AVASYA Charitable Trust

AVASYA Charitable Trust To create awareness about society activities in youth , Rehabilitation for street children , Medical

To create awareness about society activities in youth ,
Rehabilitation for street children ,
Medical camps and moral support for ill health peoples, Voluntary support at emergency situation , Forming Youth Associations for Social Awarenes, Motivations for Youth Involvement for society, Freedom activities,
Awareness’ for youth about old age people and children , Freedom activities....

22/05/2021
బ్లడ్ ప్లాస్మా ...రక్తపు రసి (Blood plasma - బ్లడ్ ప్లాస్మా, రక్తరసము, నెత్తురు సొన, రక్తజీవద్రవ్యం) అనేది తేటైన ఎండుగడ్...
24/10/2020

బ్లడ్ ప్లాస్మా ...

రక్తపు రసి (Blood plasma - బ్లడ్ ప్లాస్మా, రక్తరసము, నెత్తురు సొన, రక్తజీవద్రవ్యం) అనేది తేటైన ఎండుగడ్డి రంగు గల రక్తం యొక్క ద్రవ భాగం, ఇది రక్తం నుండి ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లేట్స్, ఇతర సెల్యూలర్ భాగాలు తొలగించబడిన తరువాత మిగిలిన భాగం. ఇది మానవ రక్తం యొక్క ఒక పెద్ద భాగం, రక్తంలో దాదాపు 55 శాతం దాకా వుంటుంది, నీరు, లవణాలు, ఎంజైములు, రోగనిరోధక కణాలు, ఇతర ప్రోటీన్లను కలిగి వుంటుంది. ప్లాస్మా 92% నీటితో కూడి ఉంటుంది, ఇది మానవ శరీరానికి అవసరమైన కణాలు, వివిధ కీలక పదార్థాలను సరఫరా చేసే ఒక మాధ్యమం. ప్లాస్మా శరీరంలో రక్తాన్ని గడ్డకట్టించడం సహా వ్యాధులను ఎదుర్కోవడం, వివిధ ఇతర క్లిష్టమైన విధులను చేపడుతోంది.

దానం చేయబడిన ఘనీభవించిన ప్లాస్మా యొక్క ఒక యూనిట్
రోగ నిరోధక వ్యవస్థ అన్నది అందరిలోనూ ఒకలా పని చెయ్యదు. కొందరిలో బలహీనంగా పనిచేస్తే, మరి కొందరిలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆ విధంగా “రోగ నిరోధక వ్యవస్థ” సమర్థవంతంగా పనిచేసే వ్యక్తులు ఏదైనా ప్రమాదకరమైన వైరస్, బాక్టీరియా బారిన పడినప్పటికీ వారి రక్తంలో “ప్లాస్మా” లో ఉండే “యాంటీ-బాడీస్ (Antibodies)” ఆ వైరస్ లేదా బాక్టీరియా “సూక్ష్మజీవుల (microorganisms)” తో పొరాడి వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంటాయి.

రక్తదానం వలన ఎలాంటి ప్రమాదం ఉండదో అలాగే ప్లాస్మా దానం వలన కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. పైగా రక్తం నుండి సేకరించబడిన ప్లాస్మా తిరిగి 24 నుండి 48 గంటల్లో రక్తంలో సదరు ప్లాస్మా దాత శరీరంలో యదావిధిగా తయారైపోతుంది. 600 ML రక్తం నుండి 360ML ప్లాస్మా ను సేకరించవచ్చు. అంతేకాదు ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి ప్లాస్మాను 28 రోజులకోసారి సంవత్సరంలో 13 సార్లు దానం ఇవ్వొచ్చు[1]. ప్లాస్మా ఇచ్చేవారి హిమోగ్లోబిన్ లెవెల్స్ 12.5 జి/డిఎల్ కంటే ఎక్కువగా ఉండాలి బరువు కనీసం 55 కేజీలుండాలి.డొనేషన్ టైమ్‌లో బి.పి కనీసం 100/60 నుంచి 150/90 మధ్య ఉండాలి. వారికి గత ఆరు నెలల్లో ఎలాంటి ఆప రేషన్లు జరిగి ఉండకూడదు. శ్వాస సంబంధ వ్యాధులు, గుండె, కిడ్నీ జబ్బులు ఉండకూడదు. అలాగే డోనర్, పేషెంట్ బ్లడ్ గ్రూప్ కూడా కలవాల్సి ఉంటుంది.

అవశ్య ఛారిటబుల్‌ ట్రస్ట్
నెల్లూరు జిల్లా
కావలి
ఆంధ్ర ప్రదేశ్‌.

వాలెంటీర్...ఓ..వారియర్బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని పది సచివాలయాలలో నుండీ బెస్ట్ వాలెంటీర్లగా కరోనా వారియర్స్ ...
25/09/2020

వాలెంటీర్...ఓ..వారియర్

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని పది సచివాలయాలలో నుండీ బెస్ట్ వాలెంటీర్లగా కరోనా వారియర్స్ గా వారి సేవకు మెచ్చి వారి త్యాగానికి గుర్తుగా ఆవశ్య చారిటబుల్ ట్రస్ట్ వారు నగరపంచాయితీ అద్వర్యంలో బెస్ట్ వారియర్ మెమెంటో తో పాటు శాలవాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమీషనర్ శ్రీ.వై.శ్రీనివాసురావు గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ వాలెంటీర్ ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా దేశానికే ఓ ఆదర్శమని సాక్షాత్తు దేశ ప్రధాని సైతం కొనియాడారు అని తెలియజేసారు. వారు రాష్ట్ర ప్రగతికి సోపానాలు అని ప్రశంసించారు.కమిషనర్ అయినా కలక్టర్ అయినా క్రింది స్థాయి ఉద్యోగుల పని విదానం పై వారి ఖ్యాతి ఆదారపడి వుంటుందని వారిని అభినందించారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతీ సంక్షేమ పథకాలు ప్రతీ గడపకు అమలు చేయడంలో వారి కృషి ఎనలేనిదని వారు ఓ సైనికులులా శ్రమించారని తెలియజేసారు.గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్దం చేకూర్చారు అని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరంతర కృషి పట్టుదలతో కరోనా ను అరికట్టేందుకు శ్రమించారని బాధిత కుటుంబాలకు సామాజిక సహాయ సహకారములు అందించారని తెలియజేసారు. వాలంటీర్లు శ్రమని గుర్తించి వారిని సత్కారించాలనే ఆలోచన తెలియజేసిన ఆవశ్య చారిటబుల్ ట్రస్టు వారికి ప్రత్యేక దన్యవాదలు తెలియజేసారు .అవశ్య చారిటబుల్ ట్రస్ట్ అద్యక్షులు శ్రీ చేవూరి జగజ్జీవన్ రామ్ గారు మాట్లడుతూ వాలెంటిర్ వ్యవస్థ సమాజానికి ఆదర్శమని కొనియాడారు.వారిని సత్కరించటం మాకు సంతోషం కలిగించదని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో వాలెంటీర్ వ్యవస్థ ప్రజలకు సౌకర్యవంతమైన పరిపాలనా సౌలబ్యత కలిగించడంలో వారి ప్రస్థానం అమోగమైనదని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో తమ వంతు ప్రోత్సాహాన్ని అందించిన పి.రమేష్ రెడ్డిగారు ,జే.సతిష్ గారికి మరియు నగర పంచాయతీ సచివాలయ సిబ్బంది , వాలెంటిర్ లు మరియు అవశ్య చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అద్యక్షులు చేవూరి జగజ్జీవన్ రామ్,రాష్ట్ర సెక్రెటరి జి.కే.చక్రవర్తి,పోగ్రామ్ కో ఆర్డినేటర్ చడమాల రాజేష్ గారు మరియు సబ్యులు నవీన్,టి.శ్రీహరి,జి.కేజియా తదితరులు పాల్గొని విజయవంతం కావించారు.

Please save trees
10/09/2020

Please save trees

ఈరోజు మన ట్రస్ట్ ఆధ్వర్యంలో  పేదలకు భోజనం పంపినీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతీ సభ్యులకు ధన్యవాదములు.05/...
05/04/2020

ఈరోజు మన ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు భోజనం పంపినీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతీ సభ్యులకు ధన్యవాదములు.05/04/2020
Kavali.
SPSR NELLORE
ANDHRA PRADESH.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపాలిటీ ఔట్ సోర్సింగ్ కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వాలని AITUC ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన ...
06/02/2019

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపాలిటీ ఔట్ సోర్సింగ్ కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వాలని AITUC ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన ధర్నా లో‌ కార్మికులకు మద్దతుగా పాల్గొనడం జరిగింది.

11/04/2017
Success
11/12/2016

Success

Address

Kavali City
Kavali
524201

Telephone

9490777174

Website

Alerts

Be the first to know and let us send you an email when AVASYA Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to AVASYA Charitable Trust:

Share