15/03/2022
*బహుజన రాజ్య స్థాపన కై మాదిగల విద్యార్థులు సిద్దం కావాలి*
- *MSF- TS*
పెరియార్ రామస్వామి నాయకర్,నారాయణ గురు,పూలే అంబేద్కర్ ప్రబోధాలను రాజ్యాధికారం వైపు నడిపి దేశంలో అత్యధిక శాతం ఉన్న బహుజనులు ఎస్సీ, ఎస్టీ ,బిసి, మైనార్టీలకు రాజ్యాధికారాన్ని రుచి చూపించిన మాన్యశ్రీ కాన్షీరామ్ గారి 88 వ జయంతి కార్యక్రమాన్ని MSF ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు ఎల్ నాగరాజు అధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లో ఘనంగ జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MSF రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ #చందువరిగడ్డి మాట్లాడుతూ... మాన్యశ్రీ కాన్షీరామ్ గారు ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తున్నప్పటికీ కుల వివక్షతను ఎదుర్కున్నాడు అని అన్నారు, తర్వాత ఆయన అంబేద్కర్ గురించి, కులం గురించి దళితుల గురించి, దోపిడీ వ్యవస్థ గురించి పూర్తిగా అధ్యయనం చేసి దేశంలో అత్యధిక శాతం ఉన్న బహుజనులకు రాజ్యాధికారాన్ని అందిస్తేనే బహుజనులకు న్యాయం జరుగుదని నమ్మి రాజ్య స్థాపన కోసం నిరంతరం పనిచేశాడు,
ఈయన బహుజన సమాజ్ పార్టీ నిర్మాత, రామదాసియ సిక్కు కులస్తులైన తెల్సింఘ్,బిషన్ సింఘ్ కౌర్ లకు మార్చి 15,1934 లో పంజాబ్ రాష్ట్రంలో రోపర్జిల్లా కావస్ పూర్ గ్రామంలో జన్మించాడు, ఈయన జ్యోతిబా పూలే ఛత్రపతి సాహు మహారాజ్ నారాయణ గురు అంబేద్కర్ సిద్ధాంతాలను రాజ్యాధికారం వైపు మళ్లించి విజయం సాధించాడు,
తన 31 వ ఏటనే అంబేద్కర్ ప్రబోధించిన *కుల నిర్మూలన* ద్వారా ప్రేరేపితం అయ్యాడు
తన తల్లికి 30 పేజీల ఉత్తరం రాస్తూ *ఇకనుంచి నేను కుటుంబ బాంధవ్యాలను తెంచుకుంటున్నాను, నా కోసం మీరు వెతక వద్దు అంటూ బయటకు వెళ్లి చనిపోయేవరకు తిరిగి ఇంటికి వెళ్ళలేదు* 1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాడు బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించినాడు
*ఒక ఓటు ఒక నోటు నినాదంతో* ప్రజల దగ్గరకు వెళ్లి వారిచ్చే డబ్బులతోనే ప్రచారం చేశాడు కులాన్ని నిర్మూలిద్దాం బహుజన సమాజాన్ని నిర్మిద్దాం అంటూ దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాడు
*నువ్వు 85 శాతం ఉండగా 15 శాతం మీద ఎందుకు ఆధారపడతారు నడుము పార్లమెంట్కి, అసెంబ్లీకి నీ కాళ్ళ మీద నిలబడు అంటూ బహుజనులను ఉసిగొల్పాడు*
పంజాబ్ ,ఢిల్లీ హర్యానా, కాశ్మీర్, బీహార్ ,ఉత్తరప్రదేశ్ లో ఇతర కులాలను కలుపుకుని పార్టీని బలోపేతం చేసి మాయావతిని ముఖ్యమంత్రి ఏం చేశాడు ప్రారంభమైన 1984 లో ఏర్పడిన బిఎస్పి పార్టీ అనేది 1996నాటికి జాతీయ పార్టీగా ఎదిగింది,2006అక్టోబర్ 09న పరమదించాడు,అతను బ్రతినంతకాలం బహుజనుల కే రాజ్యాధికారం వుండాలని కోట్లాడిన కాన్సిరం గారి ఆశయాలను సాధించడానికి మాదిగ విద్యార్థులుమా సిద్దంగా వుండాలని పిలుపునిచ్చాడు
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ నాయకులు జోగు దశరథ్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చాగంటి రాజేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలేష్ ,శ్రీకాంత్ ,ఆల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ జీవన్, హైదరాబాద్ అధ్యక్షులు సురేష్, ఓయు వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్, ప్రధాన కార్యదర్శి దశరథ, నాయకులు కార్తీక్, వెంకటేష్, దీప్తి గీత, సుహాసిని తదితరులు పాల్గొన్నారు