AIFDS All India Federation Of Democratic Students

AIFDS All India Federation Of Democratic Students study....! struggle.....! success.......!

20/08/2026

ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరణ నుంచి కాపాడాలి!

ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి.

GO No.97ను వెంటనే రద్దు చేయాలి!

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను విలీనం చేయడాన్ని AIFDS తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

PPP విధానం పేరుతో ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం విద్యను ప్రైవేటీకరించే దిశగా వేసే ప్రమాదకరమైన అడుగు.

సాంకేతిక విద్యార్థులకు నైపుణ్యాలు అవసరమైతే —
🔹 కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలి
🔹 ఆధునిక ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి
🔹 పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణ అందించాలి
🔹 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను మరింత బలోపేతం చేయాలి

ఉన్న ప్రభుత్వ వ్యవస్థను బలహీనపరచడం పరిష్కారం కాదు!
✊ శక్తి స్కీమ్ వెనక్కి తీసుకోవాలి
✊ GO No.97ను రద్దు చేయాలి!
✊ PPP విధానాన్ని నిలిపివేయాలి!
✊ పాలిటెక్నిక్ కాలేజీల విలీనాన్ని ఉపసంహరించాలి!

ప్రభుత్వ విద్యను కాపాడుకుందాం —
విద్యార్థుల భవిష్యత్తును రక్షిద్దాం!

AIFDS తెలంగాణ రాష్ట్ర కమిటీ

19/07/2026

We strongly condemn the forcible shifting of Sonam Wangchuk from Jantar Mantar to Safdarjung Hospital without any dialogue or consultation. Such an action is a direct insult to a peaceful democratic protest.

Instead of engaging with the concerns raised by the protesters, the government has chosen to silence their voices. This is unacceptable in a democracy.

Sonam Wangchuk,Abhijeet dipke and sfi aisa aisf student representatives is not fighting for their personal interests or livelihood. He is standing up for the future of India’s students and demanding accountability in our education system. At a time when millions of students have lost hope due to repeated failures and irregularities, his movement has become a symbol of hope.

The government must not attempt to bulldoze the voice of students. History has shown that suppressing peaceful protests only strengthens public resolve. If you try to silence one voice, thousands more will rise across the country.

We urge Prime Minister Narendra Modi and Union Education Minister Dharmendra Pradhan to engage in meaningful dialogue with the protesters and take responsibility for the concerns being raised. The nation deserves accountability, transparency, and respect for democratic values.

Stand with students. Stand with democracy. Stand with Sonam Wangchuk.

ప్రచురణార్థం / ప్రసారార్థంతేది: 20-05-2026నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర న్యాయ విచారణ జరపాలిఎన్టీఏను రద్దు చేయాలి – వామపక్ష వ...
20/05/2026

ప్రచురణార్థం / ప్రసారార్థం
తేది: 20-05-2026

నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర న్యాయ విచారణ జరపాలి

ఎన్టీఏను రద్దు చేయాలి – వామపక్ష విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్

కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా మరోసారి వెలుగులోకి వచ్చిన నీట్ పేపర్ లీకేజీ ఘటన కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాల దారుణ వైఫల్యానికి నిదర్శనమని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శించారు. “ఒకే దేశం – ఒకే పరీక్ష” పేరుతో విద్యను కేంద్రీకరించడం వల్లే వరుసగా పరీక్షా అక్రమాలు, పేపర్ లీకులు, కోచింగ్ మాఫియా దందాలు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేసి స్వతంత్ర, పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాలకే ప్రవేశ పరీక్షల నిర్వహణ హక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి. నాగరాజు, పుట్టా లక్ష్మణ్, ఎస్. అనిల్, పొడపంగి నాగరాజు అధ్యక్షత వహించారు. సమావేశంలో విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ దేశంలో విద్యను పూర్తిగా కార్పొరేటీకరణ దిశగా నెట్టివేస్తున్న కేంద్ర ప్రభుత్వం, ప్రవేశ పరీక్షలను కేంద్రీకరించడం ద్వారా రాష్ట్రాల హక్కులను హరిస్తోందని విమర్శించారు. విద్యార్థుల ప్రతిభను కాకుండా కోచింగ్ కేంద్రాలకు వెళ్లే ఆర్థిక స్థోమతను మాత్రమే కొలిచే విధంగా నీట్ వ్యవస్థ మారిపోయిందన్నారు. వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలు, అవినీతి ఘటనలు ఎన్టీఏ వైఫల్యాన్ని పూర్తిగా బయటపెట్టాయని పేర్కొన్నారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పరీక్ష రాసిన విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడి, ఆందోళనలో ఉన్నప్పటికీ కేంద్రం కనీస బాధ్యత కూడా తీసుకోవడం లేదని విమర్శించారు. నీట్ పరీక్షను మళ్లీ ఎన్టీఏతో నిర్వహించడం అంటే బిజెపి ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని అన్నారు. రీ-నీట్ పరీక్షను పూర్తిగా స్వతంత్ర సంస్థతో నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ భారత రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన విద్యా హక్కులను కేంద్రం క్రమంగా హరించేస్తోందన్నారు. రాష్ట్రాల సామాజిక, భాషా, విద్యా పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష విధించడం అన్యాయమని పేర్కొన్నారు. గ్రామీణ, ప్రభుత్వ విద్యార్థులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటుండగా, కోచింగ్ మాఫియా మాత్రం వేల కోట్ల వ్యాపారం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలు పూర్తిగా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ దిశగా సాగుతున్నాయని అన్నారు. విద్యను ప్రజల హక్కుగా కాకుండా వ్యాపార వస్తువుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.

సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.వి. చలపతిరావు మాట్లాడుతూ ఎన్టీఏ నిర్వహిస్తున్న పరీక్షల్లో వరుసగా అవకతవకలు జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. పేపర్ లీకేజీల వెనుక ఉన్న కార్పొరేట్ కోచింగ్ మాఫియా, దళారుల నెట్‌వర్క్‌పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఎస్యూసిఐసి రాష్ట్ర కార్యదర్శి మురహారి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రతి సంవత్సరం పరీక్షల సమయంలో విద్యార్థులు అనిశ్చితి, ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురవుతున్నారని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడినా కేంద్రం స్పందించకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు.

అరుణోదయ తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు వైద్య విద్యను చేరకుండా చేసే విధంగా నీట్ వ్యవస్థ పనిచేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సమాన అవకాశాలు లేకుండా చేసే విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. తుంగ బాలు మాట్లాడుతూ నీట్ కారణంగా రాష్ట్ర విద్యా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని అన్నారు. రాష్ట్ర బోర్డు సిలబస్ చదివే విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో నీట్ బ్యాన్, ఎన్టీఏ రద్దు, కోచింగ్ మాఫియా అరికట్టడం, పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ, నిందితులను కఠినంగా శిక్షించడం, రాష్ట్రాలకు పరీక్షల నిర్వహణ హక్కు కల్పించడం, రీ-నీట్‌ను స్వతంత్ర సంస్థతో నిర్వహించడం వంటి డిమాండ్లతో పలు తీర్మాణాలు ఆమోదించారు.

ఈ తీర్మాణాలను ఎఐడీఎస్ఓ రాష్ట్ర నాయకులు నితీష్, ఎఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున, ఎఐపీఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. కుమార్, జార్జీరెడ్డి పీడీఎస్‌యూ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ స్వాతి, పీడీఎస్‌ఓ (విజృంభణ) రాష్ట్ర కార్యదర్శి ఎ. విజయ్, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు గణేష్ ప్రవేశపెట్టారు.

దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, విద్యావేత్తలు నీట్ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని సమావేశం పిలుపునిచ్చింది. విద్యను కేంద్రీకరించే, కార్పొరేటీకరణ చేసే విధానాలను నిలువరించేందుకు ప్రజాస్వామిక శక్తులు ఐక్యంగా పోరాడాలని సమావేశం పేర్కొంది.

ఈ సమావేశంలో ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె.మణికంఠ రెడ్డి, పి.డి. ఎస్.యు. రాష్ట్ర అధ్యక్షుడు కె.పృధ్వీ, పి.డి. ఎస్.యు. రాష్ట్ర అధ్యక్షుడు పి. మహేష్,ఎ.ఐ.ఎఫ్.డి.ఎస్. రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళీ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షులు దామెర కిరణ్, కె.అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్, నాయకులు నాగేందర్, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,గ్యార నరేష్,రెహమాన్, క్రాంతి, రాష్ట్ర నాయకులు చైతన్య, పయాజ్,పి.డి.ఎస్.యు. రాష్ట్ర నాయకులు హారీష్, ధరణి, అశ్వనీ, ఎ.ఐ.ఎఫ్ .డి.ఎస్ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు రిషిక్, ప్రసాద్, జాస్మిన్ తదితరులు పాల్గొన్నారు...

ధన్యవాదములతో....
వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ

*For Press Publication*  *Date: 16/04/2026*Today, a broad-level meeting with students was held under the aegis of the Al...
16/04/2026

*For Press Publication*
*Date: 16/04/2026*

Today, a broad-level meeting with students was held under the aegis of the All India Federation of Democratic Students (AIFDS) at Tandra Ramachandraiah Bhavan, Mujaffer Ahmednagar, presided over by Comrade M Sreekanth. The state president of the organisation, _P***e Murali_, attended as the chief guest and inquired about the problems being faced by students.
Speaking on the occasion, he expressed anguish that due to the government not releasing fee reimbursement on time, many students, even after completing their degrees, are unable to obtain their certificates and are forced to work as Swiggy and Zomato delivery boys in Telangana. He demanded that the government immediately release the fee reimbursement.

Afterwards, the new committee for Greater Hyderabad was announced.

*New Committee - Greater Hyderabad:*
- *Secretary*: Muthannagari Sreekanth
- *President*: G. Arun Kumar
- *Working President*: Sai Yadav
- *Vice President*: Prashanth
- *Assistant Secretary*: S. Eshwar Reddy
- *Social Media Convener*: Naveen Yadav
- *Treasurer*: J.D. Ganesh

*Committee Members:* Praveen, B. Rishik, S. Sriram, A. Vivek, P. Sai, Jasmine Raj, Durgaprasad

Addressing the new committee, Youth State Secretary _Vanam Sudhakar_ called for struggles against the exploitation happening in education, to question governments that are weakening public education, and to work towards strengthening government education.

Students from various areas and Youth Wing State Vice President _Islavath Dasarath Naik_ participated in this program.

⚕️ ప్రైవేట్ మెడికల్ కళాశాలల పీజీ,హౌస్ సర్జన్ విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వాలని,ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్టైఫండ్ ఇవ్వ...
12/03/2026

⚕️ ప్రైవేట్ మెడికల్ కళాశాలల పీజీ,హౌస్ సర్జన్ విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వాలని,ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్టైఫండ్ ఇవ్వకుండా,దగా చేస్తున్న ప్రైవేట్ మెడికల్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని వైద్య ,ఆరోగ్య, మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి విద్యార్ధి, యువజన సంఘాల ఆధ్వర్యంలో వినతి.

Revolutionary congratulations to the elected president secretaries, committee members  in AIFDS Andhra Pradesh First Sta...
06/12/2025

Revolutionary congratulations to the elected president secretaries, committee members in AIFDS Andhra Pradesh First State Confress meeting.

అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య [AIFDS] ప్రథమ రాష్ట్ర మహాసభలు కర్నూలు జిల్లాలో కేంద్రంలో రెండవ రోజున సంబంధించిన ద...
06/12/2025

అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య [AIFDS] ప్రథమ రాష్ట్ర మహాసభలు కర్నూలు జిల్లాలో కేంద్రంలో రెండవ రోజున సంబంధించిన దృశ్యాలు

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when AIFDS All India Federation Of Democratic Students posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share