Jagtial District News

  • Home
  • Jagtial District News

Jagtial District News జగిత్యాల జిల్లా వార్తలు

10/07/2023
నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ కు వై కేటగిరీ భద్రతY కేటగిరీలో ఎంపి అరవింద్ కి మొత్తం 8 మంది కేంద్ర బలగాలు CRPF భద్రత.,...
10/07/2023

నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ కు వై కేటగిరీ భద్రత

Y కేటగిరీలో ఎంపి అరవింద్ కి మొత్తం 8 మంది కేంద్ర బలగాలు CRPF భద్రత.,ఇక అరవింద్ కాన్వాయ్ లో రెండు భద్రతా వాహనాలు..

ఆయన ఇంటి వద్ద ఐదుగురు, ఆయన వెంట ముగ్గురు, ఒక గార్డ్ కమాండర్ తో భద్రత కల్పించిన కేంద్ర హోమ్ శాఖ..

10/07/2023

A candid conversation with Narsamma and the always scrumptious corn..can never go wrong. Today, while on the go from Jagtial to Hyderabad.

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత ను కలిసిన  జిల్లా దివ్యాంగుల నాయకులు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి ...
10/07/2023

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత ను కలిసిన జిల్లా దివ్యాంగుల నాయకులు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లగా వాటిపై చర్చించి సానుకూలంగా స్పందించారు. త్వరలో జగిత్యాల జిల్లా దివ్యాంగులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని సమస్యలపై పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు.

కరీంనగర్ ఎమ్మెల్సీ L రమణ తండ్రి LG రామ్ గారు మృతి చెందగా జగిత్యాలలో వారి నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి కుట...
10/07/2023

కరీంనగర్ ఎమ్మెల్సీ L రమణ తండ్రి LG రామ్ గారు మృతి చెందగా జగిత్యాలలో వారి నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు..

09/07/2023
హన్మకొండ జిల్లా: కేసీఆర్ ప్రభుత్వం అంటే అత్యంత అవినీతి ప్రభుత్వం అని.. ఇప్పుడు వారి అవినీతి ఢిల్లీకి కూడా పాకిందని ప్ర‌ధ...
09/07/2023

హన్మకొండ జిల్లా: కేసీఆర్ ప్రభుత్వం అంటే అత్యంత అవినీతి ప్రభుత్వం అని.. ఇప్పుడు వారి అవినీతి ఢిల్లీకి కూడా పాకిందని ప్ర‌ధాని మోడీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ పని , వారికి పొద్దున లేస్తే అదే పని అని మండిపడ్డారు., కుటుంబాన్ని పెంచి పోషించడమే కేసీఆర్ సర్కార్ పని పని అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం స్కామ్‌ల్లో ఇరుక్కుందని , కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు వాటిని వెలికితీసే ప‌నిలో ప‌డ్డాయ‌ని అన్నారు.. వ‌రంగ‌ల్ లో నిర్వ‌హించిన బిజెపి విజ‌య సంక‌ల్ప స‌భలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ, తొలుత తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ.. భద్రకాళి అమ్మవారి మహాత్యానికి, సమ్మక్క-సారలమ్మ శౌర్యానికి, రాణి రుద్రమ పరాక్రమానికి నిదర్శనమైన వరంగల్‌కు రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఒక బీజేపీ కార్యకర్తగా తాను వరంగల్‌కు వచ్చానని చెప్పారు. జనసంఘ్ కాలం నుంచి ఈ ప్రాంతం తమ భావజాలానికి బలమైన కోటగా ఉందని అన్నారు., కెసిఆర్ ప్ర‌భుత్వం కుటుంబ పాల‌న‌, అవినీతి ప్ర‌భుత్వం అంటూ ప‌దే ప‌దే వ‌క్కాణించారు. దేశంలోని కుటుంబ పార్టీలన్నింటికీ అవినీతి పునాది ఉందని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషించిందననీ, కేసీఆర్ ప్రభుత్వం చేసింది 4 పనులు మాత్రమేనని.. ఉదయం, సాయంత్రం మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని దుర్భాషలాడటం.. ఒక కుటుంబాన్ని అధికార కేంద్రీకృతం చేసి తెలంగాణకు వారే యజమాని అని నిరూపించుకోవడం.. తెలంగాణ ఆర్థికాభివృద్ధిని అడ్డుకోవడం.. తెలంగాణను అవినీతిలో ముంచడం అంటూ మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 9 సంవత్సరాలలో మొత్తం ప్రపంచంలో భారతదేశం గర్వం పెరిగిందని అన్నారు. అందరూ భారతదేశం వైపు చూస్తున్నారని.. దీని వల్ల తెలంగాణ కూడా లాభపడిందని తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని.. తెలంగాణ యువత దీని వల్ల లబ్ది పొందుతున్నారని, వారికి ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పారు. ఎక్కడైనా అభివృద్ది కోసం రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని.. అవినీతి కోసం ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. ఇందు కోసమేనా తెలంగాణ యువత ఆత్మబలిదానాలు చేసిందని? ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో ఏం చేసిందో చెప్పాలని అన్నారు. కేసీఆర్ అవినీతి నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని అన్నారు. టీఎస్‌పీఎస్సీ స్కామ్‌తో యువత ఎంతో నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా తెలంగాణ ప్రజలకు రెండూ ప్రాణాంతకమే అని అన్నారు. ఈ రెండింటి నుంచి తెలంగాణ ప్రజలను కాపాడాలని కోరారు. తెలంగాణ వర్సిటీల్లో మూడువేల అధ్యాపక పోస్టులు భర్తీ చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో 15 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. నిరుద్యోగ యువతకు రూ. 3 వేల భృతి ఇవ్వలేదని అన్నారు., కేసీఆర్ ప్రభుత్వంపై సర్పంచ్‌లు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. 9 ఏళ్లలో కేంద్రం గ్రామపంచాయితీలకు లక్ష కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని చెప్పారు. ఆ నిధులను తెలంగాణ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని విమర్శించారు. తాము రైతుల పంటకు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చి.. చేసి చూపించామని అన్నారు.

తెలంగాణకు మెగా టెక్స్‌టైల్ పార్క్ ఇచ్చామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఎస్సీలు, ఎస్టీలు, పేదలను మోసం చేసిందని విమర్శించారు. ఆదివాసీ గ్రామాలకు ఎలాంటి మౌలిక సౌకర్యం కల్పించడం లేదని మండిపడ్డారు. తాము ఆదివాసీ ప్రాంతాల్లో ఆరులైన్ల రహదారులు వేస్తున్నామని చెప్పారు. ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే హైదరాబాద్‌లో కొందరికి నిద్రపట్టదని వ్యంగ్యస్త్రాలు సంధించారు. గ‌తాన్ని ప్ర‌స్తావిస్తూ, బీజేపీ తొలుత సాధించిన రెండు లోక్‌సభ సీట్లలో ఒకటి హన్మకొండ అని అన్నారు. ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని అన్నారు. అందులో తెలంగాణ అతి ముఖ్యమైన భూమిక అని చెప్పారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీ ట్రైలర్ చూపించిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను అడ్రస్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. “అబ్ కీ బార్ బిజెపి సర్కార్” అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు...

హైదరాబాద్ : నేడే లష్కర్ బోనాలు..ఉదయం 4 గంటల నుంచే ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి  బోనాలు..నేడు సాయంత...
09/07/2023

హైదరాబాద్ :

నేడే లష్కర్ బోనాలు..

ఉదయం 4 గంటల నుంచే ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు..

నేడు సాయంత్రం అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం కేసిఆర్ దంపతులు..

మోండా మార్కెట్ సమీపంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమానికి ఉదయం 9.30కి ముఖ్య అతిథిగా రానున్న ఎమ్మెల్సీ కవిత

మంత్రి తలసాని కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు.,

ప్రతీ సంవత్సరం మహంకాళి ఆలయంలో బోనాలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. అందువల్ల ఈ సంవత్సరం కూడా 5 లక్షల మంది దాకా వస్తారనే అంచనా ఉంది. అలాగే అమ్మవారి దర్శనం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు పెద్ద సంఖ్యలో రానున్నారు. అందుకే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా సీసీ టీవీల నిఘా ఉంది. మహంకాళి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

రేపు భవిష్యవాణి :

బోనాల వేడుకల్లో ప్రధాన ఘట్టమైన రంగం... సోమవారం జరగనుంది. అవివాహిత జోగిని ఈ భవిష్యవాణి చెప్పనున్నారు. ఈ సంవత్సరం తెలంగాణ ఎలా ఉంటుందో చెబుతారని ఆశిస్తున్నారు. ఈ రంగంలో గజరాజుపై అమ్మవారి ఊరేగింపు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

09/07/2023

: మల్యాల మండలం రాజారం గ్రామంలో పోలీసుల కార్డన్ సెర్చ్ - సరైన పాత్రలు లేని 42 ద్విచక్ర వాహనాలు సీజ్

21/06/2023

Address

Jagtial, Telangana

505327

Website

Alerts

Be the first to know and let us send you an email when Jagtial District News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share