Kurnool journalist mohan

Kurnool journalist mohan సదా మీ సేవలో....

35-40  దాటిన మహిళల్ని  టార్గెట్ చేస్తారు... బాగా పొగుడుతారు... చాలా కేరింగ్ చూపిస్తారు..  ప్రేమ ఓలకబోస్తారు.... అసలు లైఫ...
25/04/2026

35-40 దాటిన మహిళల్ని టార్గెట్ చేస్తారు... బాగా పొగుడుతారు... చాలా కేరింగ్ చూపిస్తారు.. ప్రేమ ఓలకబోస్తారు.... అసలు లైఫ్ లో ఏనాడు నా భర్త నన్ను ఇంత బాగా చూసుకోలేదు అనే ఫీల్ కలుగుతుంది...!

నువ్వే నా ప్రపంచం అంటారు... నువ్వు లేనిదే నేను బ్రతకలేను అంటారు...!

ఆ ప్రేమ మైకం లో ఈ పిచ్చి తల్లులు అన్ని చెప్పేస్తారు ఇంట్లో విషయాలు... ఆస్తులు, డబ్బులు... భర్తతో గొడవలు... ఏది దాచరు..


Next స్టేజి... వీడియో కాల్స్.... సెమీ న్యూడ్... Full న్యూడ్... లేట్ night అంతా ఇదే గోల...!

కట్ చేస్తే....

Next రెండు జరుగుతాయి...

ఒకటి... వాళ్ళు ఊళ్ళు దాటి వెళ్లి ఏదైనా ఓయో రూమ్ లో కలుస్తారు... తరవాత ఇల్లు వదిలి వచ్చేసా అంటూ ఇంటి నుండి తెచ్చిన డబ్బు నగలు సమర్పిస్తారు....

వాడు మంచోడు అయితే అవి తీసుకుని పోతాడు... లేదంటే ఈమెని ఏ brothel హౌస్ కె అమ్మేస్తాడు... ఇక లైఫ్ లో ఆమె బైట ప్రపంచం చూడలేదు...!

రెండోది...

ఆ వీడియో కాల్స్, చాట్స్ అన్ని చూపించి నాకు సహకరించలేదు అంటే వీటిని internet లో వైరల్ చేస్తా అని బెదిరిస్తారు...!

సమాజం లో పరువు, పిల్లల ముందు, భర్త తల్లితండ్రుల ముందు ఎలా తల ఎత్తుకుని తిరిగేది అని వారి డిమాండ్స్ తీరుస్తారు. ఫిసికల్ లేదా బంగారం... లేదా డబ్బు....!

ఇక తన నుండి ఏమి రాబట్ట లేము అని తెలిసాక వదిలేస్తారు....!

ఇవన్నీ అసలు చేస్తారు అనే ఆలోచన కూడ రానంత గుడ్డిగా నమ్మేస్తారు పాపం అమాయకులు 😔

కొన్ని కొన్ని పాఠాల మూల్యం కొన్ని జీవితాలు అనే విషయం చాలా లేట్ గా తెలుసుకుంటారు....!

తన కోసం తన కుటుంబం కోసమే భర్త పగలు రాత్రి కష్టపడుతున్నాడు అనే విషయం తెలుసుకుని ప్రతి స్త్రీ తన భర్తకు చేదోడు వాదోడు గా ఉంటే ప్రతి ఇల్లు ఓ భూలోక స్వర్గం అవుతుంది అనడం లో రెండో మాట లేదు...!. ఒకవేళ భర్త దగ్గర మీరనుకున్న సుఖం దొరక్కపొతే చట్టపరమైన విడాకులు తీసుకుని మీకిష్టమైన జీవితం జీవించండి, కాని మోసగాళ్ళ ఉచ్చు(మాయలో)పడొద్దు

Share this post
Pls follow : ప్రేమ గుడ్డిది ( Love Is.

08/04/2026

The 15-year-old boy hits the first ball six to Bumrah.. wow

08/04/2026
హెడ్ కానిస్టేబుల్ రేవతి … సాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది తోటి పోలీసులకు ఉరి శిక్ష పడటానికి కారణమైన కీలక స...
07/04/2026

హెడ్ కానిస్టేబుల్ రేవతి … సాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది తోటి పోలీసులకు ఉరి శిక్ష పడటానికి కారణమైన కీలక సాక్షి ❤️

ఒక సందర్భంలో మనసాక్షి ఎలా వ్యవస్థ కంటే పెద్దదవుతుందో చూపించిన ఒక అద్భుతమైన ఉదాహరణ. తమిళనాడులో జరిగిన ఆ లాకప్ మరణాలు దేశాన్ని కుదిపేసిన ఘటన. కానీ ఆ దారుణం బయటకు రావడానికి కారణం రేవతి .

సంఘటన జరిగిన తర్వాత స్టేషన్‌లో పరిస్థితి ఎలా ఉందంటే — జరిగినది బయటికి రాకూడదనే ఒక ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. సాక్ష్యాలను తుడిచేయాలి, కథను మార్చాలి… ఇవే ప్రధాన లక్ష్యాలుగా మారిపోయాయి.

ఇలాంటి సమయంలో చాలా మంది పోలీసులు సైలెంట్‌గా ఉండటాన్నే సేఫ్‌గా భావిస్తారు. కానీ రేవతి ఆ ఆప్షన్ తీసుకోలేదు ఆమెకి అది కేవలం డ్యూటీ విషయం కాదు… తన కళ్లముందు జరిగిన దారుణానికి స్పందించాల్సిన బాధ్యత.

తోటి సిబ్బంది ఒకవైపు… పై అధికారుల ఒత్తిడి మరోవైపు… ఇలాంటి పరిస్థితిలో నిలబడటం అనేది చిన్న విషయం కాదు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. మేజిస్ట్రేట్ ముందు చెప్పిన ప్రతి విషయం కేసు దిశనే మార్చింది. అది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు… ఆ రాత్రి జరిగిన వాస్తవానికి మొదటి స్పష్టమైన రూపం.

పోలీసులు స్టేషన్‌ను శుభ్రం చేసి సాక్ష్యాలను తుడిచివేసినా, ఆమె అత్యంత చాకచక్యంగా గోడల మూలల్లో, టేబుళ్ల కింద మిగిలిపోయిన రక్తపు మరకలను గుర్తించి మేజిస్ట్రేట్‌కు చూపించారు.

ఈ రక్తపు చుక్కలే నిందితుల నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించడంలో ప్రధాన భూమిక పోషించాయి.

సీసీటీవీ ఫుటేజీని మాయం చేసినా, ఆమె తన జ్ఞాపకశక్తితో సంఘటనలు జరిగిన సమయాలను పూసగుచ్చినట్లు వివరించి దర్యాప్తుకు దిక్సూచిలా నిలిచారు.

ఇది సాధారణ విషయం కాదు. అదే వ్యవస్థలో ఉండి, అదే వ్యవస్థకు వ్యతిరేకంగా నిజం చెప్పడం అంటే చాలా పెద్ద నిర్ణయం. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు.

ఆమె చెప్పిన విషయాల ఆధారంగా కేసు బలపడింది. కోర్టు కూడా ఆమె భద్రతపై దృష్టి పెట్టి ప్రత్యేక రక్షణ కల్పించింది. అది ఆమె చెప్పిన నిజానికి వచ్చిన గుర్తింపు.

రేవతి చేసిన పని గొప్పగా చూపించాల్సిన అవసరం లేదు. ఆమె చేసింది చాలా సింపుల్ — జరిగినదాన్ని దాచలేదు.
కానీ అదే సమయంలో చాలా మంది చేయలేని పని అదే.

సాత్తాన్‌కుళం కేసులో న్యాయం జరగడానికి కారణాలు చాలా ఉండొచ్చు…

కానీ నిజం బయటికి రావడానికి కారణమైన పేరు ఒక్కటే — రేవతి.

హ్యాట్సాఫ్ హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు ❤️❤️🙏👌

Writen క్రిష్ ❤️✍️
Native India

Address

Kurnool

Website

Alerts

Be the first to know and let us send you an email when Kurnool journalist mohan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share