Kollu Foundation

Kollu Foundation We design interventions to ensure food provided to the needy people where food can act as an incentive for their living.

కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఒత్తిడి నుండి విజయం వైపు’ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర విద్యార్ధులకు ఒత్తిడి లేని చదువ...
25/01/2026

కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఒత్తిడి నుండి విజయం వైపు’ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర

విద్యార్ధులకు ఒత్తిడి లేని చదువులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని గోల్డ్ కన్వెన్షన్లో కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒత్తిడి నుండి విజయం వైపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పదో తరగతి విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఒత్తిడిని జయించడం, ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా మెరుగైన ఫలితాలు సాధించడం, పదో తరగతి తర్వాత ఉన్న ఉన్నత విద్య అవకాశాల గురించి నిపుణులతో శిక్షణ ఇచ్చారు. అవసరమైన మెటీరియల్ కూడా అందించారు.

రాష్ట్రాన్ని నాలెడ్జి హబ్‌గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి.. విద్య వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్య వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచడంతో పాటుగా.. మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం ప్రవేశపెట్టాం. పేరెంట్ టీచర్ మీటింగ్స్ ద్వారా విద్యార్ధుల సమస్యలను పరిష్కరించడం, వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడం చేశాం.

మన రాష్ట్రంలోని మానవ వనరుల్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేలా స్కిల్ డెవలప్మెంట్ కోసం సన్నాహాలు చేపట్టాం. దేశ విదేశాల్లో పర్యటించి ఏపీకి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఎక్కడెక్కడకు వెళ్లి చదువుకున్నా.. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం తిరిగి స్వస్థలాలకు వచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నాం. వచ్చే ఏడాదికి బందరు పోర్టును పూర్తి చేయడం ద్వారా మన బందరు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేయబోతున్నాం. మరిన్ని కంపెనీలను కూడా బందరులో ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా యువతకు ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నాను.

ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో పాలన సాగిస్తున్నాం. ఆ దిశగా యువతకు అవకావాలు కల్పిస్తున్నాం. విద్యార్థి దశ నుండే పారిశ్రామిక రంగంలో స్థిరపడేందుకు ఉన్న అవకాశాలను శోధించాలని మంత్రి కొల్లు రవీంద్ర విద్యార్ధులకు పిలుపునిచ్చారు.

మహిళల ప్రతిభకు వేదికగా కొల్లు ఫౌండేషన్ కొల్లు ఫౌండేషన్ & వివో ఆధ్వర్యంలో మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ముగ్గుల పోటీలు ని...
11/01/2026

మహిళల ప్రతిభకు వేదికగా కొల్లు ఫౌండేషన్

కొల్లు ఫౌండేషన్ & వివో ఆధ్వర్యంలో మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించాము.

ముఖ్య అతిథులుగా శ్రీమతి కొల్లు నీలిమ, వివో మేనేజర్ ఏ.దినేష్ పాల్గొనగా
60 మంది మహిళలు విజయం కోసం పోటీ పడ్డారు.
మ్యూజికల్ చెయర్స్, భోగి వేడుకల్లో సందడి చేశారు.
విజేతలకు బహుమతులు అందజేసి మహిళల ప్రతిభను అభినందించడం జరిగింది.

కొల్లు ఫౌండేషన్  ఆధ్వర్యంలో బుడమేరు వరదలకు మచిలీపట్నం నుండీ వెళ్ళిన మున్సిపల్ కార్మికులకు చెప్పులు పంపిణీ చేయడం జరిగింది...
22/03/2025

కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుడమేరు వరదలకు మచిలీపట్నం నుండీ వెళ్ళిన మున్సిపల్ కార్మికులకు
చెప్పులు పంపిణీ చేయడం జరిగింది.
Neelima Kollu
Kollu Ravindra
Kollu Foundation

మానవ సేవ ఏ మాధవ సేవ అన్న నినాదం తో  కొల్లు ఫౌండేషన్  నిరంతరం ప్రజలకు  సేవ చేస్తూనే వస్తోంది. దానిలో భాగంగా  రంజాన్ పర్వద...
15/03/2025

మానవ సేవ ఏ మాధవ సేవ అన్న నినాదం తో కొల్లు ఫౌండేషన్ నిరంతరం ప్రజలకు సేవ చేస్తూనే వస్తోంది. దానిలో భాగంగా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాజు పేట రామ కృష్ణా పబ్లిక్ స్కూల్ ఎదురు గా గల మసీదు లో ఉపవాస దీక్ష విరమించిన ముస్లిం సోదరులకు శీతల పానీయాలు అందించడం జరిగింది.

08/03/2025

కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కన్నుల పండుగ గా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు..
Neelima Kollu

మహిళలు దివ్యశక్తి స్వరూపిణిలని, మహిళలు లేనిదే సామాజిక అభివృద్ధి లేదని భారతీయం చైర్మన్ సత్యవాణి అన్నారు. కొల్లు ఫౌండేషన్ ...
08/03/2025

మహిళలు దివ్యశక్తి స్వరూపిణిలని, మహిళలు లేనిదే సామాజిక అభివృద్ధి లేదని భారతీయం చైర్మన్ సత్యవాణి అన్నారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసు కళ్యాణ మండపంలో శుక్రవారం రాత్రి జరిగిన సమావేశంలో సత్యవాణి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. మహిళల్లో దాగి ఉన్న సృ జనాత్మక శక్తులను వెలికితీసేందుకు కొల్లు ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ సతీమణి పృధ్వి కళ్యాణి మాట్లాడుతూ, మహిళలు స్వయం సమృద్ధిని సాధించాలన్నారు. జిల్లా ఎస్పీ సతీమణి పద్మజ మాట్లాడుతూ, మహిళా హోమ్ గార్డులను సత్కరించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విజేతలకు కొల్లు నీలిమ బహుమతులు అందించడం చాలా ఆనందాన్ని కలిగించింది.

కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కన్నుల పండుగ గా అంతర్జాతీయ  మహిళా దినోత్సవ వేడుకలు.. Neelima Kollu మహిళలు దివ్యశక్తి స్వరూపిణ...
07/03/2025

కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కన్నుల పండుగ గా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు..
Neelima Kollu
మహిళలు దివ్యశక్తి స్వరూపిణిలని, మహిళలు లేనిదే సామాజిక అభివృద్ధి లేదని భారతీయం చైర్మన్ సత్యవాణి అన్నారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసు కళ్యాణ మండపంలో శుక్రవారం రాత్రి జరిగిన సమావేశంలో సత్యవాణి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. మహిళల్లో దాగి ఉన్న సృ జనాత్మక శక్తులను వెలికితీసేందుకు కొల్లు ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నత స్థానానికి ఎదిగేందుకు ఆయన భార్య కొల్లు నీలిమ సహకారం ఎంతో ఉందన్నారు. జిల్లా కలెక్టర్ సతీమణి పృధ్వి కళ్యాణి మాట్లాడుతూ, మహిళలు స్వయం సమృద్ధిని సాధించాలన్నారు. జిల్లా ఎస్పీ సతీమణి పద్మజ మాట్లాడుతూ, మహిళా హోమ్ గార్డులను సత్కరించడం అభినందనీయమన్నారు. సబాధ్యక్షురాలు, మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ మాట్లాడుతూ, కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చేయూతనిస్తున్నామన్నారు. దివ్యాంగులను ఆదుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన వంటకాలను జిల్లా కలెక్టర్ సతీమణి పృద్వికళ్యాణి, జిల్లా ఎస్సీ సతీమణి పద్మజ, మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ రుచి చూశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళలకు పలు పోటీలు నిర్వహించారు. విజేతలకు కొల్లు నీలిమ బహుమతులు అందచేశారు.

🌸 Join Us in Celebrating Women’s Day! 🌸This March 7th, let’s come together to honor the strength, resilience, and achiev...
01/03/2025

🌸 Join Us in Celebrating Women’s Day! 🌸

This March 7th, let’s come together to honor the strength, resilience, and achievements of women everywhere! 💜✨

We invite you to a special celebration filled with inspiration, empowerment, and joy. Expect engaging conversations, uplifting stories, and a moment to appreciate the incredible women in our lives.

ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం చింతగుండు పాలెం (మంచినీళ్లు కాలవ ) నాగులేరు వద్ద పుణ్యస్నానాల...
26/02/2025

ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం చింతగుండు పాలెం (మంచినీళ్లు కాలవ ) నాగులేరు వద్ద పుణ్యస్నానాలకు విచ్చేయు భక్తుల సౌకర్యార్థం కొల్లు ఫౌండేషన్ నుంచి భక్తులకు పులిహోర కేసరి ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కొల్లు ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Kollu Ravindra
Neelima Kollu

ఈరోజు అంతర్జాతీయ భాషా దినోత్సవం మచిలీపట్నం టౌన్ నోబుల్ కళాశాలలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చే...
28/09/2024

ఈరోజు అంతర్జాతీయ భాషా దినోత్సవం మచిలీపట్నం టౌన్ నోబుల్ కళాశాలలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శ్రీమతి కొల్లు నీలిమ గారు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేయడమైనది.

ఈరోజు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్టణం కోనేరు సెంటర్ లో మరియు ఇండియన్ బ్యాంక్ వద్ద  పెన్షన్ దారులకు  కొల్లు ఫౌండేష...
02/05/2024

ఈరోజు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్టణం కోనేరు సెంటర్ లో మరియు ఇండియన్ బ్యాంక్ వద్ద పెన్షన్ దారులకు కొల్లు ఫౌండేషన్ చైర్మన్ కొల్లు నీలిమ గారు రాగి అంబలి పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కొల్లు ఫౌండేషన్ నిర్వాహకులు మెట్టు సూరిబాబు గారు, దేవర ప్రసాద్ గారు సత్యనారాయణ గారు పాల్గొన్నారు

కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నం  నియోజకవర్గంలో పలు ప్రభుత్వ పాఠశాలలో  550 పైగా మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థు...
02/05/2024

కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నం నియోజకవర్గంలో పలు ప్రభుత్వ పాఠశాలలో 550 పైగా మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థులకు అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో విద్యాపరంగా అండగా ఉంటానని హామీ ఇచ్చిన కొల్లు రవీంద్ర గారి తనయుడు కొల్లు పునీత్ చంద్ర గారు

Address

Machilipatnam
521001

Telephone

+916352264192

Website

Alerts

Be the first to know and let us send you an email when Kollu Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kollu Foundation:

Share

Category