04/05/2026
ఇండియా సెంట్రల్ లో మెజారిటీ రాష్టలలో బిజెపి సొంతంగా గెలవలేదు, ప్రాంతీయ పార్టీలే ఆ అవకాశాన్ని ఇచ్చాయి.
2021లో "కాంగ్రెస్‌కు విలువ లేదు" అని తృణమూల్ ఎగతాళి చేసింది , ఇప్పుడు బెంగాల్లో బిజెపి గెలిచింది.
యూపీలో "కాంగ్రెస్ ఒక భారం" అని ఎస్పీ అంది, అక్కడ బిజెపి వరుసగా రెండుసార్లు గెలిచింది.
దేశానికి మేమే ప్రత్యామ్నాయం" అన్న ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీని నిలబెట్టుకోలేకపోయింది, పంజాబ్‌లో పట్టు కోల్పోయింది
ఇక లెఫ్ట్ పార్టీలు పదే పదే తృతీయ కూటమి అంటూ "కాంగ్రెస్ పని అయిపోయింది" అంటే, కేరళ ప్రజలు లెఫ్ట్‌ను పక్కన పెట్టి కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు.
తమిళనాడులో డిఎంకె కుటుంబ పాలన సాగిస్తుంటే, ఒక కొత్త పార్టీ వారి యువత ఓట్లను తన్నుకుపోయింది.
ఇక్కడ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. బిజెపిని ఆపడం కంటే కాంగ్రెస్‌ను కూటమికి దూరంగా ఉంచడానికే ఎక్కువ కష్టపడ్డ ప్రాంతీయ పార్టీలన్నీ, ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతున్నాయి.
ఈ "థర్డ్ ఫ్రంట్" అనేది ఒక భ్రమ మాత్రమే, అది ఎప్పుడూ బిజెపిని ఓడించలేదు.
కానీ కాంగ్రెస్ మాత్రం కర్ణాటకను గెలిచింది, తెలంగాణను సాధించింది, హిమాచల్‌లో నెగ్గింది. కేరళ నెగ్గింది ఇవాళ కాంగ్రెస్ సొంతంగా కోల్పోయిన రాష్టం అస్సాం మాత్రమే
ఈరోజు పార్లమెంటులో బిజెపికి పూర్తి మెజారిటీ లేకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. దీనికి ప్రధాన బలం దేశంలోని ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పటిష్టమైన కేడర్.
ప్రాంతీయ పార్టీలకు లేని విధంగా, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ కార్యకర్తల సైన్యమే కాంగ్రెస్‌ను మళ్ళీ నిలబెడుతోంది.
ప్రాంతీయ నాయకులందరూ కాంగ్రెస్‌ను "మునిగిపోయే పడవ" అని విమర్శిస్తున్నా, బిజెపికి ఎదురు నిలిచి ప్రయాణిస్తున్న ఏకైక పడవ కాంగ్రెస్ మాత్రమే.
ప్రాంతీయ పార్టీల సమస్య బిజెపి కాదు, వారి అహంకారం. ఆ అహంకారానికే "థర్డ్ ఫ్రంట్ రాజకీయం" అని పేరు.
బిజెపిని ఢీకొట్టగల ఏకైక జాతీయ పార్టీతో కలిసి నడవాలి, లేదంటే మీ పార్టీలు చరిత్రలో కలిసిపోతాయి. ఇది కాంగ్రెస్ అడుగుతున్న సహాయం కాదు, కాలం చెబుతున్న నిజం.