30/05/2026
CM అష్యూరెన్స్‌లో ఉన్న కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కోసం కొవ్వూరు శివారులో అనువైన 5 ఎకరాల భూమిని పరిశీలించిన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు గారు.
విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవన నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన స్థలాన్ని APWIDC AE నవ్య అక్షవ్ మరియు అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే గారు పరిశీలించారు. కళాశాల భవన నిర్మాణం పూర్తయితే కొవ్వూరు నియోజకవర్గ యువతకు నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులోకి రావడంతో పాటు విద్యా రంగ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సీఎం అష్యూరెన్స్‌లో ఉన్న ఈ కళాశాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గారు తెలిపారు...
ఈ కార్యక్రమంలో టూమెన్ కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ గారు, మద్దిపట్ల శివరామ కృష్ణ గారు, సూరపని చిన్ని గారు, కొవ్వూరు MRO గారు, కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ సునీత గారు మరియు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు
#కంఠమణిరామకృష్ణరావు