𝐍𝐀𝐑𝐄𝐒𝐇 𝐊𝐔𝐌𝐀𝐑 𝐑𝐄𝐃𝐃𝐘

𝐍𝐀𝐑𝐄𝐒𝐇 𝐊𝐔𝐌𝐀𝐑 𝐑𝐄𝐃𝐃𝐘 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from 𝐍𝐀𝐑𝐄𝐒𝐇 𝐊𝐔𝐌𝐀𝐑 𝐑𝐄𝐃𝐃𝐘, Kanchipuram.

 # కాంచీపురం #🅺︎🅰︎🅽︎🅲︎🅷︎🅸︎🅿︎🆄︎🆁︎🅰︎🅼︎ మనమందరం కంచికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఇక్కడ శివకంచి,విష్ణుకంచి అని రెండు ప్రదేశాలుం...
09/08/2025

# కాంచీపురం
#🅺︎🅰︎🅽︎🅲︎🅷︎🅸︎🅿︎🆄︎🆁︎🅰︎🅼︎
మనమందరం కంచికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఇక్కడ శివకంచి,విష్ణుకంచి అని రెండు ప్రదేశాలుంటాయి. వీటిలో ఏకాంబరేశ్వరాలయము, వరదరాజస్వామి ఆలయం, శక్తిపీఠమైనటువంటి కామాక్షి ఆలయం తో పాటు కంచి శంకరమఠం మనం చూస్తాము.

అయితే వీటితోపాటు చూడవలసిన మరో ముఖ్యమైన దేవాలయం ఉన్నది. అదే #పాండవ_దూత_పెరుమాళ్_ఆలయము ఇక్కడ శ్రీకృష్ణుడు 27 అడుగుల ఎత్తు ఉంటారు. ఇది తప్పనిసరిగా మనందరం చూడవలసిన ఆలయం.

#పాండవ_దూత_కథ

1.మహాభారతంలో పాండవులు మరియు కౌరవుల మధ్య యుద్ధం తప్పించేందుకు, శ్రీకృష్ణుడు పాండవుల దూతగా హస్తినాపురానికి వెళ్ళాడు.

2.కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు, కృష్ణుణ్ని పట్టుకొని చంపే పన్నాగం పన్నాడు.

3.ఆ కోసం, ఒక లోతైన గొయ్యి త్రవ్వించి, దానిపై ఒక కార్పెట్, రత్నాలతో అలంకరించిన కుర్చీ ఉంచాడు.

4.ఆ గొయ్యిలో బలమైన మల్లయోధులను దాచిపెట్టాడు, కృష్ణుడు కూర్చున్న వెంటనే వారిని దాడి చేయమని పథకం వేసాడు.
కృష్ణుని విశ్వరూపం
కానీ, విష్ణువు అవతారమైన కృష్ణుడు, ఈ పన్నాగాన్ని తెలిసి, తన విశ్వరూపం (సర్వాంతర్యామి రూపం) ప్రదర్శించాడు.

4.ఈ రూపాన్ని కౌరవుల సభలో ఉన్న ప్రతివారికి, అలాగే అంధుడైన రాజు ధృతరాష్ట్రుడుకి కూడా చూపించాడు.

5.ధృతరాష్ట్రుడు, ఆ విశ్వరూపాన్ని చూసిన వెంటనే, కృష్ణుడు ఇచ్చిన వరంలో, “తనను మళ్లీ అంధుడిని చేయమని” కోరాడు — ఎందుకంటే ఆ విశ్వరూపం చూసిన తర్వాత ఇంకేమీ చూడాలని ఆయనకు అనిపించలేదు.

6.జనమేజయ దర్శనం
తరువాత, పాండవుల ప్రపౌత్రుడు జనమేజయుడు, కృష్ణుని విశ్వరూపాన్ని దర్శించాలనే తపస్సు చేశాడు.

కృష్ణుడు అతనికి కూడా అదే విశ్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు.

17/03/2025
ప్రతి హిందువు సంకల్పించండి తరలిపోదాం - భాద్యత తీసుకుందాంహిందూ సమాజం సంఘటితం అవుదాం హిందూ సమాజం లో మనం అందరం సంఘటితం అవుద...
03/11/2024

ప్రతి హిందువు సంకల్పించండి
తరలిపోదాం - భాద్యత తీసుకుందాం
హిందూ సమాజం సంఘటితం అవుదాం

హిందూ సమాజం లో మనం అందరం సంఘటితం అవుదాం

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో
"హైందవ సంఖారావం" భారీ బహిరంగ సభ
ది. 05.01.2024
విజయవాడ

9240015333 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇద్దాం, వచ్చిన లింక్ ద్వారా పేరు, ఊరు తెలియచేద్దాం.

🙏🙏

 #హైందవ_శంఖారావ_సభ  #విశ్వ_హిందూ_పరిషత్ #విజయవాడ
03/11/2024

#హైందవ_శంఖారావ_సభ
#విశ్వ_హిందూ_పరిషత్
#విజయవాడ

శ్రీ రామ జన్మభూమి మందిర్ విశేషాలు 1. మందిరం సాంప్రదాయ నగర శిల్పి శైలిలో నిర్మితమైంది. 2. మందిరం పొడవు (తూర్పు-పడమర) 380 ...
05/01/2024

శ్రీ రామ జన్మభూమి మందిర్ విశేషాలు

1. మందిరం సాంప్రదాయ నగర శిల్పి శైలిలో నిర్మితమైంది.

2. మందిరం పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు.

3. మందిరం మూడంతస్తుల్లో ఉండగా ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి.

4. ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాల రూప విగ్రహం (శ్రీరామ్ లల్లా విగ్రహం) మరియు మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బార్ ఉంటుంది.

5. మందిరంలో ఐదు మండపాలు (హాల్) - నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలు ఉన్నాయి.

6. మందిరంలోని స్తంభాలు, గోడలను దేవతల విగ్రహాలతో అలంకరించారు.

7. మందిరానికి తూర్పు వైపు సింహ ద్వారం గుండా 32 మెట్లతో గుడి లోపలకు వెళ్లాలి.

8. మందిరంలో వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంప్‌లు లిఫ్టుల ఏర్పాటు ఉంది.

9. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ (దీర్ఘచతురస్రాకారంలో) నిర్మాణం చేయబడింది.

10. మందిరంలోని నాలుగు మూలల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలున్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం, దక్షిణాన హనుమంతుని గుడి ఉన్నాయి.

11. మందిర్ సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి (సీతా కూప్) ఉంది.

12. శ్రీ రామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్‌లో, వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, శబరీ మాత, దేవి అహల్య మందిరాలున్నాయి.

13. కాంప్లెక్స్ యొక్క నైరుతి భాగంలో, కుబేర్ తిలా వద్ద, శివుని పురాతన మందిరం, జటాయువు విగ్రహంతోపాటుగా పునరుద్ధరించబడింది.

14. మందిరంలో ఎక్కడా ఇనుము వాడలేదు.

15. మందిర్ పునాది 14-మీటర్ల మందపాటి రోలర్-కాంపాక్ట్ కాంక్రీట్ (RCC)తో నిర్మించబడింది, ఇది కృత్రిమ శిలా రూపాన్ని ఇస్తుంది.

16. నేల తేమ నుండి రక్షణ కోసం, గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాది నిర్మించబడింది.

17. మందిర్ కాంప్లెక్స్‌లో మురుగునీటి శుద్ధి, నీటి శుద్ధి, అగ్ని ప్రమాదాల నివారణ కోసం నీటి సరఫరా, ప్రత్యేకమైన విద్యుత్ కేంద్రం ఉన్నాయి.

18. 25,000 మంది వ్యక్తుల సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం (PFC) నిర్మాణంలో ఉంది. దీని ద్వారా యాత్రికులకు వైద్య సదుపాయాలు & లాకర్ సౌకర్యాన్ని కల్పించనున్నారు.

19. కాంప్లెక్స్‌లో స్నానపు గదులు, వాష్‌రూమ్‌లు, వాష్‌బేసిన్, ఓపెన్ ట్యాప్‌లు మొదలైన వాటితో ప్రత్యేక బ్లాక్ కూడా ఉంటుంది.

20. మందిర్ పూర్తిగా భారత్ దేశ సాంప్రదాయ పద్ధతిలో, స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడుతోంది. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చదనం ఉండేలా.. పర్యావరణ-నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రామమందిర నిర్మాణం జరుగుతోంది.

జై శ్రీరామ్

Address

Kanchipuram

Alerts

Be the first to know and let us send you an email when 𝐍𝐀𝐑𝐄𝐒𝐇 𝐊𝐔𝐌𝐀𝐑 𝐑𝐄𝐃𝐃𝐘 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share