CPM Narayanapet

CPM Narayanapet CPM NARAYANAPET

రైతులు నష్టపోయిన పంటలను అంచనావేసి పరిహారం చెల్లించాలి.
18/03/2025

రైతులు నష్టపోయిన పంటలను అంచనావేసి పరిహారం చెల్లించాలి.

https://youtu.be/4UWxy_EbYQ4?si=YHVFeQvUdw4ZUEAQ
18/01/2025

https://youtu.be/4UWxy_EbYQ4?si=YHVFeQvUdw4ZUEAQ

రైతు భరోసా ఎవరికి | Rythu Bharosa Telangana | KCR | Revanth Reddyతెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - సాగర్

https://www.youtube.com/live/sbjYVXtu26U?si=ucCIiWNhyxTrPgSZ
06/01/2025

https://www.youtube.com/live/sbjYVXtu26U?si=ucCIiWNhyxTrPgSZ

ఓ రోజు చూస్తే కూరగాయల ధరలు కొండెక్కి ఉంటాయి. మరోసారి చూస్తే కొనేటోళ్లు లేక అదే పంట ఉత్పత్తులు పారబోస్తున్న రైత.....

https://youtu.be/iwUJv5-gR_8?si=IjPExinmY36D7QXQ
05/09/2024

https://youtu.be/iwUJv5-gR_8?si=IjPExinmY36D7QXQ

వరదల కారణంగా పంటల నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలి- తెలంగాణ రైతు సంఘంరాష్ట్రంలో వరదల కారణంగా పంటలు దెబ...

09/08/2024

*ప్రచురణార్థం/ ప్రసారార్థం: తేదీ:09/08/2024*

*కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా*
*క్విట్‌ ఇండియా ఉద్యమ స్పూర్తితో పోరాడుదాం!*

-- కార్పొరేట్‌ లూటర్స్ క్విట్ ఇండియా కార్యక్రమంలో నాయకుల పిలుపు

కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా క్విట్‌ ఇండియా ఉద్యమ స్పూర్తితో ఐక్యంగా పోరాడుదామని కార్పొరేట్‌ లూటర్స్‌ క్విట్‌ ఇండియా కార్యక్రమంలో రైతు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల జాతీయ పిలుపులో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని నారాయణగూడ చౌరస్తాలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న కేంద్ర బడ్జెట్‌ను సవరించాలని ఉపాధిహామీ పథకానికి నిధులు పెంచాలని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించాలని, ఎరువుల సబ్సిడీకి కోతలు నివారించి నిధులు పెంచాలని, నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26000లు నిర్ణయించాలని, కార్పొరేట్‌ విత్తన కంపెనీలకు ప్రభుత్వ నిధులు కేటాయించొద్దని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సంయుక్త కిసాన్‌ మోర్చా రాష్ట్ర కన్వీనర్లు టి.సాగర్‌, పశ్య పద్మ, బి. రాము, మండల వెంకన్న, జక్కుల వెంకటయ్య, ఆర్‌. వెంకట్రాములు, ప్రసాదన్న, శంకర్‌లు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు 5% పన్ను రాయితీ ఇచ్చిందని, భడా కార్పొరేట్‌ కంపెనీలకు విత్తన పరిశోధన సంస్థ నుండి నిధులు కేటాయించేందుకు సిద్ధపడ్డారని అందులో భాగంగానే అమెజాన్‌, సిన్‌జెంటా, బేయర్‌ లాంటి కంపెనీలకు కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థ ద్వారా నిధులు ఇచ్చేందుకు సిద్దపడ్డారని అన్నారు. రైతు సంఘాలతో మాట్లాడకుండా విద్యుత్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనూ అని హామీ ఇచ్చి ఇప్పుడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిందని అన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోత పెట్టిందని, ఎరువుల సబ్సిడీకి కూడా కోత పెట్టిందని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన పోరాటం ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో బిజెపికి గుణపాఠం చెప్పినా కూడా పాఠాలు నేర్చుకోవడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని తెలియజేశారు.
కార్మిక సంఘాల నాయకులు బాల్‌రాజ్‌, వెంకటేష్‌, బోస్‌, శివబాబు, యూసుఫ్‌, చంద్రశేఖర్‌, అంజద్‌ఖాన్‌, వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చి తరతరాలుగా పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కుల్ని కాలరాసిందని అన్నారు. కనీస వేతనం రూ.26000లు నిర్ణయించాలని ఆందోళన చేసిన పట్టించుకోలేదని, పనిగంటలను పోరాడిసాధించుకుంటే వాటిని కేంద్ర ప్రభుత్వం కాలరాసిందని అన్నారు. కేంద్ర బడ్జెట్‌ను పేదలకు అనుకూలంగా సవరించాలని, బొగ్గు బ్లాక్‌లను వేలం వేయడాన్ని ఆపాలని, అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌, నగర అధ్యక్షులు కుమార్‌, ప్రజా సంఘాల నాయకులు ప్రదీప్‌, రామకృష్ణ, రామ్‌చందర్‌, జి.వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

08/07/2024
01/07/2024
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు రైతాంగాన్ని మరోసారి మోసం చేసే విధంగా ఉన్నాయని, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల...
25/06/2024

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు రైతాంగాన్ని మరోసారి మోసం చేసే విధంగా ఉన్నాయని, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం అమలు చేయాలని హైదరాబాదు(బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్)లో జూన్ 25న జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సంయుక్త కిసాన్ మోర్చా (యస్ కె యం)జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు, ఎఐకేస్ జాతీయ సహాయ కార్యదర్శి టీ సాగర్ , యస్ కె యం రాష్ట్ర నాయకులు విస్సా కిరణ్, కన్నెగంటి రవి, జక్కుల వెంకటయ్య ,మురళీధర్

రాష్ట్రానికి  సమగ్ర వ్యవసాయ  ప్రణాళిక ఉండాలి. --టి.సాగర్ తెలంగాణా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రానికి సమగ్ర...
20/06/2024

రాష్ట్రానికి సమగ్ర వ్యవసాయ ప్రణాళిక ఉండాలి.
--టి.సాగర్
తెలంగాణా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

రాష్ట్రానికి సమగ్ర వ్యవసాయ ప్రణాలిక ఉండాలనీ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ డిమాండ్ చేసారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలో SR గార్డెన్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రైతు సంఘం అద్వర్యంలో గురువారం రోజు మారుతున్నా వాతావరణం వ్యవసాయ ప్రణాళిక పై జరిగిన జిల్లా సదస్సులో ఆయన ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు.
పండించిన పంటకు కనీస మద్దతు ధరల చట్టం తేవాలని, పంటకు ముందే మద్ధతు ధర మరియు బోనస్ నిర్ణయించాలన్నారు.
పంట రేటు రైతుకు మిగిలి ఉండేవిధంగా నిర్ణయించాలి కనుక స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం పెట్టుబడికి 50 శాతం కలిపి ధర నిర్ణయించాలి.కేరళలో మాదిరిగా క్వింటాల్కు బోనస్ 800.రూపాయలు ఇవ్వాలన్నారు 60 శాతం కూరగాయలు ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. పంటకు పంట బీమా లేకపోవడం వలన రైతులు నష్టపోతున్నారని అన్నారు.

జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ ప్రతి సారి పంటకు కాంప్లెక్స్ ఎరువులు వాడొద్దని వాడితే నేలలో భాస్వరం పెరిగి మొక్కకు జింకు పోషక లోపం ఏర్పడే ప్రమాదం ఉంటుందన్నారు.
యూరియా, పొటాషియం మాత్రమే వాడాలన్నారు. మొక్క ఎదిగే సమయంలో పూత పూసే పద్దతి బాటు పెట్టె పద్దతి పాటించాలన్నారు. లైసెన్స్ ఉన్న షాపుల్లో మాత్రమే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్,పశు సంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్ మాట్లాడారు.ఈ సదస్సుకు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్ అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ యం పి పి మహేష్ కుమార్ గౌడ్, రైతు సంఘం జిల్లా నాయకులు జి దస్తప్ప, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Address

Narayanpet
509210

Telephone

+919908848991

Website

Alerts

Be the first to know and let us send you an email when CPM Narayanapet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share