RGK Colony

RGK Colony Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from RGK Colony, Social service, Rajiv Gruhakalpa, Jagathgirigutta, Hyderabad.

అంజన్న ధర్మారపు (అధ్యక్షుడు),
ముచ్చెంతుల భూపతి రెడ్డి (ప్రధాన కార్యదర్శి)

"జగద్గిరిగుట్ట, రాజీవ్ గృహకల్ప - కాలనీ అభివృద్ధికి నిబద్ధత. మెరుగైన మౌలిక సదుపాయాలు, సురక్షితమైన వాతావరణం, ఆదర్శ జీవనం మా ప్రథమ లక్ష్యం" అంజన్న ధర్మారపు (అధ్యక్షుడు),
ముచ్చెంతుల భూపతి రెడ్డి (ప్రధాన కార్యదర్శి)

"జగద్గిరిగుట్ట, రాజీవ్ గృహకల్ప - కాలనీ అభివృద్ధికి నిబద్ధత. మెరుగైన మౌలిక సదుపాయాలు, సురక్షితమైన వాతావరణం, ఆదర్శ జీవనం మా ప్రథమ లక్ష్యం"

ఈరోజు జగనన్న ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గారిని కలిసి రాజీవ్ గృహకల్ప లో ఉన్న సమస్యల పైన వెంటనే చర్య...
27/08/2026

ఈరోజు జగనన్న ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గారిని కలిసి రాజీవ్ గృహకల్ప లో ఉన్న సమస్యల పైన వెంటనే చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కరించాలని వారిని కోరడం జరిగింది .అందులో ముఖ్యమైనవి కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని, సిసి రోడ్లు దయనీయంగా ఉన్నవి సిసి రోడ్లు వెంటనే మంజూరు చేయాలని ,పార్కులు పనులు ప్రారంభమై మధ్యలో నిలిచిపోయినాయి ఈ పనులకు నిధులను వెంటనే మంజూరు చేయించి పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, డ్రైనేజీ వ్యవస్థకు నిధులు మంజూరు చేసి కాలనీలో మురుగునీరు సమస్య లేకుండా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండే విధంగా అధికారులను ఆదేశించి పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ,గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం ఇచ్చి మీ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు కాలనీ అధ్యక్షులు అంజన్న ధర్మారపు గారు, గౌరవ పెద్దలు ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి గారు కాలనీ సంక్షేమ సంఘం నాయకుల సహాయ సహకారాలతో కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో  గౌరవ పెద్దలు జగనన్న గారి ఆదేశాల మేరకు మన కాలనీ అధ్యక్షులు అంజన్న ధర్మారపు గారు ప్రధాన కార్...
24/08/2026

ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో
గౌరవ పెద్దలు జగనన్న గారి ఆదేశాల మేరకు మన కాలనీ అధ్యక్షులు అంజన్న ధర్మారపు గారు ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి గారు ఉపాధ్యక్షులు వంగాల పరశురాం గారు సహాయకుషాధికారి ఎస్ ఎన్ రెడ్డి గారు, మరియు సంక్షేమ సంఘ సభ్యుల సహాయ సహకారాలతో కుత్బుల్లాపూర్ సిఎంసి జోనల్ కమిషనర్ను కలిసి కాలనీలో ఉన్నటువంటి సమస్యల పైన వినతి పత్రం అందజేయడం జరిగింది .

ఇందులో ప్రధానమైన సమస్యలు,

1.కమ్యూనిటీ హాల్ నిర్మాణం నిధుల మంజూరు గురించి.
2.సీసీ రోడ్ల , మెయిన్ రోడ్లు మరియు వీధులలో మిగిలిపోయిన రోడ్ల మరమ్మతులు మంజూరు.
3.పార్కుల అభివృద్ధి పనులు నిధుల మంజూరు.
4. డ్రైనేజీ పునర్నిర్మాణానికి మరియు మరమతులకు నిధుల మంజూరు
ఈ అంశాల పైన వినతిపత్రం ఇవ్వడం జరిగింది అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అతి తొందరలో ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని సానుకూలంగా హామీ ఇచ్చారు.

ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజీవ్ గురుకల్ప సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజీవ్ గృహకల్ప లోని సంక్షేమ సంఘ...
15/08/2026

ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజీవ్ గురుకల్ప సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజీవ్ గృహకల్ప లోని సంక్షేమ సంఘం భవనం వద్ద మన కాలనీ అధ్యక్షులు అంజన్న ధర్మారపు గారు జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం నాయకులు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంతో భక్తిశ్రద్ధలతో 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.

ఈరోజు మన కాలనీ వాసుడైనటువంటి ఆంజనేయులు గారు బ్లాక్ నెంబర్ 28 ఫ్లాట్ నెంబర్ 18 లో నివసిస్తున్నారు, వారు గత 40 సంవత్సరాలుగ...
21/07/2026

ఈరోజు మన కాలనీ వాసుడైనటువంటి ఆంజనేయులు గారు బ్లాక్ నెంబర్ 28 ఫ్లాట్ నెంబర్ 18 లో నివసిస్తున్నారు, వారు గత 40 సంవత్సరాలుగా బాలనగర్ పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి ఎస్వీ పాలిమర్ లిమిటెడ్ కంపెనీలో విధులు నిర్వహించారు కానీ కంపెనీ యాజమాన్యం కార్మిక చట్టాలను తుంగలో తొక్కి ఆంజనేయులుతో 40 సంవత్సరాలు వెట్టిచాకిరి చేయించుకున్నారు కార్మిక చట్టాల నిబంధనల ప్రకారం వారికి ఇచ్చే వేతనాన్ని కూడా సరైన పద్ధతిలో ఇవ్వలేదు వారికి 40 సంవత్సరాల అనుభవంతో పాటు ఆ కంపెనీలో ఉన్నటువంటి కెమికల్ వలన వారికి రెండు దపాలు పెరాల్సిస్ రావడం జరిగింది దానికి గాను వారు అనేక మార్లు యాజమాన్యానికి సహాయం చేయమని అర్జించిన వారు పట్టించుకోకుండా మీరు ఎవరికి చెప్తారో చెప్పుకోండి మేము ఒక్క రూపాయి కూడా ఇవ్వము అని బెదిరింపులకు దిగినారు వారు జరిగినటువంటి అన్యాయాన్ని మన కాలనీ సంక్షేమ సంఘం ఆఫీసుకు వచ్చి వివరించినారు అట్టి విషయాన్ని విన్న నాకు మనసు చలించి నేను వెంటనే సంబంధిత కంపెనీ యజమాన్యంతో చర్చలు జరిపి కార్మిక చట్టాల ప్రకారం వారికి మీరు లెక్క కట్టినట్లయితే చాలా ఎక్కువ మొత్తంలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దయచేసి వారి పరిస్థితి దయనీయంగా ఉన్నది కాబట్టి మీరు వెంటనే వారికి ఆర్థిక సహాయం చేయాలని వారికి వివరించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఆంజనేయులుకు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం గా 2 లక్షల రూపాయలు నగదును అందించినారు ఈ విషయాన్ని కాలనీ అధ్యక్షునిగా మీ అందరికీ తెలియజేయుటకు నేను ఎంతో గర్విస్తున్నాను అదేవిధంగా నాతోపాటు నా మిత్రులు వంగాల పరుశురాం గారు, నరసింహారెడ్డి గారు శ్రీమతి కృష్ణవేణి గారు శ్రీమతి అనిత రెడ్డి గారు శ్రీమతి నిర్మలా రెడ్డి గారు సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇట్లు
అధ్యక్షులు
అంజన్న ధర్మారపు

సోమవారం   కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో గారిని కలిసి రాజీవ్ గృహకల్ప లోని షాపింగ్ కాంప్లెక్స్ స్థలం కబ్జా అవుతుందని భూ కబ్జాదా...
15/07/2026

సోమవారం కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో గారిని కలిసి రాజీవ్ గృహకల్ప లోని షాపింగ్ కాంప్లెక్స్ స్థలం కబ్జా అవుతుందని భూ కబ్జాదారులు అక్రమ నిర్మాణాన్ని చేపట్టారని ఎమ్మార్వో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి వెంటనే అక్రమ కట్టడాన్ని తొలగించి రాజీవ్ గృహకల్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయగలరని వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు కాలుని అధ్యక్షులు అంజన్న ధర్మారపు కాలనీ ప్రధాన కార్యదర్శి ముచ్చంతల భూపతి రెడ్డి గారు కాలనీ ఉపాధ్యక్షులు వంగాల పరశురామ్ గారు మరియు మహిళా మాధవి రెడ్డి గారు నిర్మల రెడ్డి గారు సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు

ఈరోజు మన కాలనీలో కొన్ని వీధులలో వీధి దీపాలు వెలగడం లేదని సంక్షేమ సంఘానికి ఫిర్యాదు చేసినారు అట్టి ఫిర్యాదుకు వెంటనే స్పం...
15/07/2026

ఈరోజు మన కాలనీలో కొన్ని వీధులలో వీధి దీపాలు వెలగడం లేదని సంక్షేమ సంఘానికి ఫిర్యాదు చేసినారు అట్టి ఫిర్యాదుకు వెంటనే స్పందించి సంక్షేమ సంఘం వారు స్ట్రీట్ లైట్లను సంబంధిత అధికారులను పిలిపించి వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన కాలనీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు అంజన్న ధర్మారపు గారు గౌరవ ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి గారు సంక్షేమ సంఘం సభ్యులు అందరి సహాయ సహకారాలతోటి వీధిలైట్స్ చేయించడం జరిగింది.

ఈరోజు వీధి నెంబర్ 4 లో ఉన్నటువంటి రాజీవ్ గృహకల్ప సెట్విక్ ట్యాంక్ లో ఓపెన్ మాన్యువల్స్ ఉండడం వలన రెండు సంవత్సరాల లేక దూడ...
01/07/2026

ఈరోజు వీధి నెంబర్ 4 లో ఉన్నటువంటి రాజీవ్ గృహకల్ప సెట్విక్ ట్యాంక్ లో ఓపెన్ మాన్యువల్స్ ఉండడం వలన రెండు సంవత్సరాల లేక దూడ సెప్టిక్ ట్యాంక్లో పడడం జరిగింది దాన్ని వెంటనే గమనించినటువంటి స్థానికులు సంక్షేమ సంఘానికి సమాచారం ఇస్తే అక్కడున్నటువంటి యువత సాయ సహకారాలు ముఖ్యంగా అరవింద్ వారి మిత్రబృందంతో సంప్రదింపులు జరిపి డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సమాచారం ఇవ్వడం జరిగింది. వారు వెంటనే స్పందించి లేగ దూడ ప్రాణాలు పోకుండా ఎంతో శ్రమించి దానిని బయటకు తీయడం జరిగింది. ఈ విషయంలో సమాచారం ఇవ్వగానే డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు స్పందించి తక్షణ చర్యలు చేపట్టి ఆ యొక్క ఆవు దూడ ప్రాణాలను రక్షించినారు. కాబట్టి వారికి రాజీవ్ గురుకల్ప ప్రజల పక్షాన సంక్షేమ సంఘం పక్షాన హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ, అదే విధంగా సంబంధిత ఐడ్రా కమిషనర్ గారికి, సిఎంసి మల్కాజిగిరి కమిషనర్ గారికి ,విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తక్షణమే స్ట్రీట్ నెంబర్ 4 లో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ కి చుట్టూ మెస్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఇదే సెప్టిక్ ట్యాంక్ లో రెండు సంవత్సరాల క్రితము ఒక బాలుడు కూడా పడి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడడం జరిగింది, కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి రక్షణ కల్పించగలరని, రాజీవ్ గురుకల్ప సంక్షేమ సంఘం తరఫున రాజీవ్ గురుకల్ప ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రమాద సమయాల్లో సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో స్ట్రీట్ నెంబర్ 4 లో ఉన్నటువంటి పెద్దలు తిరుపతి రెడ్డి గారు పుల్లారెడ్డి గారు మరియు వారి మిత్ర బృందం సహాయ సహకారాలు అందించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అంజన్న ధర్మారపు గారు ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి గారు సంక్షేమ సంఘం నాయకులు అందరు కూడా పాల్గొనడం జరిగింది

Address

Rajiv Gruhakalpa, Jagathgirigutta
Hyderabad
500037

Website

Alerts

Be the first to know and let us send you an email when RGK Colony posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category