Anil Chandaka JSP - Parvathipuram

Anil Chandaka JSP - Parvathipuram Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Anil Chandaka JSP - Parvathipuram, Social service, Sowndarya Junction, Mainroad, Narsipatnam.

🚩అక్రమాలకు పాల్పడే డాక్యుమెంట్ రైటర్లకు ఇదే మా హెచ్చరిక!🚩ప్రజల కష్టార్జితంతో ఆటలాడితే సహించేది లేదు!ప్రజల అమాయకత్వాన్ని ...
30/05/2026

🚩అక్రమాలకు పాల్పడే డాక్యుమెంట్ రైటర్లకు ఇదే మా హెచ్చరిక!

🚩ప్రజల కష్టార్జితంతో ఆటలాడితే సహించేది లేదు!

ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, డాక్యుమెంట్లలో కావాలని తప్పులు రాస్తూ... డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పుకునే ‘డాక్యుమెంట్ రైటర్ల’ ఆటలు ఇక కట్టిపెట్టండి. మీ స్వార్థం కోసం ప్రజల జీవిత కాల కష్టాన్ని ఇబ్బందుల్లో నెడితే... చట్టపరమైన చర్యలు తప్పవు అని జనసేన పార్టీ హెచ్చరించింది.

Note: మీ డాక్యుమెంట్స్ లో ఏమైనా తప్పులు దొర్లితే "సవరణ పత్రం (Rectification Deed) ద్వారా తప్పులను సరిచేసుకోవచ్చు, ఎవరూ కూడా మోసగాళ్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు"

🚩జనసేనాని, డిప్యూటీ సీఎం "పవన్ కళ్యాణ్" గారి మీద, జనసేన పార్టీ లీడర్‌షిప్ మీద దాసరి రాము చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానాన్ని...
28/05/2026

🚩జనసేనాని, డిప్యూటీ సీఎం "పవన్ కళ్యాణ్" గారి మీద, జనసేన పార్టీ లీడర్‌షిప్ మీద దాసరి రాము చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానాన్ని, లేదా ఆయన వెనుక ఉన్న వారి స్క్రిప్ట్‌ను స్పష్టం చేస్తున్నాయి.

🚩రాము గారు కాపు జేఏసీ పేరు పెట్టుకొని, సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టడమే మీ లక్ష్యమా?

🚩పవన్ కళ్యాణ్ గారు కులానికి అతీతుడు.. ఆయన్ని కుల చట్రంలో బంధించకండి!

పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచీ చెబుతున్నారు.. ఆయన ఏ ఒక్క కులానికో పరిమితమైన నాయకుడు కాదు. అన్ని కులాలూ బాగుండాలి, అందరికీ రాజ్యాధికారం దక్కాలన్నదే ఆయన ఆశయం. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు డిప్యూటీ సీఎంగా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అడవుల శాఖ మంత్రిగా రాష్ట్రం కోసం రాత్రింబగళ్లు కష్టపడుతున్నారు. నిజమైన ప్రజా సమస్యలు ఉన్నవారికి, కింది స్థాయి జనసైనికులకు ఆయన ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. కానీ, లీడర్లమని చెప్పుకుంటూ సొంత పనుల కోసం, కాంట్రాక్టుల కోసం, సిఫార్సుల కోసం తిరిగే ‘బ్రోకర్లకు’ పవన్ కళ్యాణ్ గారి దగ్గర అపాయింట్‌మెంట్ దొరకదు.. దొరకబోదు కూడా! బహుశా అందుకే మీలాంటి వారికి ఆయన అందుబాటులో లేనట్టు అనిపిస్తోంది.

జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ గారు మొదటి నుండి పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం నిలబడిన వ్యక్తి. లింగమనేని రమేశ్ గారు గానీ, ఇతరులు గానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తోడుగా నిలిచినవారే తప్ప.. పదవుల కోసం వచ్చిన వారు కాదు. పార్టీ ఆఫీసు గేటు దగ్గరకు బీసీలు, ఎస్సీలను రానివ్వరా? ఈ రోజు జనసేన తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో, కీలక పదవుల్లో ఉన్నవారిలో బీసీ, ఎస్సీ, మైనారిటీ నేతలు ఎంతమంది ఉన్నారో ఒకసారి కళ్లు తెరిచి చూడండి. జనసేన అందరి పార్టీ, కేవలం ఒకరిద్దరి కోసమో, ఒక కులం కోసమో నడిచే లిమిటెడ్ కంపెనీ కాదు.

చివరిగా దాసరి రాము గారికి హెచ్చరిక:
వైసీపీ హయాంలో జనసేన కార్యకర్తలు దెబ్బలు తిన్నప్పుడు, కేసులు పెట్టించుకున్నప్పుడు మీరు ఏసీ రూముల్లో దాక్కున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, పవన్ కళ్యాణ్ గారిపై బురద చల్లి కాపు సామాజిక వర్గంలో హీరో అయిపోదామని చూస్తున్నారు. మీ ఆటలు సాగవు. జనసైనికులు, కాపు యువత అంతా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వైపే ఉన్నారు. ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకోకపోతే జనసైనికులే మీకు తగిన బుద్ధి చెబుతారు.

త్యాగం, సత్యం యొక్క ఔన్నత్యాన్ని చాటిచెప్పే పండుగ బక్రీద్.ప్రవక్త ఇబ్రహీం గారి మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ, భక్తిశ్...
28/05/2026

త్యాగం, సత్యం యొక్క ఔన్నత్యాన్ని చాటిచెప్పే పండుగ బక్రీద్.

ప్రవక్త ఇబ్రహీం గారి మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ, భక్తిశ్రద్ధలతో అల్లాహ్‌ను ప్రార్థిస్తూ జరుపుకునే ఈ పవిత్ర పండుగ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు.

టీడీపీ నాయకులు, శ్రేణులకు మహానాడు"శుభాకాంక్షలు"
27/05/2026

టీడీపీ నాయకులు, శ్రేణులకు మహానాడు

"శుభాకాంక్షలు"

🚩పార్వతీపురం మున్సిపాలిటీ వార్డుల పునర్విభజనపై 'జనసేన’ అభ్యంతరాల వినతి పత్రం.🚩ఒకే వీధి.. రెండు వార్డులు! మున్సిపల్ కొత్త...
25/05/2026

🚩పార్వతీపురం మున్సిపాలిటీ వార్డుల పునర్విభజనపై 'జనసేన’ అభ్యంతరాల వినతి పత్రం.

🚩ఒకే వీధి.. రెండు వార్డులు! మున్సిపల్ కొత్త మ్యాపింగ్‌పై స్థానికులు తాము ఏ వార్డు పరిధిలోకి వస్తామో తెలియని అయోమయంలో ఉన్నారు.

🚩అస్తవ్యస్తంగా సరిహద్దులు ఉన్న వార్డులను సవరించాలని జనసేనపార్టీ నాయకులు "చందక అనీల్" గారు డిమాండ్ చేశారు.

🚩మున్సిపల్ కమిషనర్ గారికి రాతపూర్వకంగా కొన్ని అంశాలు పైన RTI ద్వారా సమాచారం కోరారు.

పార్వతీపురం, మే 24 ఆదివారం: పార్వతీపురం మున్సిపాలిటీని 30 వార్డుల నుండి 36 వార్డులుగా పునర్విభజిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. అయితే, ప్రస్తుతం విడుదల చేసిన వార్డుల మ్యాపింగ్ మరియు సరిహద్దుల నిర్ధారణలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. దీనివల్ల స్థానిక ప్రజలు భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అని కొన్ని ముఖ్యమైన అభ్యంతరాలు జనసేన పార్టీ సీనియర్ నాయకులు చందక అనీల్, భమిడిపాటి చైతన్య, మెరువా శివకుమార్, కొల్లేపర తేజ తదితరులు వినతి పత్రం ఇస్తు అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లారు. వాళ్ళు మాట్లాడుతూ కొన్ని వీధులను ఒకే వార్డులో ఉంచకుండా, మ్యాపింగ్‌లో రెండు మూడు వార్డులుగా విభజించారు. దీనివల్ల స్థానికులకు తాము ఏ వార్డు పరిధిలోకి వస్తామో తెలియని అయోమయం ఏర్పడుతుంది, అలాగే ఓటర్ల జాబితా మరియు మ్యాపింగ్ క్రమంలో ఒకే ఇంట్లో నివసించే కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు వార్డుల పరిధిలోకి మారిపోయాయి. ఇది స్థానిక ఎన్నికల సమయంలో ఓటర్లకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది అని ప్రధాన రహదారులు, కాలువలు వంటి సహజ సరిహద్దులను ప్రాతిపదికగా తీసుకోకుండా మ్యాపింగ్ చేయడం వల్ల వార్డుల రూపకల్పన అస్తవ్యస్తంగా తయారైంది అని, కొత్తగా మ్యాపింగ్ చేసిన వార్డులకు వాటి సరిహద్దులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు అని వాటిని సవరించాలి అని మా జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. అలాగే మున్సిపల్ అధికారులు మరియు పునర్విభజన కమిటీ వారు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాము. క్షేత్రస్థాయిలో (Ground Level) వాస్తవ పరిస్థితులను పరిశీలించి, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈ గందరగోళ మ్యాపింగ్‌ను సవరించాలని మరియు తుది నోటిఫికేషన్ విడుదలకు ముందే లోపాలను సరిదిద్దాలని తెలిజేసాం. అనంతరం పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో కొన్నాళ్లుగా ఆర్ధిక లావాదేవీలపైన వస్తున్న ఆరోపణలలో వాస్తవాలు తెలుసుకొని. వాటిలో నిజం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి అని కోరుతూ మున్సిపల్ కమిషనర్ గారికి రాతపూర్వకంగా కొన్ని అంశాలు పైన RTI ద్వారా సమాచారం కోరడం అయ్యింది.

"With the Janasena social media rockstar!Prasannakumar Nalle🌟✊"
16/05/2026

"With the Janasena social media rockstar!
Prasannakumar Nalle🌟✊"

🚩రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో "జనసేన ఉద్యమి" సభ్యత్వాల్లో క్రియాశీలకంగా వ్యవహ...
16/05/2026

🚩రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో "జనసేన ఉద్యమి" సభ్యత్వాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన "జనసేన సాధక్" లతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పార్వతీపురం జనసేనపార్టీ నాయకులు చందక అనీల్, నెయ్యిగాపుల సురేష్.

"జనసైనికులతో మాట మంతి"పార్వతీపురం మున్సిపాలిటి 23వ వార్డు, లింగం వీధి ముఖ్య నాయకులు మరియు జనసైనికులతో ఈ రోజు ఉదయం పార్టీ...
27/04/2026

"జనసైనికులతో మాట మంతి"

పార్వతీపురం మున్సిపాలిటి 23వ వార్డు, లింగం వీధి ముఖ్య నాయకులు మరియు జనసైనికులతో ఈ రోజు ఉదయం పార్టీకి సంబంధించి పలు విషయాలపైన చర్చించిన జనసేన నాయకులు. అనంతరం వ్యాపార, ఉద్యోగ రీత్యా దూరప్రాంతాలలో ఉన్న పార్టీ శ్రేణులతో విడియో కాల్స్ లో చర్చించారు.

19/04/2026

🚩ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ "పవన్ కళ్యాణ్" గారు త్వరగా కోలుకోవాలని పార్వతీపురం గ్రామదేవత "...
19/04/2026

🚩ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ "పవన్ కళ్యాణ్" గారు త్వరగా కోలుకోవాలని పార్వతీపురం గ్రామదేవత "ఇప్పలపొలమ్మ" అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు.

పార్వతీపురం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ "పవన్ కళ్యాణ్" గారు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ, ఈరోజు పార్వతీపురం పట్టణ గ్రామదేవత అయిన శ్రీ "ఇప్పలపొలమ్మ" అమ్మవారి ఆలయంలో పార్వతీపురం నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు "చందక అనీల్" గారు ఆధ్వర్యంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నిన్న శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, వారు త్వరగా కోలుకొని తిరిగి పూర్తి ఆరోగ్యంతో ప్రజల ముందుకు రావాలని, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు,కార్యకర్తలు మాట్లాడుతూ "కోట్లాది మంది అభిమానులు, ప్రజల ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఆ ఇప్పలపొలమ్మ అమ్మవారిని వేడుకున్నాము. ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆయనకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు మరింత శక్తితో ప్రజా సేవలో నిమగ్నం కావాలని కోరుకుంటున్నాము" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు ఇజ్జాడ కాళి, భమిడిపాటి చైతన్య, కొల్లేపర తేజ, మెరువ శివ, శంబాన కూర్మ, రెడ్డి నాగరాజు, గునాన నరేష్, నెయ్యిగాపుల సంతోష్, రెడ్డి నాగరాజు, మహేశ్వర అజయ్, గేదెల వంశీ, లాడే వరుణ్, గుడ్ల వెంకటేష్, గొర్జన అవినాష్, మజ్జి గణేష్, చిత్తూరు సురేష్, మణి తదితరులు. కురుపాం జనసేనపార్టీ ముఖ్య నాయకులు సంజు తదితరులు పాల్గొన్నారు.

Address

Sowndarya Junction, Mainroad
Narsipatnam
535501

Telephone

+919440161076

Website

Alerts

Be the first to know and let us send you an email when Anil Chandaka JSP - Parvathipuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Anil Chandaka JSP - Parvathipuram:

Share