District Collector, YSR Kadapa District

  • Home
  • District Collector, YSR Kadapa District

District Collector, YSR Kadapa District District Collector, Kadapa has opened this account for taking the suggestions from the public

సోమవారం కలెక్టరేట్‌లోని సభా భవన్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరి...
01/06/2026

సోమవారం కలెక్టరేట్‌లోని సభా భవన్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారితో పాటు డీఆర్వో మల్లికార్జునుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు.

అనంతరం నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు మాట్లాడుతూ, డిజిటల్ గవర్నెన్స్‌లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల నిర్వహణను తప్పనిసరిగా ఈ-ఆఫీస్ ద్వారానే చేపట్టాలని సూచించారు. భౌతిక ఫైళ్ల వినియోగం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ, అన్ని శాఖల అధికారులు ఈ-ఆఫీస్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.

మీడియా అందించే ప్రతి వార్త సమాజానికి వెలుగు చూపే టార్చ్‌లైట్‌లా ఉండాలని, ప్రజలను ఆలోచింపజేస్తూ సామాజిక మార్పుకు వారధిగా ...
30/05/2026

మీడియా అందించే ప్రతి వార్త సమాజానికి వెలుగు చూపే టార్చ్‌లైట్‌లా ఉండాలని, ప్రజలను ఆలోచింపజేస్తూ సామాజిక మార్పుకు వారధిగా నిలవాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు జిల్లా గ్రామీణ విలేకరులకు సూచించారు.

శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా గ్రామీణ విలేకరులకు నిర్వహిస్తున్న రెండు రోజుల పునశ్చరణ శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ గారు అధ్యక్షత వహించగా, శిక్షకులుగా సీనియర్ పాత్రికేయులు, రచయిత ఉమామహేశ్వరరావు, ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టు, యూనియన్ రాష్ట్ర నాయకులు రామసుబ్బారెడ్డి, జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఏడీ పద్మజ హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మీడియా ప్రతినిధులు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం, త్వరలోనే మూడో స్థానానికి చేరుకునే దిశగా పయనించడం దేశ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. దేశ అభివృద్ధిలో మీడియా అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని, ఆ పాత్రను మరింత బాధ్యతాయుతంగా నిర్వహించే స్థాయికి ఎదగాలని సూచించారు.

శుక్రవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాలులో రాబోయే ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026 సందర్భంగా “Inspired by Nature. For Climate...
29/05/2026

శుక్రవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాలులో రాబోయే ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026 సందర్భంగా “Inspired by Nature. For Climate. For Our Future.” అనే అంతర్జాతీయ థీమ్‌కు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ప్రాంతీయ కార్యాలయం, కడప ఆధ్వర్యంలో అవగాహన బ్రోచర్‌ను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు APPCB చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. భవిష్యత్ తరాల కోసం ప్రకృతి సంపదలను సంరక్షించడం ప్రతి ఒక్కరి సామూహిక బాధ్యత అని పేర్కొన్నారు.

జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించి, పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేయాలని జ...
29/05/2026

జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించి, పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ మీటింగ్ హాలులో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారి అధ్యక్షతన నిర్వహించబడింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, జిల్లాలో పారిశ్రామిక వనరులు సమృద్ధిగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని పరిశ్రమల స్థాపన ద్వారా నిరుద్యోగ యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కడప జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, MSMEలకు ప్రోత్సాహకాలు, భూ కేటాయింపుల అంశాలపై జిల్లా పారిశ్రామిక & ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా జిల్లాలో నూతన పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగాల స్థాపన కోసం ప్రణాళికలు రూపొందించాలన్నారు.

సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పరిశ్రమలకు అనుమతుల మంజూరు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారి అధ్యక్షతన జిల్లా వాణిజ్య పన్నుల శాఖ సమన...
29/05/2026

శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారి అధ్యక్షతన జిల్లా వాణిజ్య పన్నుల శాఖ సమన్వయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ జి. సుమతి గారు జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ఇప్పటివరకు వసూలైన పన్నుల మొత్తం, పెండింగ్‌లో ఉన్న పన్నుల వివరాలను జిల్లా కలెక్టర్‌ గారికి వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాన ఆదాయ వనరులుగా నిలిచే పన్నులను ప్రతి వ్యాపారి, వృత్తిదారుడు, సంస్థ బాధ్యతాయుతంగా సకాలంలో చెల్లించాలని సూచించారు. ముఖ్యంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లింపుపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రొఫెషనల్ ట్యాక్స్ చట్టం ప్రకారం వ్యాపారులు, దుకాణాలు, కంపెనీలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, వైద్యులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, కాంట్రాక్టర్లు, గోదాములు, ఏటీఎంలు, బ్యాంకు శాఖలు, ఫైనాన్స్ సంస్థలు, మొబైల్ టవర్లు తదితర వాణిజ్య, వృత్తి సంస్థలు తప్పనిసరిగా నమోదు చేసుకొని వర్తించే పన్నును ప్రభుత్వానికి చెల్లించాలని జిల్లా కలెక్టర్ గారు స్పష్టం చేశారు.

అలాగే యజమానులు తమ సంస్థలలో పనిచేసే ఉద్యోగుల జీతాల ఆధారంగా ఫారం-I కింద వృత్తి పన్ను వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. వ్యాపార సంస్థలు మరియు వృత్తిదారులు ఫారం-II కింద, ఉద్యోగులపై వర్తించే పన్ను ఫారం-I కింద చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

పశుపాలకులకు నాణ్యమైన సాధారణ వెటర్నరీ మందులను సరసమైన ధరల్లో అందుబాటులోకి తీసుకురావడానికి జిల్లాలో పశు ఔషధి విక్రయ కేంద్రా...
29/05/2026

పశుపాలకులకు నాణ్యమైన సాధారణ వెటర్నరీ మందులను సరసమైన ధరల్లో అందుబాటులోకి తీసుకురావడానికి జిల్లాలో పశు ఔషధి విక్రయ కేంద్రాలు (PAVKs) ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు తెలిపారు.

శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, వైఎస్ఆర్ కడప జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో అనుకూలమైన పశువైద్య సంస్థలు మరియు సహకార సంఘాలను గుర్తించి, పశు ఔషధి విక్రయ కేంద్రాల స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లైవ్‌స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (LHDCP) కింద ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రాల ద్వారా పశుపాలకులకు తక్కువ ధరలకు నాణ్యమైన వెటర్నరీ మందులు అందుబాటులోకి రావడంతో పాటు, పశువుల వ్యాధి నివారణ, నియంత్రణ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలుకానున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ కేంద్రాలు PM-KSKలు మరియు సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేయబడతాయని, అర్హత కలిగిన ఫార్మసిస్టులు, అవసరమైన మౌలిక వసతులు, డ్రగ్ లైసెన్సులు తదితర అంశాలను కల్పించనున్నట్లు తెలిపారు.

రైతులకు ఉపయోగపడేలా ఎంపీఎఫ్‌సీ గోదాములను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ...
29/05/2026

రైతులకు ఉపయోగపడేలా ఎంపీఎఫ్‌సీ గోదాములను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం (AIF) కింద బహుళ ప్రయోజన సదుపాయ కేంద్రాల (MPFCs) గోదాముల ఏర్పాటుకు సంబంధించిన జిల్లాస్థాయి అమలు కమిటీ (DLIC) సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) ఆధ్వర్యంలో నిర్మితమైన ఎంపీఎఫ్‌సీ గోదాములను రైతులకు మరింత ఉపయోగకరంగా మార్చాలని అధికారులకు సూచించారు. రైతులు తమ పంట దిగుబడులను గ్రామ స్థాయిలోనే సురక్షితంగా నిల్వ చేసుకునే విధంగా గోదాముల వినియోగంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో.. జిల్లాలో "ఎల్‌నినో" పరిస్థితుల దృష్ట్యా ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ 2026-27 అనే అంశం...
29/05/2026

శుక్రవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో.. జిల్లాలో "ఎల్‌నినో" పరిస్థితుల దృష్ట్యా ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ 2026-27 అనే అంశంపై రాష్ట్ర రైతు సాధికార సంస్థ - ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (APCNF) వారు రూపొందించిన పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు ఆవిష్కరించారు.

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం - SIR 2026ను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి రాజకీయ పార్టీ ప్ర...
29/05/2026

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం - SIR 2026ను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఎన్నికల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి గారు పేర్కొన్నారు.

శుక్రవారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, డిఆర్వో మల్లికార్జునుడుతో కలిసి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో Special Intensive Revision (SIR) - 2026పై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితాల సమగ్రత అత్యంత కీలకమని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితాలు అవసరమని, అందుకే భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు.

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి త...
28/05/2026

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి సేవలు చిరస్మరణీయమని, నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు పేర్కొన్నారు.

గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ 103వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Address

Collecterate

516004

Alerts

Be the first to know and let us send you an email when District Collector, YSR Kadapa District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to District Collector, YSR Kadapa District:

  • Want your organization to be the top-listed Government Service?

Share