Kummaravandlapalli Grama Panchayat

Kummaravandlapalli Grama Panchayat This is the official Page of Kummaravandlapalli GP of Kadiri Mandal

ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి 2 గ్రామ సచివాలయం పరిధ...
19/10/2023

ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి 2 గ్రామ సచివాలయం పరిధిలో “జగనన్న ఆరోగ్య సురక్ష” వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల నుండి వచ్చిన ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు మరియు ఇద్దరు వైద్యాధికారులు శిబిరానికి వచ్చిన 200 మందికి వైద్య సేవలు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంజనప్ప గారు మాట్లాడుతూ గత 20 రోజులుగా గ్రామంలో ANMలు మరియు MLHPలు ఇంటింటికీ తిరిగి పలు రకాల పరీక్షలు నిర్వహించి ఈ రోజు జరిగిన శిబిరానికి హాజరు కమ్మని తెలియజేశారన్నారు, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవలసిన అవసరం ఉందన్నారు.
అంతకుమునుపు వారు వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యులతో, ప్రజలతో ముచ్చటించారు, శిబిరం ఆవరణలో పోషకాహార వినియోగంపై అంగన్‌వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించారు మరియు కుమ్మరవాండ్లపల్లి 2 సచివాలయం పరిధిలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు శ్రీమతి డా. డి. ప్రమీల, MD, డా. విద్యాసాగర్, MD, డా. బాబా ఫక్రుద్దీన్, MBBS గార్లు పాల్గొని ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో కుమ్మరవాండ్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి మూడే శాంతమ్మ బాయి గారు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీమతి బత్తల రామలక్ష్మమ్మ గారు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు శ్రీ సందేపల్లి పుల్లయ్య గారు, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు శ్రీ షైక్ అల్లబకాష్ గారు, స్థానిక నాయకులు శ్రీ మూడే మణికంఠ నాయక్ గారు హాజరయ్యారు.
ఈ కార్యక్రమం కుమ్మరవాండ్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీమతి వై. పద్మజ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, పంచాయతీ కార్యదర్శి శ్రీ పి. మోహన్ రెడ్డి గారి సమక్షంలో హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ సహాయకులు, కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్లు, ANMలు, ఆరోగ్య సహాయకులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి 1 గ్రామ సచివాలయం పరిధ...
17/10/2023

ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి 1 గ్రామ సచివాలయం పరిధిలో “జగనన్న ఆరోగ్య సురక్ష” వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల నుండి వచ్చిన ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు మరియు ఇద్దరు వైద్యాధికారులు శిబిరానికి వచ్చిన 300 మందికి వైద్య సేవలు అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కదిరి మండల ప్రత్యేక అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు గారు మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం చాలా మంచిదని, మన గ్రామానికే నిష్ణాతులైన వైద్యులు వచ్చి సేవలు అందించడం చీరస్మరణీయమని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంజనప్ప గారు మాట్లాడుతూ గత 20 రోజులుగా గ్రామంలో ANMలు మరియు MLHPలు ఇంటింటికీ తిరిగి పలు రకాల పరీక్షలు నిర్వహించి ఈ రోజు జరిగిన శిబిరానికి హాజరు కమ్మని తెలియజేశారన్నారు, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవలసిన అవసరం ఉందన్నారు మరియు వారితో పాటు DCH డా. తిప్పేంద్ర నాయక్ గారు, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస రెడ్డి గారు పాల్గొన్నారు.

అంతకుమునుపు వారిరువురు వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యులతో, ప్రజలతో ముచ్చటించారు, శిబిరం ఆవరణలో పోషకాహార వినియోగంపై అంగన్‌వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించారు మరియు కుమ్మరవాండ్లపల్లి 2 సచివాలయం పరిధిలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు శ్రీమతి డా. డి. ప్రమీల, MD, డా. విద్యాసాగర్, MD, డా. బాబా ఫక్రుద్దీన్, MBBS గార్లు పాల్గొని ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించారు.

ఈ కార్యక్రమంలో కుమ్మరవాండ్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి మూడే శాంతమ్మ బాయి గారు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీమతి బత్తల రామలక్ష్మమ్మ గారు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు శ్రీ సందేపల్లి పుల్లయ్య గారు, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు శ్రీ షైక్ అల్లబకాష్ గారు, స్థానిక నాయకులు శ్రీ మూడే మణికంఠ నాయక్ గారు హాజరయ్యారు.

ఈ కార్యక్రమం కుమ్మరవాండ్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీమతి వై. పద్మజ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, పంచాయతీ కార్యదర్శి శ్రీ పి. మోహన్ రెడ్డి గారి సమక్షంలో హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ సహాయకులు, కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్లు, ANMలు, ఆరోగ్య సహాయకులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, ప్రజల ఇంటి వద్దకే నిష్ణాతులైన వైధ్యులు వచ్చి వైద్యసేవలు అందిం...
16/10/2023

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, ప్రజల ఇంటి వద్దకే నిష్ణాతులైన వైధ్యులు వచ్చి వైద్యసేవలు అందించే విశిష్ట పథకం “జగనన్న ఆరోగ్య సురక్ష” లో భాగంగా కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని గొడ్డువెలగల రోడ్డు నందు గల ఉర్దూ పాఠశాల వద్ద నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనముల సముదాయం నందు 17/10/2023 వ తేదిన అనగా మంగళవారం కుమ్మరవాండ్లపల్లి 1 గ్రామ సచివాలయం పరిధిలోని గ్రామ ప్రజల కోసం మరియు 19/10/2023 వ తేదిన అనగా గురువారం కుమ్మరవాండ్లపల్లి 2 గ్రామ సచివాలయం పరిధిలోని గ్రామ ప్రజల కోసం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు అన్ని రకాల అనారోగ్యాలకు వైద్యం చేయించుకుని మందులు తీసుకోవచ్చును, కంటి పరీక్షలు చేసుకుని వెంటనే కంటి అద్దాలను కూడా పొందవచ్చును మరియు అవసరమైన పక్షంలో మెరుగైన వైద్య సేవల కొరకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేయడం జరుగును. కావున, గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

Address

10-149, Grama Panchayat Office
Kadiri
515591

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Telephone

+919154441139

Alerts

Be the first to know and let us send you an email when Kummaravandlapalli Grama Panchayat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kummaravandlapalli Grama Panchayat:

Share