01/04/2026
*మీడియా సమావేశం వివరాలు*
*తేదీ: 01-04-2026*
*ఎన్టీఆర్ భవన్, మంగళగిరి*
*ప్రజలకు అందుబాటులోకి నాణ్యమైన వైద్య సేవలు*
*ఏపీ టూరిజం ఛైర్మన్ డా. నూకసాని బాలాజీ యాదవ్*
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 21 నెలల కాలంలోనే అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అద్భుతమైన సమతుల్యతను సాధించిందని ఏపీ టూరిజం ఛైర్మన్ నూకసాని బాలాజీ యాదవ్ పేర్కొన్నారు. కేవలం రోడ్లు, సాగునీరు, తాగునీరు మాత్రమే కాదు... ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని నమ్మిన ప్రభుత్వం 'డిజిటల్ సంజీవని ఆరోగ్య విప్లవం' ద్వారా ప్రతి ఇంటికీ భరోసా కల్పిస్తోందని ఆయన తెలిపారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా ప్రభుత్వం నూతన పాలసీని రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్, ఇన్సూరెన్స్ కంపెనీల సమన్వయంతో రూ. 2.5 లక్షల వరకు చికిత్స అందుతుంది. ఒకవేళ వైద్య ఖర్చు రూ. 2.5 లక్షలు దాటితే, మిగిలిన మొత్తాన్ని (రూ. 25 లక్షల వరకు) రాష్ట్ర ప్రభుత్వమే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పూర్తి బాధ్యత వహించి ఉచితంగా వైద్యం అందిస్తుంది. గతంలో మాదిరిగా రిపోర్టులు పట్టుకుని తిరిగే పని లేకుండా, ప్రతి పౌరుడికి ఒక డిజిటల్ హెల్త్ కార్డును రూపొందిస్తున్నాం. రోగి ఐడిని నమోదు చేయగానే వారి పూర్తి ఆరోగ్య చరిత్ర ఆసుపత్రి స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీని వల్ల అత్యవసర సమయాల్లో వైద్యులకు సరైన నిర్ణయం తీసుకోవడం సులభతరమవుతుంది. ఈ బృహత్తర పథకాన్ని ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే 3.38 లక్షల మంది ఆరోగ్య వివరాల సేకరణ పూర్తయింది. ఈ పథకం కింద ఏకంగా 3,257 రకాల వైద్య చికిత్సలను ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంజీవని ప్రాజెక్టును కేవలం చికిత్సకే పరిమితం చేయకుండా, ఆధునిక టెక్నాలజీ, రీసెర్చ్‌తో అనుసంధానం చేస్తున్నాం. వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలను తీసుకువచ్చి, పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని చేరువ చేయడమే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ప్రజల ఆరోగ్యంపై పెట్టే ఖర్చు పెట్టుబడి వంటిదని నమ్మే నాయకుడు చంద్రబాబు గారు. కుప్పంలో విజయవంతమైన ఈ విధానాన్ని త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి, ఆంధ్రప్రదేశ్‌ను ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దుతమని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అంటే కేవలం మాటలు చెప్పడం కాదు, ప్రజల దైనందిన సమస్యలను తీర్చి వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరూపిస్తున్నారు. ఇతర దేశాల్లో మాదిరిగానే, మన రాష్ట్రంలో కూడా వ్యాధుల పట్ల ముందుగానే అప్రమత్తం చేసే అద్భుతమైన వ్యవస్థను తీసుకువస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందజేయనున్నారు. ఇందులో పేషెంట్ ఆరోగ్య చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా, ఏకంగా 3257 రకాల జబ్బులకు 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టాటా ట్రస్ట్స్, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వైద్య రంగంలో వాడుతున్నారు. స్వయంగా బిల్ గేట్స్ సహకారాన్ని రాష్ట్రానికి తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి నిదర్శనం. గ్రామాల్లో కూడా తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు నిర్వహించేలా అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెస్తున్నారు. కిడ్నీ, గుండె, లివర్, డయాబెటిస్ వంటి ప్రధాన సమస్యలన్నింటినీ ఈ హెల్త్ కార్డు పరిధిలోకి తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారు టెక్ బ్యాగ్రౌండ్ నుంచి రాకపోయినా, ప్రపంచ స్థాయి టెక్ కంపెనీల సీఈవోల కంటే మిన్నగా ఆలోచించగలరు. 50 ఏళ్ల తర్వాత టెక్నాలజీ ఎలా ఉండబోతుందో ముందే ఊహించి, దానిని సామాన్యుడికి ఉపయోగపడేలా చేయడం ఆయనకే సాధ్యం. అందుకే ఆయనను "విజనరీ లీడర్" అని పిలుస్తారు. ప్రభుత్వం ఏదైనా మంచి పనిచేస్తున్నప్పుడు సలహాలు ఇవ్వాల్సింది పోయి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు కేవలం విమర్శలకే పరిమితమవుతున్నారు. గతంలో 'మూడు రాజధానులు' పేరుతో అమరావతిని నాశనం చేసిన జగన్, ఇప్పుడు మళ్ళీ అదే రాజధానిపై విషం చిమ్ముతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రపంచంతో పోటీపడేలా రాజధానిని నిర్మిస్తుంటే, సహకరించడం మానేసి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఆరోగ్య సంజీవని, డిజిటల్ హెల్త్ కార్డుల వంటి గొప్ప పథకాలను ప్రజలకు దూరం చేసేలా, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం చూపిస్తున్న ఈ ప్రత్యేక శ్రద్ధ, ప్రతి పేదవాడికి ‘శ్రీరామరక్ష’గా నిలుస్తుంది. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనాలంటే ప్రభుత్వం చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నాలకు ప్రజలందరి సహకారం ఎంతో అవసరం.
గత ఐదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ ఎలా నిర్వీర్యం అయ్యాయో మనం చూశాం. ప్రజలకు అత్యవసర సేవలందించాల్సిన 108 అంబులెన్స్‌లు 2019-24 మధ్య కాలంలో అలంకారప్రాయంగా మారాయి. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ వ్యవస్థకు మళ్లీ ప్రాణం పోశారు. ప్రస్తుతం 108 అనేది కేవలం ఒక వాహనం కాదు, అది ఒక మినీ ఆసుపత్రి. ప్రమాదం జరిగిన వెంటనే కేవలం 15 నిమిషాల్లో వాహనం చేరుకోవడమే కాకుండా, ఆసుపత్రికి వెళ్లే లోపే టెలి-మెడిసిన్ ద్వారా నిపుణులైన వైద్యులతో చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. 2024 తర్వాత సుమారు 10 లక్షల మంది 108 సేవలు పొందారు. ఇందులో 7.5 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరి ప్రాణాలు దక్కించుకోగా, 2.5 లక్షల మందికి అంబులెన్స్‌లోనే ప్రాథమిక చికిత్స అందించి సురక్షితంగా ఇంటికి పంపారు. పట్టణాల్లో 18 నిమిషాలు, గ్రామాల్లో 23 నిమిషాలు, గిరిజన ప్రాంతాల్లో 33 నిమిషాలు, అని లక్ష్యంగా పెట్టుకుంటే.. ప్రభుత్వం అంతకంటే 2-3 నిమిషాల ముందే చేరుకుని బాధితులను ఆదుకుంటోంది. గత వైసీపీ పాలనలో ఉపాధ్యాయులను లిక్కర్ షాపుల ముందు నిలబెట్టిన దుస్థితిని మనం చూశాం. వ్యవస్థలను నడపడం అంటే కేవలం కాంట్రాక్టులు ఇచ్చుకోవడం కాదు, సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలని ఈ ప్రభుత్వం నిరూపించింది. టెక్నాలజీని వాడుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మరణాలను 20 శాతం తగ్గించగలిగారు. అత్యవసర సమయాల కోసం 731 బ్యాకప్ వాహనాలను సిద్ధంగా ఉంచారు. 3250 రకాల జబ్బులకు రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తూ, ఆరోగ్య సంజీవని పథకం ద్వారా ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నారు. ఒకవైపు ఆరోగ్యంపై ఇంత శ్రద్ధ చూపిస్తూనే, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేస్తూ సామాజిక భరోసాను కల్పిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు చేసే విష ప్రచారాలను, అసందర్భ విమర్శలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి. గతంలో మోసపోయినట్లు మళ్ళీ మోసపోవద్దు. ప్రభుత్వం చేస్తున్న ఈ గొప్ప పనులను, విప్లవాత్మక మార్పులను అర్థం చేసుకుని, రాష్ట్ర అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలి. మన ప్రాణాలను కాపాడే ఈ ప్రభుత్వానికి మీ సహకారం ఎంతో అవసరమన్నారు.