AMCS - Adivasi Mahila Chaitanya Shakthi

AMCS - Adivasi Mahila Chaitanya Shakthi Aadhar Society women wing is Adivasi Mahila Chaitanya Shakthi - AMCS.

08/03/2023
 #ఆదివాసి_మహా_రాణులందరికి #అంతర్జాతీయ_మహిళా_దినోత్సవం #శుభాకాంక్షలుఅలసిన మనుషులు కాదు, సత్తువలేని యువత కాదు, అమ్మో సమస్య...
08/03/2023

#ఆదివాసి_మహా_రాణులందరికి
#అంతర్జాతీయ_మహిళా_దినోత్సవం
#శుభాకాంక్షలు
అలసిన మనుషులు కాదు, సత్తువలేని యువత కాదు, అమ్మో సమస్య అని భయపడే పిరికి వారు కాదు, శత్రువుకి డబ్బు, అధికారం, అంగబలం ఉంది అని వెన్నుచూపలేదు, పిడికిలి బిగించి, సత్తువ ఎక్కించి, సమస్యను పిండి చేసిన అద్భుత ప్రకృతి శక్తులు, ఆదివాసి మహిళలు...
ఎందరో ఆదివాసి మహా రాణులు...
ఆదివాసి సమాజానికి మూల స్థంబాలుగా నిలిచారు.. ఆదివాసి సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలకు సవాలుగా నిలిచారు... చదువుతో సంబంధం లేదు, నాయకత్వంతో సంబంధం లేదు, ఒంటరి పోరాటం అని భయపడలేదు, విమర్శించే వారిని పట్టించుకోలేదు, వారి దృష్టి అంతా సమస్యను పూర్తిగా లేకుండా చేయడమే... భారత దేశ స్వాతంత్ర్య పోరాటం(రాణి దుర్గావతి, రాణి గైడిన్ ల్యూ) నుండి మొదలు అడవుల రక్షణ(జమున తుడు పోరాటం), చెట్ల సంరక్షణ (గౌర దేవి - చిప్కో ఉద్యమం), నిరక్షరాస్యత (తులసి ముండా), నియంగిరి హిల్స్ రక్షణ (కుని సికాక), ఆదివాసి మహిళల రక్షణ (సోని సొరి - టీచర్), ఆదివాసి గ్రామాల సంరక్షణ (దయామని బర్ల - ఆదివాసి మహిళ జర్నలిస్ట్), ఇలా పోరాటాలు చేస్తూనే నేడు భారత దేశానికి క్రీడల ద్వారా అత్యున్నత కీర్తిని (ఒలింపిక్ మెడల్స్) అందించిన మేరీ కోమ్, మీరభాయ్ ఛాను (ఒలింపిక్ మెడల్ - వెయిట్ లిఫ్టింగ్), ప్రస్తుతం భారత దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పీఠం అధిష్టించిన ద్రౌపది ముర్ము వరకు ఎందరో జాతికి సేవలు అందించిన ఆదివాసి మాతృ మూర్తులు. ఇలా ఎవరి చరిత్ర చూసిన ప్రకృతితో మమేకం, వినాశక దృష్టులతో అవిరామ పోరాటం. నేటికి ఆదివాసిల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, సమ్మేళనం ఇంత పటిష్టంగా ఉన్నాయి అంటే, దానిని నిరంతరం కాపాడుతూ వస్తున్న ఆదివాసి వీర వనితలే కారణం. ఇంకా ఎందరో ఉన్నారు చరిత్ర మరిచిన పోరాట దివ్వెలు, ఇంకా ఎందరో ఉన్నారు దివికెగసిన తారలు, ఆ మహా తల్లులు ప్రసాదించిన ఈ జీవితాన్ని, ఆదివాసి సమాజాన్ని ఇంకొంచెం బలంగా, దృడంగా నిర్మించుకుందాం... వారికి అండగా నిలబడదాం... వారి పోరాటంలో మనము ఒక సమీద లా మారుదాం... ఆదివాసి జాతి ఎదుర్కుంటున్న సమస్యల సంకెళ్లను తెంచుదాం... ఆదివాసి మహారాణులందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
ఆదివాసి మహిళ చైతన్య శక్తి...
(ఆధార్ సొసైటీ అనుబంధ సంఘం)
తెలంగాణ & ఆంధ్రప్రదేశ్...

 #అమ్మాయిలు_మహిళలు_వేధింపులకు_గురైతే_షీటీమ్స్_ని_సంప్రదించండితెలంగాణాలో ఏ గ్రామంలో అయినా, పట్టణంలో అయినా ఆదివాసీ మహిళలు,...
06/10/2022

#అమ్మాయిలు_మహిళలు_వేధింపులకు_గురైతే_షీటీమ్స్_ని_సంప్రదించండి
తెలంగాణాలో ఏ గ్రామంలో అయినా, పట్టణంలో అయినా ఆదివాసీ మహిళలు, అమ్మాయిలు ఎవ్వరి వల్లనైనా ఎలాంటి మానసిక, శారీరక వేధింపులకు గురైనా ఎవ్వరికి చెప్పిన పరువు పోతుంది అనే ఇబ్బందులు ఉన్న వారు సీక్రెట్ గా తెలంగాణ #షీటీమ్స్ ని సంప్రదించి మిమ్మల్ని వేధించే ఆకతాయిలపైనా పిర్యాదు చేయవచ్చు ధైర్యంగా. మీ భద్రత కోసం జిల్లాల వారీగా ఉన్న #షీటీమ్స్ ఇంచార్జిల నంబర్స్ షేర్ చేస్తున్నాం. ఆపదలో ఉన్న వారికి అండగా ఉండండి.
ఆదివాసీ మహిళా చైతన్య శక్తి
#ఆదివాసి_మేలుకో

 💐💐💐💐💐💐💐💐💐💐భారత దేశ అత్యున్నత పదవిని అలంకరించిన ఆదివాసి జాతీయ నాయకులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి యావత్ ఆదివాసి జాతి త...
23/07/2022


💐💐💐💐💐💐💐💐💐💐
భారత దేశ అత్యున్నత పదవిని అలంకరించిన ఆదివాసి జాతీయ నాయకులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి యావత్ ఆదివాసి జాతి తరపున అలాగే దేశ ప్రజల తరపున ఆధార్ సొసైటీ ద్వారా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
ఆధార్ సొసైటీ
తెలంగాణ & ఆంధ్రప్రదేశ్

 #శనగకుంట_గ్రామస్తుల_సహయార్థంమన తోటి మిత్రులు, మన తోటి కుటుంబాలు అత్యంత దారుణమైన అగ్ని ప్రమాదంలో నిలువ నీడ లేకుండా నిరాశ...
02/05/2022

#శనగకుంట_గ్రామస్తుల_సహయార్థం
మన తోటి మిత్రులు, మన తోటి కుటుంబాలు అత్యంత దారుణమైన అగ్ని ప్రమాదంలో నిలువ నీడ లేకుండా నిరాశ్రయులు అయ్యారు. వారికి మనవంతు సహకారం అందించి మానవతా దృక్పధంతో మన బాధ్యతను నిర్వర్తించుదాం. ములుగు జిల్లా, మంగపేట మండలం, శనగకుంట గ్రామస్తులకు "ఆధార్ సొసైటీ" తరపున ద్వారా సహకారం అందించడానికి జాతీయ అధ్యక్షులు గొంది.వెంకటరమణ గారు పిలుపు నిచ్చారు. ఎవరికి ఎంత తోచితే అంత మొత్తంలో ఆర్థిక సహకారాన్ని క్రింద తెలుపబడింది నంబర్ కి ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా పంపించి నిరాశ్రయులైన కుటుంబాలకు మానవతా దృక్పధంతో సహాయం అందించండి.
గొంది.వెంకటరమణ
జాతీయ అధ్యక్షుడు,
ఆధార్ సొసైటీ.

 #లంబాడీల_గిరిజనేతరుల_భూములకు_కాపలా_కాస్తున్న_  #అటవీశాఖ_అధికారులు  #ఆగమైపోతున్న_ఆదివాసిల_బతుకులు  #కనికరంలేనిప్రభుత్వ_వ...
01/04/2022

#లంబాడీల_గిరిజనేతరుల_భూములకు_కాపలా_కాస్తున్న_ #అటవీశాఖ_అధికారులు
#ఆగమైపోతున్న_ఆదివాసిల_బతుకులు #కనికరంలేనిప్రభుత్వ_విధానాలు
#భూమికోసం #పేదప్రజలరక్షణకోసం #పోడుభూమివిముక్తికోసం #ఆధార్_సొసైటీ
#ఆధార్_సొసైటీ_రాష్ట్ర_అధ్యక్షుడు #కల్తీ_వీరమల్లు_గారు
ఎవడికో రోగం వస్తే పక్కోడికి వైద్యం చేసినట్లు, హరితహారం, అటవీ భూముల పరిరక్షణ పేరుతో ఆదివాసిల భూముల లాక్కొని వారిని నిరాశ్రయులను చేయడమే కాక, వారిని కనీసం ఏజెన్సీ హక్కుదారులుగా కూడా పరిగణించడం లేదు ఈ ప్రభుత్వం మరియు అటవీశాఖ అధికారులు. రాజ్యాంగం చట్టబద్ధంగా గుర్తించిన షెడ్యూల్డ్ ప్రాంతాన్ని నేడు మైదాన ప్రాంతాలుగా మార్చి అడవి మీద ఆధారపడి జీవించే ఆదివాసిలను వారి ఏజెన్సీ ప్రాంతం నుండి తరిమేసే పనిలో ఉంది ప్రభుత్వం. ఇలాంటి ఎన్నో అక్రమాలు కళ్ళముందు జరుగుతున్న మౌనం వహిస్తూ గిరిజనేతరులకు, లంబాడీలకు వత్తాసు పలుకుతున్న బూటకపు ఆదివాసి సంఘాలు. ఇప్పటి వరకు కూడా ఎన్నో గ్రామాల్లో ఆదివాసిలపై జరిగిన పోడు దాడి కంటే లంబాడీలపై కానీ, గిరిజనేతరుపై కానీ ఇప్పటికి చర్యలు తీసుకోకపోవడం అందరిని ఆశ్చ్చర్యం కలిగించే విషయం. వందల ఏళ్ళ నుండి అడవిని ఆధారంగా చేసుకొని నివసించే ఆదివాసిలకు లేని హక్కు గత 10 నుండి 15 సంవత్సరాలనుండి నివసిస్తున్న గిరిజనేతరుల మరియు లంబాడీల నుండి ఒక్క ఎకరం భూమిని కూడా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకోకపోవడం వారి స్వార్ధపూరిత సేవల అర్థాన్ని తెలియజేస్తుంది. వీటన్నినీటిని సవాలు చేస్తూ ఆధార్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు కల్తీ.వీరమల్లు గారు ఆదివాసిలను ఆదుకోవడానికి మేమున్నాము అంటూ వారికి పోడు భూమిసమస్యలపై పోరాటాలు చేస్తూ ఎన్నో వందల ఎకరాలు మళ్ళీ వారికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ( )మండల రెవెన్యూ అధికారులతో కుమ్మకై కొందరు గిరిజనేతరులు అసైన్డ్ భూములు మరియు అక్రమ పోడు భూములను కలిగి ఉన్నా లంబాడీలపై, గిరిజనేతరులపై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ( ) గారికి ఎన్ని పిర్యాదులు చేసిన ఇప్పటివరకు వారు తీసుకున్న చర్యలు శూన్యం. అక్రమంగా అడవిని నాశనం చేస్తున్నారు అని అమాయక ఆదివాసిలపై దౌర్జన్యంగా చర్యలు తీసుకుంటున్నారు అటవీశాఖ అధికారులు. ఇది నిజంగా అందరు ఆదివాసిలపై కావాలని చేస్తున్న కుట్రలా ఉందేతప్ప వారి మీద వారి మాట మీద ఎవ్వరికి కనీసం జాలి దయ లేదనే చెప్పాలి. ఇక పోరాటం చేయకపోతే వీరి ఆగడాలు ఆగవని ఎక్కడికక్కడే ఆధార్ సొసైటీ అమాయకుల భూమిని వారికి ఇప్పించేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో పాత్రధారులైన అటవీశాఖ అధికారులను, మండల రెవెన్యూ అధికారులను ఎవ్వరిని వదిలేది లేదని అక్రమార్కుల మీద కొరడా జులిపించింది ఆధార్ సొసైటీ. ఇల్లందు, ఆళ్లపల్లి, మర్కోడు, కారేపల్లి, సింగరేణి మండలాల నుండి దాదాపు రెండు వేల నుండి మూడు వేల మంది భూమి కోల్పోయిన బాధితులు ఆధార్ సొసైటీ అధ్యక్షుడు కల్తీ వీరమల్లు గారిని సంప్రదించగా మీకు అండగా ఆధార్ సొసైటీ ఉంటుంది. మీ భూములు మీకు అప్పగించేవరకు పోరుని ఆపేదిలేదని జిల్లా కలెక్టర్లకు, రాష్ట్ర కార్యదర్శులకు, ముఖ్యమంత్రి గారికి అందరికి నిజమైన అక్రమార్కుల గురించి లేఖ పూర్వఖంగా పిర్యాదు చేయడం జరిగింది. వచ్చిన వారిని లేదు కాదనకుండా తన సొంత వారీగా వారికి ఆశ్రయం ఇచ్చి భోజనాలు పెట్టి మరి వారి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు ఆధార్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు కల్తీ.వీరమల్లు గారు. వారితో పాటు ఆధార్ సొసైటీ నాయకులు కొమరం.ప్రసాద్ గారు, పోలెబోయిన.రామకృష్ణ గారు, ఈక. సులోచన గారు, చుంచ.బుచ్చయ్య గారు వారికి ప్రతి పనిలో సహకారం అందిస్తున్నారు. నిస్వార్ధంగా ఆధార్ సొసైటీ చేస్తున్న ఈ పోరాటంలో అన్ని ఆదివాసి సంఘాల నాయకులు కలిసి పోరాటం చేస్తే ఆదివాసిలకు పోడు భూముల సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. నిజమైన జాతి సేవకులుగా అందరికి అండగా ఉందాం.. మన ఆదివాసి జాతిని కాపాడుకుందాం...
జై ఆదివాసి. జై జై ఆదివాసి...

ఆధార్ సొసైటీ
తెలంగాణ & ఆంధ్రప్రదేశ్
#కల్తీ_వీరమల్లు_గారు #పోడుభూమివిముక్తికోసం #ఆధార్_సొసైటీ_రాష్ట్ర_అధ్యక్షుడు

 #శుభాకాంక్షలు    #సోయం_హరిణి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, వెంకటాపురం అనే ఒక మారుమూల కుగ్రామంలో జన్మించ...
29/03/2022

#శుభాకాంక్షలు #సోయం_హరిణి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, వెంకటాపురం అనే ఒక మారుమూల కుగ్రామంలో జన్మించి భద్రాచలంలోని గిరిజన గురుకులంలో ప్రాధమిక, జూనియర్ కాలేజీ విద్యను అభ్యసించి యావత్ ఆదివాసి జాతి గర్వించేలా రాష్ట్ర స్థాయిలో తెలంగాణ గిరిజన & సాంఘిక సంక్షేమ గురుకులాల డిగ్రీ ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించింది సోయం.హరిణి. ఈ విజయంతో ఎందరిలోనో స్ఫూర్తిని నింపింది. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది. తండ్రి సోయం.శ్రీనివాస్, రైతుగా వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తండ్రి కష్టాన్ని తీర్చి రేపు జీవితంలో ఉన్నత స్థాయిలో ఎదగాలని ఎక్కడ వెనుకడుగు వేయకుండా శ్రమిస్తోంది సోయం.హరిణి. ఈ విద్య కుసుమాన్ని ఆదర్శంగా తీసుకోని ఎన్ని అడ్డంకులు ఎదురైనా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి.
జై ఆదివాసి.. జై జై ఆదివాసి....

ఆధార్ సొసైటీ
తెలంగాణ & ఆంధ్రప్రదేశ్

        (TATA STEEL FOUNDATION) టాటా స్టీల్ ఫౌండేషన్ - ట్రైబల్ లీడర్షిప్ ప్రోగ్రాం (TRIBAL LEADERSHIP PROGRAMME -2022) ఆ...
10/03/2022


(TATA STEEL FOUNDATION) టాటా స్టీల్ ఫౌండేషన్ - ట్రైబల్ లీడర్షిప్ ప్రోగ్రాం (TRIBAL LEADERSHIP PROGRAMME -2022) ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఉత్సాహం ఉన్న ట్రైబల్ యువతీ యువకుల నుండి ధరఖాస్తులు (అప్లికేషన్స్) కోరుచున్నారు. ఉచితంగా నిర్వహించబడుతున్న ఈ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం లో పాల్గొనాలని ఉత్సాహం ఉన్న పురుష/మహిళ అభ్యర్థులు ఈ క్రింద తెలిపిన లింక్ ని క్లిక్ చేసి అప్లై చేయగలరు.
http://bitly.ws/oKpk
వివరాలకు బ్రోచర్ & పూర్తి వివరాల కోసం ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసి తెలుసుకోగలరు.
https://bit.ly/3pMVGaa
అర్హతలు: అభ్యర్థులు ఇంగ్లీష్ లేదా హిందీ వచ్చి ఉండాలి.
TLP, over 5 years, has brought together and learnt from almost 300 individuals from 76 tribes of India. And the quest to discover the batch of 2022 has now begun!
Brochures with more details are at https://bit.ly/3pMVGaa and those who are interested can register at http://bitly.ws/oKpk.
If you know someone who may be interested, please pass the word around. Write in to [email protected] or reach the numbers in the brochure for further conversation.
Applicants must belong to a tribal community, be between 20-35 years of age, and have a good working knowledge of Hindi or English.
Venue: Asia Plateau, Panchgani, Maharashtra.
For further details, do connect with
Ankita Toppo: +91 99559 24136
Neha Kumari: +91 83407 27806
Parth Sarthi: +91 83406 77281
Nruparaj Mahananda: +91 90786 15393

 #నిగర్వి,  #నిస్వార్ధ_సేవకుడు,  #దాన_కర్ణుడు, ఇలా ఎలాంటి అద్భుతమైన పదాలు వాడిన అవి మీకు సరితూగవనే చెప్పుకోవాలి. ఆదివాసి...
05/03/2022

#నిగర్వి, #నిస్వార్ధ_సేవకుడు, #దాన_కర్ణుడు, ఇలా ఎలాంటి అద్భుతమైన పదాలు వాడిన అవి మీకు సరితూగవనే చెప్పుకోవాలి. ఆదివాసి జాతికి మీరు చేసిన సేవ, చేస్తున్న సేవలను వర్ణించడానికి ఏ మాటలు వాడిన అవి తక్కువే అవుతాయి.. #మేలు_శిఖరం, #కీర్తి_కిరీటం, #ఆదర్శ_మూర్తి, #జాతి_స్ఫూర్తి_ప్రదాత, జాతి మేలుకోరే నిరంతర సేవ, ఇలా పదాల అల్లిక గ్రంధమే అవుతుంది. మీరు చేస్తున్న సేవలు, గుప్తంగా జాతికి చేస్తున్న దాన ధర్మాలు, తెగలుగా విడిపోయి కాదు తెగింపు నేర్చుకొని ఒక్కటిగా జీవిద్దాం అని ఆదివాసి జాతిని నిరంతరం చైతన్యం చేస్తున్న మీ మాటలు భవిష్యత్తులో ఖచ్చితంగా యువతకు, జాతి నాయకులకు మార్గనిర్దేశం అవుతాయి. ఆదివాసి జాతికి దొరికిన మేలిమి రత్నం మీరు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోని మరికొందరు నాయకులు ఎలాంటి భేషజాలకు లేకుండా జాతి సేవకై ముందుకు రావాలి. మన జాతి మీద మీకున్న అభిమానం, ప్రేమ, అందరిలో రావాలి. సహృదయంతో ఇది మన జాతి అని భావిస్తూ మును ముందు ఎందరో మీలాంటి మన్యం వీరులు పుట్టాలి. మీ తల్లి ఆదివాసీ జాతికి అందించిన అతి గొప్ప బహుమతి మీరు. మీరు చిరకాలం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సంతోషంతో జీవితు, అందరికి స్ఫూర్తి దాయకంగా ఉంటూ, ఎందరికో ఆదర్శం అవుతూ జాతి సేవలో మీరు ఇలాగె కొనసాగుతూ ఎందరో పోరాట వీరులను, చైతన్య యువతను తయారుచేయాలని ఆశిస్తూ... ఆదివాసి ఉద్యమ కెరటం, ఆధార్ సొసైటీ జాతీయ నాయకులు #గొంది_వెంకటరమణ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
ఇట్లు సదా మీ బాటలో పయనించే
ఆధార్ సొసైటీ, AEWCA, AMCS, ASF
నాయకులు, సేవకులు

#ఆదివాసి_ఉద్యమ_కెరటం #ఆదివాసి_నాయకుడు #గొంది_వెంకటరమణ

 #వందల_ఏళ్ళ_అణచివేత,  #వందల_ఏళ్ళ_నుండి_నిరాదరణ,  #వందల_ఏళ్ళ_నిర్లక్ష్యపు_ఆనవాళ్లు, వందల ఏళ్లుగా కుంటుపడిన అభ్యున్నతి,అన్...
28/02/2022

#వందల_ఏళ్ళ_అణచివేత, #వందల_ఏళ్ళ_నుండి_నిరాదరణ,
#వందల_ఏళ్ళ_నిర్లక్ష్యపు_ఆనవాళ్లు, వందల ఏళ్లుగా కుంటుపడిన అభ్యున్నతి,
అన్నింటిని సాధించడానికి వందల ఏళ్ళ పోరాటం కానీ ఇంకా అందని స్వేచ్ఛ...
ఆదివాసి అని అభివృద్ధికి దూరంగా ఉంచారు..
మూల నివాసి అని మరుగున పడేశారు...
అమాయకులం మేము, అనామకులం కాదు...
మనిషిగా మరిచారు, జాతిగా పక్కకు నెట్టేశారు....
మా సంస్కృతిని నాశనం చేశారు... సమాజానికి దూరంగా వెలేశారు...
#సంచారం_చేసే_బంజారా_నేడు_గిరిజనుడయ్యాడు..
ఆదివాసి మనిషిగా కూడా గుర్తించబడలేక పోతున్నాడు...
పౌరుషం ఉన్న ఆదివాసిలుగా ఇంకా మేము ఉన్నాం...
కనుమరుగవుతున్న నా జాతి చరిత్రను వెలికి తీసి వెలుగులోకి తెస్తాం...
ఆదివాసి అస్థిత్వాన్ని, కీర్తిని, విభిన్న సంస్కృతిని ఈ ప్రపంచానికి చాటి చెబుతాం..
అమాయకులమే... కానీ అనామకులం కాదు... ఆదివాసిలము మేము...
ఇది.. నా జాతి... మన జాతి... మన అస్తిత్వం....
జై ఆదివాసి - జై మూల నివాసి...

ఆధార్ సొసైటీ
తెలంగాణ & ఆంద్రప్రదేశ్
Cell: +91 8500741812

Aadhar (All Adivasi Development duly protecting Human Acts and Rights) Society is inviting you to a scheduled Zoom meeti...
25/02/2022

Aadhar (All Adivasi Development duly protecting Human Acts and Rights) Society is inviting you to a scheduled Zoom meeting.

Topic: Adivasi Swara Manjari - Session 5, Organized by Aadhar Society

Time: Sat, February 26, 2022, 7:00 PM Asia/Kolkata(GMT+5:30)

Join from a PC, Mac, iPad, iPhone or Android device:

Please click this URL to start or join. https://us02web.zoom.us/j/81242907932?pwd=dlJTc0xDV3A2ajllUnNTTkZ2QTdnZz09
Or, go to https://us02web.zoom.us/join and enter meeting ID: 812 4290 7932 and password: 886321

*ఆదివాసి స్వరమంజరి* - (సెషన్ -5)
ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో "ఆదివాసి స్వర మంజరి" నిర్వహిస్తున్నాము అని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా ఆదివాసి జానపద గాయకులని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి అనేదే ఆధార్ సొసైటీ లక్ష్యం. ఈ కార్యక్రమం AEWCA సంస్కృతి & నాగరికత బాధ్యులు డా.కే.వి.రమణ మూర్తి గారు, AMCS రాష్ట్ర అధ్యక్షులు డా.పద్మజ గారు నిర్వహిస్తారు. కావున ఈ స్వర మంజరి లో పాల్గొనే ఔత్సాహిక గాయకులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ పాల్గొనవలసిందిగా మనవి.
సూచనలు:-
1. గాయకులు మీ సెల్ లో Zoom App download చేసుకొని ఉండాలి.
2. ఆదివాసి సంస్కృతి & సంప్రదాయాలను ప్రతిబింబించే పాటలు మాత్రమే పాడలి. ఆదివాసి సంస్కృతి కి సంబంధం లేని పాటలు పాడినచో వారిని వెంటనే కాల్ నుండి తొలగించబడును.
3. సిగ్నల్ సరిగా ఉన్న ప్రదేశంలో ఉండి Zoom లో పాల్గొనాలి. సిగ్నల్స్ సరిగా లేకపోతే మీ వీడియో & పాట సరిగా శ్రోతలకు వినిపించవు, గమనించగలరు.
4. కార్యక్రమంలో పాల్గొనే గాయకులు, ప్రేక్షకులు అందరు తమ వీడియో Option ని Active చేసి ఉంచాలి.
5. మాట్లాడేవారు & పాట పాడేవారు మాత్రమే Unmute చేసుకొని ఉండాలి. మిగతవారు mute లో ఉండాలి. కార్యక్రమానికి ఏ విధంగానూ అంతరాయం కలిగించకూడదు.
6. గాయకులు మీ పేరు పిలిచిన తర్వాత మీ పరిచయం చేసుకుని మీ పాట నేపథ్యం చెప్పి అది ఆదివాసి జాతి నిర్మాణంలో ఎక్కడ, ఎలాంటి సందర్భంలో పాడారో వివరించి పాడగలరు.
7. పై సూచనలు పాటిస్తూ "ఆదివాసి స్వరమంజరి" కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతం చేయగలరని మనవి.

*ఆధార్ సొసైటీ*
తెలంగాణ & ఆంధ్రప్రదేశ్.

Address

Hyderabad
500044

Website

Alerts

Be the first to know and let us send you an email when AMCS - Adivasi Mahila Chaitanya Shakthi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to AMCS - Adivasi Mahila Chaitanya Shakthi:

Share

Category