Samindla Vani - Municipal Chairman, Jagtial

Samindla Vani - Municipal Chairman, Jagtial Municipal Chairman, Jagtial
Committed to development, transparency & public service. Serving the people with dedication.

పరిశుభ్రమైన పట్టణాల దిశగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికజగిత్యాల పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ...
06/03/2026

పరిశుభ్రమైన పట్టణాల దిశగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక

జగిత్యాల పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని శాసన సభ్యులు డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతిజ్ఞ చేశారు.

ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ 99 రోజుల ప్రణాళిక ద్వారా పట్టణాల్లో పరిశుభ్రతను పెంపొందించడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం మరియు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం లక్ష్యమని తెలిపారు. ప్రజలు చెత్తను తడి-పొడి వేరు చేసి ఇవ్వడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, సకాలంలో పన్నులు చెల్లించడం ద్వారా మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు.

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ పరిశుభ్రమైన పట్టణం ప్రజల సహకారంతోనే సాధ్యమని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు కలిసి పనిచేస్తే కార్యక్రమం విజయవంతమవుతుందని తెలిపారు.

మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన పుర సేవలు, మౌలిక సదుపాయాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజా గౌడ్, RDO మధుసూదన్, కమిషనర్ స్పందన, కౌన్సిలర్లు పంబాల సుజాత రాము, బడుగు పద్మ రాజేందర్, బోల్లరపు స్వప్న గిరిధర్, దుమాల రాజ్ కుమార్, మొహమ్మద్ ఆయుబ్ ఖాన్, తోపారపు లావణ్య రజనీకాంత్, క్యాదాసు నవీన్, కూతురు శేఖర్, మానపురి పవిత్ర మహేష్, శ్రీనివాస్, ఖాజా కమలుద్దిన్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, అర్పిలు, మహిళా సంఘాల సభ్యులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

శ్రీ భక్త మార్కేండేయ దేవాలయమును దర్శించుకున్న సమిండ్ల వాణి శ్రీనివాస్...ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి, ప్రత్...
02/03/2026

శ్రీ భక్త మార్కేండేయ దేవాలయమును దర్శించుకున్న సమిండ్ల వాణి శ్రీనివాస్...

ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేసి ఆశిర్వచనము అందజేసారు.

స్థానిక కౌన్సిలర్ మానపురి పవిత్ర మహేష్ మరియు పద్మశాలి సేవ సంఘం, జగిత్యాల వారు చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ గారిని ఘనముగా సన్మానించారు.

తదుపరి 24 వ వార్డు సందర్శించి వార్డు యందు పారిశుధ్య మరియు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. వార్డులలో పారిశుధ్య పనులకు మొదటి ప్రాధాన్యతతో తీసుకొని ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా సేవలు అందించాలాని అధికారులకు సూచించారు.

వీరి వెంట కౌన్సిలర్ మానపురి పవిత్ర మహేష్, పద్మశాలి సేవ సంఘం అధ్యక్షులు భోగ గంగాధర్, ప్రధాన కార్యదర్శి గాదాసు రాజేందర్, బోగ రాజు, కొక్కుల ప్రభాకర్, వేముల శంకర్, కస్తూరి నరేష్, కొప్పు సందీప్, మ్యాన శబరీ, సాంబారి కళావతి మరియు తదితరులు ఉన్నారు.
2m

చాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు కమటాల శ్రీనివాస్ గారికి హైదరాబాద్ యశోద హాస్పిటల్ యందు కీలు మార్పిడి శాస్త్ర చికిత్స జరగగా ...
02/03/2026

చాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు కమటాల శ్రీనివాస్ గారికి హైదరాబాద్ యశోద హాస్పిటల్ యందు కీలు మార్పిడి శాస్త్ర చికిత్స జరగగా ఈరోజు వారి స్వగృహం యందు వారిని పరామర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్. వారు త్వరగా కోలుకొని ప్రజా జీవితములోకి రావాలని ఆకాక్షించారు. వీరి వెంట కౌన్సిలర్ బోయినిపెల్లి ప్రశాంత్ రావు మరియు తదితరులు ఉన్నారు.

01/03/2026

Address

4-3-104 , Beet Bazar
Jagtial
505327

Website

Alerts

Be the first to know and let us send you an email when Samindla Vani - Municipal Chairman, Jagtial posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share