, పాడేరు మండల ఉపాధ్యక్షులు సీసాల. భూపాల్, మండల నాయకులు సుర్ల.సుమన్, కుంచే.దేవేంద్ర ప్రసాద్, ముదిలి. సుబ్బారావు, బీరం నాయకులుతల్లే త్రిమూర్తులు,చరణ్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు_

Address

Lochalaputtu Near Government Degree College
Paderu

Telephone

+919440732806

Website

Alerts

Be the first to know and let us send you an email when జనసేన పాడేరు నియోజకవర్గం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to జనసేన పాడేరు నియోజకవర్గం:

Share