Mekala SuneethaRamu yadav

Mekala SuneethaRamu yadav Goutham Nagar - 141 Division Corporator (GHMC) From Malkajgiri Constituency Hyderabad | TRS Party

ప్రజా ఆరోగ్యం మెరుగుపరచడానికి బస్తీ దవాఖాన ఏర్పాటుమురికివాడలలో ప్రజా ఆరోగ్యం మెరుగుపరచేందుకు బస్తీ దవాఖానాల ఏర్పాటుకు చర...
28/05/2026

ప్రజా ఆరోగ్యం మెరుగుపరచడానికి బస్తీ దవాఖాన ఏర్పాటు
మురికివాడలలో ప్రజా ఆరోగ్యం మెరుగుపరచేందుకు బస్తీ దవాఖానాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో ఉమా గౌరీ తెలిపారు.

మల్కాజ్గిరి శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బుధవారం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని హిల్‌టాప్ కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాల్‌లో బస్తీ దవాఖాన ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు.

అలాగే ఇందిరా నెహ్రూ నగర్ కాలనీలోని మరో స్థలాన్ని కూడా పరిశీలించారు. త్వరలోనే బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో లావణ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మల్కాజిగిరి నియోజకవర్గం లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నామని మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర...
23/05/2026

మల్కాజిగిరి నియోజకవర్గం లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నామని మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

మిర్జాల్‌గూడ డివిజన్ పరిధిలోని వాణీ నగర్ వీధి నెంబరు 2 లో 54 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ తో కలిసి మర్రి రాజశేఖర్ రెడ్డి శనివారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గౌతమ్ నగర్ లెవెల్ క్రాసింగ్ వద్ద RUB  నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం MLA మర్రి రాజశేఖర్ రెడ్డి42 కోట్ల రూపాయల తో నిర్మి...
19/05/2026

గౌతమ్ నగర్ లెవెల్ క్రాసింగ్ వద్ద RUB నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం MLA మర్రి రాజశేఖర్ రెడ్డి

42 కోట్ల రూపాయల తో నిర్మించనున్న RUB నిర్మాణం

దశాబ్ద కాలంగా గౌతమ్ నగర్ గేటు వద్ద నిత్యం అవస్థలు పడుతున్న ప్రయాణికుల అవస్థలు త్వరలో తీరనున్నాయని మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మరియు నిర్మాణ పనులలో భాగంగా మంగళవారం రైల్వే ప్రాజెక్టు అధికారులు, జిహెచ్ఎంసి ప్రాజెక్టు అధికారులు, హెచ్ఎం డబ్ల్యూ అధికారులతో కలిసి గౌతమ్ నగర్ వద్ద ఆర్యుబి నిర్మాణం కోసం డ్రింకింగ్ వాటర్ మరియు సివరేజ్ పైపులైండ్ల ఏర్పాటు కోసం ఎమ్మెల్యే పరిశీలించారు.

అధికారుల సమన్వయంతో ఆరిబీ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించాలని కోరారు. ప్రజలకు నివాసితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మేకల సునీత. రైల్వే సీనియర్ డీన్ రాజేంద్రప్రసాద్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ రవి ప్రకాష్, జిహెచ్ఎంసి ప్రాజెక్ట్ ఏఈ సుజిత్. జలమండలి జిఎం సునీల్ కుమార్, డీజీఎం రమణారెడ్డి, ఏ ఈ నవీన్, స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చట్టం ఎవరికి చుట్టం కాదు మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ బండి భగీరథ్ ను అరెస్టు చేయాలికేంద్ర మంత్రి బండి సంజయ్ ని వ...
15/05/2026

చట్టం ఎవరికి చుట్టం కాదు

మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ బండి భగీరథ్ ను అరెస్టు చేయాలి

కేంద్ర మంత్రి బండి సంజయ్ ని వెంటనే బర్తరఫ్ చేయాలి - మాజీ కార్పొరేటర్ మేకల సునీత డిమాండ్

మైనర్ బాలికపై అఘాట్యానికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథును వెంటనే అరెస్టు చేయాలని గౌతమ్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ డిమాండ్ చేశారు.

మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ వద్ద శుక్రవారం చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొని నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో తెలంగాణ రాష్ట్రంలో మైనర్ బాలికలతో పాటు మహిళలకు రక్షణ లేదని ఆ విధంగా వ్యక్తం చేశారు 8వ తేదీ బండి భగీరథ పై ఫోక్సో కేసు నమోదు అయినప్పటికీ నేటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆమె ప్రశ్నించారు.

తక్షణమే భగీరథున అరెస్టు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిమల్కాజ్‌గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ర...
14/05/2026

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు తన చేతుల మీదుగా పంపిణీ చేశారు.

డివిజన్ వారీగా లబ్ధిదారులకు అందించిన సహాయం వివరాలు
🔹 గౌతమ్ నగర్ డివిజన్
వసంత – ₹25,000
కుశాల్ రావు – ₹45,500
శ్రావణి – ₹35,000 & ₹11,000
పద్మావతి – ₹16,500
లావణ్య – ₹52,000

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగపడుతున్నదని తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మేకల రాము యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Development works are progressing rapidly under the leadership of , MLA, Malkajgiri Constituency.Inauguration of the rem...
12/05/2026

Development works are progressing rapidly under the leadership of , MLA, Malkajgiri Constituency.

Inauguration of the remodelling works of the existing drain at Mirjalguda Culvert on Chinmay School Marg, Mirjalguda, and laying of 600mm RCC Pipeline near Manisha Apartments at Raja Srinivasa Nagar, Mirjalguda, in the presence of , MLA Malkajgiri, , Ex-MBC Chairman, BRS Party senior leaders, GHMC officials, and colony members.

These development works are being undertaken to improve the drainage system, prevent water stagnation issues, and provide better infrastructure facilities for local residents.

Local residents expressed happiness and thanked the leaders for taking up long-pending civic issues on priority


బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుంది – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్...
11/05/2026

బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుంది – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని గోపాల్ నగర్ కమ్యూనిటీ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ తరఫున తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. గౌతమ్ నగర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు కమిటీ ఏర్పాట్లకు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్, గౌతమ్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మేకల సునీత రామ్ యాదవ్, మేకల రాము యాదవ్, మల్కాజ్గిరి నియోజకవర్గ కమిటీ ప్రతినిధులు జేఏసీ వెంకన్న, మహమ్మద్ ఖలీల్, రావుల అంజయ్య, పరశురాం రెడ్డి, వీరేశం యాదవ్, బైరు అనిల్, కృష్ణ గౌడ్, సిద్ధిరాములు, రామచర్ల నర్సింగ్, మర్రి శీను, హబీబ్, సిహెచ్ వెంకట్, భరత్, సిద్ధులు, సుధామ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన బీఆర్‌ఎస్ ...
27/04/2026

బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు

తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన బీఆర్‌ఎస్ పార్టీ, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగుతోంది. ప్రజల ఆశయాల సాధనలో, సమగ్ర అభివృద్ధి దిశగా మరింత విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తూ…

జై తెలంగాణ!
జై బీఆర్‌ఎస్!

Happy Wedding Anniversary to our MLA Sri Marri Rajasekhar Reddy garu & Mamatha Reddy garu 💐Wishing you both a lifetime o...
23/04/2026

Happy Wedding Anniversary to our MLA Sri Marri Rajasekhar Reddy garu & Mamatha Reddy garu 💐

Wishing you both a lifetime of love, happiness, and success together ✨

Address

#1-32, Sanjay Nagar, Brundhavan Colony, Beside Hero Showroom
Malkajgiri

Alerts

Be the first to know and let us send you an email when Mekala SuneethaRamu yadav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mekala SuneethaRamu yadav:

Share