Pithapur Rajah's Government College

Pithapur Rajah's Government College Estd. 1884 | NAAC Accredited
Pioneering Higher Education in AP.

Celebrating a historic moment! 🇮🇳✨P R Govt College (A), Kakinada marked the legal declaration of Amaravati as the capita...
02/04/2026

Celebrating a historic moment! 🇮🇳✨
P R Govt College (A), Kakinada marked the legal declaration of Amaravati as the capital of Andhra Pradesh with great enthusiasm and awareness.

A memorable occasion for Dr. Hariram Prasad at Government Degree College, Ramachandrapuram.He delivered an invited talk ...
23/03/2026

A memorable occasion for Dr. Hariram Prasad at Government Degree College, Ramachandrapuram.
He delivered an invited talk and was felicitated by his Guru and mentor, Padma Bhushan Prof. Yarlagadda Lakshmi Prasad.
A truly proud and inspiring moment.
Congratulations to Bujji Madam & Vennela Madam on being felicitated at the International Seminar held in Ramachandrapuram today.

Proud moment for our institution!Dr. K. Rajamanikyam, Lecturer in English, received the “Gurubrahma” Award from St. Moth...
22/03/2026

Proud moment for our institution!
Dr. K. Rajamanikyam, Lecturer in English, received the “Gurubrahma” Award from St. Mother Theresa Social Welfare Organization on 22-03-2026 at Press Club, Daba Gardens, Visakhapatnam.
Congratulations, sir!

కవయిత్రి మొల్ల మాంబ జయంతి ఘనంగా నిర్వహింపుపిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాలలో ఆతుకూరి మొల్ల మాంబ జయంతి ఘనంగా నిర్వహించారు. మ...
22/03/2026

కవయిత్రి మొల్ల మాంబ జయంతి ఘనంగా నిర్వహింపు

పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాలలో ఆతుకూరి మొల్ల మాంబ జయంతి ఘనంగా నిర్వహించారు. మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సంజీవ్ కుమార్, డాక్టర్ పి.ఎస్. ప్రకాశరావు, శ్రీమతి దొండపాటి నాగజ్యోతి శేఖర్, డాక్టర్ హరి రాంప్రసాద్ పాల్గొని మొల్ల సాహిత్య విశిష్టతను వివరించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

09-03-2026 న మా కళాశాలలో ICC, NSS, ICDS Project Childline 1098 ఆధ్వర్యంలో బాల్యవివాహాలు & POCSO చట్టంపై అవగాహన కార్యక్రమ...
22/03/2026

09-03-2026 న మా కళాశాలలో ICC, NSS, ICDS Project Childline 1098 ఆధ్వర్యంలో బాల్యవివాహాలు & POCSO చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. మా వైస్ ప్రిన్సిపల్ వి. సంజీవరావు గారి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమం అనంతరం ర్యాలీ కూడా నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

పి.ఆర్. ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలికి జాతీయ స్థాయి స్త్రీ శక్తి అవార్డు 🌸పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల (అటోనమస్), కాకిన...
08/03/2026

పి.ఆర్. ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలికి జాతీయ స్థాయి స్త్రీ శక్తి అవార్డు 🌸
పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల (అటోనమస్), కాకినాడకు చెందిన ఆంగ్ల అధ్యాపకురాలు డా. కె. రాజమాణిక్యం గారు జాతీయ స్థాయి “స్త్రీ శక్తి అవార్డు” అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మానవ హక్కుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలోని జగ్గయ్యపేటలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. కందుల అంజనేయులు గారు అభినందనలు తెలియజేస్తూ, తమ కళాశాలకు చెందిన అధ్యాపకురాలు జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వి. సంజీవ్ కుమార్, అధ్యాపకులు మరియు మహిళా సిబ్బంది పాల్గొని అభినందనలు తెలిపారు. 🌸

పి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 🌸పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల (అటోనమస్), కాకినాడలో ఈర...
08/03/2026

పి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 🌸
పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల (అటోనమస్), కాకినాడలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ICC) మరియు ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ (WEC) సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
కళాశాల ప్రిన్సిపాల్ డా. కందుల అంజనేయులు అధ్యక్షత వహించి మహిళలు కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
ముఖ్య అతిథి డా. బి. సత్య సుశీల (రిటైర్డ్ DMHO) మహిళలు ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
అడ్వకేట్ శ్రీమతి నాగజ్యోతి మహిళల హక్కులు, భద్రత మరియు POCSO చట్టం గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, మహిళా సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Happy International Women’s Day! 💐

🔬 Grand Celebration of National Science DayAll Science Departments celebrated National Science Day with great enthusiasm...
01/03/2026

🔬 Grand Celebration of National Science Day

All Science Departments celebrated National Science Day with great enthusiasm.
The presentation ceremony was presided over by Vice Principal Sri V. Sanjeev Kumar and convened by Sri B. Chakravarthi.

🏆 యూనివర్సిటీ ఖో ఖో టీం ఎంపికపిఠాపూర్ రాజస్ గవర్నమెంట్ కాలేజీ (ఆటోనమస్), కాకినాడ లో నిర్వహించిన ఆధికవి నన్నయ్య యూనివర్సి...
01/03/2026

🏆 యూనివర్సిటీ ఖో ఖో టీం ఎంపిక

పిఠాపూర్ రాజస్ గవర్నమెంట్ కాలేజీ (ఆటోనమస్), కాకినాడ లో నిర్వహించిన ఆధికవి నన్నయ్య యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ ఖో ఖో పోటీలలో విజేతలు, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు యూనివర్సిటీ టీం గా ఎంపికయ్యారు.

ఎంపికైన క్రీడాకారులు 26-03-2026 నుంచి కర్ణాటకలో జరిగే South India Inter-University పోటీలలో పాల్గొంటారు.

ప్రిన్సిపాల్ డా. కందుల ఆంజనేయులు గారు విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.

— Department of Physical Education

🏃‍♂️🏆 పి.ఆర్. గవర్నమెంట్ కళాశాలలో యూనివర్సిటీ ఖో ఖో పోటీలు ప్రారంభం 🏆🏃‍♂️పిఠాపూర్ రాజాస్ గవర్నమెంట్ కళాశాల, కాకినాడలో ఆధ...
27/02/2026

🏃‍♂️🏆 పి.ఆర్. గవర్నమెంట్ కళాశాలలో యూనివర్సిటీ ఖో ఖో పోటీలు ప్రారంభం 🏆🏃‍♂️

పిఠాపూర్ రాజాస్ గవర్నమెంట్ కళాశాల, కాకినాడలో ఆధికవి నన్నయ్య యూనివర్సిటీ ఇంటర్ కాలేజీయేట్ ఖో ఖో (మెన్) పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ డా. కందుల ఆంజనేయులు గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.

యూనివర్సిటీ పరిధిలోని 12 కళాశాలల నుండి సుమారు 150 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ వి. సంజీవ్ కుమార్, అధ్యాపకులు డా. చక్రవర్తి, డా. ఎం. వెంకటేశ్వరరావు, డా. జయదేవ్, డా. పాండురంగారావు పాల్గొన్నారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో డా. వర్మ, డా. రమణ, దుర్గారావు పోటీలను నిర్వహించారు.

🌍📚 “భారతీయ జ్ఞాన వ్యవస్థల విభిన్న కోణాలు” అంతర్జాతీయ సదస్సు – పి.ఆర్. ప్రభుత్వ కళాశాల 📚🌍కాకినాడలోని పి.ఆర్. ప్రభుత్వ కళా...
27/02/2026

🌍📚 “భారతీయ జ్ఞాన వ్యవస్థల విభిన్న కోణాలు” అంతర్జాతీయ సదస్సు – పి.ఆర్. ప్రభుత్వ కళాశాల 📚🌍

కాకినాడలోని పి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో ఫిబ్రవరి 26, 2026న “భారతీయ జ్ఞాన వ్యవస్థల విభిన్న కోణాలు” అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది.

కళాశాల ప్రిన్సిపాల్ డా. కందుల ఆంజనేయులు గారు భారతీయ జ్ఞాన వ్యవస్థలు విజ్ఞానాన్ని నైతిక విలువలతో అనుసంధానం చేస్తాయని, యోగా, ధ్యానం వంటి భారతీయ సంప్రదాయాలు ఆధునిక సమస్యలకు మార్గదర్శకాలని తెలిపారు.

సదస్సు కన్వీనర్ డా. హరిరామ్ ప్రసాద్ గారు నూతన విద్యా విధానం–2020 ద్వారా స్వదేశీ జ్ఞానం, ప్రాంతీయ భాషల ప్రాముఖ్యత పెరిగిందని పేర్కొన్నారు.

ప్రొఫెసర్ సర్రాజు గారు భారతీయ మేధో వారసత్వం, నలందా–తక్షశిల వంటి విశ్వవిద్యాలయాల గొప్పతనాన్ని వివరించారు.

భారతీయ జ్ఞాన వ్యవస్థలు పర్యావరణ సంరక్షణ, మానసిక ఆరోగ్యం, సామాజిక సమరసత వంటి ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు అందించగలవని వక్తలు పేర్కొన్నారు.

Address

Kakinada

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Pithapur Rajah's Government College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share