AV9 News

Call Website Contact the organization

AV9 News నిజం మా బలం - సమ సమాజం మా లక్ష్యం..

AV9 News Telugu - సమ సమాజ స్థాపన కోసం.
ప్రజలతో.. ప్రజల కోసం.. ప్రజల గొంతుకగా.
🎙️ ప్రజా సమస్యలకు ప్రాధాన్యత
⚖️ నిజం, న్యాయం మరియు సమానత్వం కోసం
🌍 సమాజ మార్పు కోసం బాధ్యతాయుతమైన మీడియా

నేడు ( 12/10/2025)ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్,ఓయూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అంగరి ప్రదీప్ గారికి  మరియు వారి కుటుంబ సభ...
13/10/2025

నేడు ( 12/10/2025)ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్,ఓయూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అంగరి ప్రదీప్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారు, వర్ధన్నపేట శాశనసభ్యులు శ్రీ నాగరాజు కార్పన్ గారు,తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ శ్రీ రిక్క లింబద్రి గారు,ఏంజె హాస్పిటల్ అధినేత డాక్టర్ మధు శేఖర్ గారు, తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ గారు,,తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ అలుక కిషన్ గారు అంగరి ప్రదీప్ కుటుంబాన్ని పరామర్శించారు..

అంసా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అంగరి ప్రదీప్ గారి తల్లి శ్రీమతి అంగరి లక్ష్మీ గారు ఇటీవల మృతి చెందగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి మరియు ఎమ్మెల్యే నాగరాజు గారు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం సుర్బీ ర్యాల్ లోని వారి నివాసానికి వెళ్లి సంతాపం తెలిపారు

ఈ సందర్భంగా అంగరి లక్ష్మీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి.ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని వారికి ధైర్యం చెప్పారు

కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొని అంగరి లక్ష్మీ గారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.

పత్రికా ప్రకటననేడు ఆర్మూర్ లోని అంబేద్కర్ చౌరస్తాలో ఆర్మూర్ డివిజన్ మాల మహానాడు ఆధ్వర్యంలో మాల అమరవీరుల సంస్మరణ దినోత్సవ...
12/08/2025

పత్రికా ప్రకటన
నేడు ఆర్మూర్ లోని అంబేద్కర్ చౌరస్తాలో ఆర్మూర్ డివిజన్ మాల మహానాడు ఆధ్వర్యంలో మాల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మాల మహానాడు డివిజన్ అధ్యక్షులు మాదరి రాజన్న ట్రెజరర్ పులి గంగాధర్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి శెట్టిపల్లి నారాయణ,జిల్లా ఉపాధ్యక్షులు పింజా పెద్ద భోజన్న,ఎం కోటేశ్వరరావు,చిట్టిమాల నగేష్ లు పాల్గొని 1997 ఆగస్టు 11న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన పానంగి శేషయ్య, గోపతోటి నారాయణ,ల వీరోచిత పోరాట స్ఫూర్తిని కొనియాడి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అనంతరం డివిజన్ ప్రెసిడెంట్ మాధరి రాజన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం ప్రకారం మాల మాల అనుబంధ కులలకు తీవ్రంగా నష్టం జరుగుతుందని, ఎస్సీ వర్గీకరణ వల్ల కేవలం ఒక కులానికి మాత్రమే న్యాయం జరిగి మిగతా ఎస్సి కులాలకు పూర్తిగా అన్యాయనికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో మాల అమరవీరుల పోరాట స్ఫూర్తితో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, మాలలతో పెట్టుకున్న గత ప్రభుత్వాలు ఏ విధంగా అధికారానికి దూరం అయ్యాయో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పై పునః సమీక్షించకుంటే రాబోయే రోజుల్లో మాలలను కూడగట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు
ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు రొడ్డ సాయన్న తలారి సుదర్శన్ నర్సయ్య జీవన్ అంగరి ప్రదీప్ లు పాల్గొన్నారు

Address

Osmania University

500007

Alerts

Be the first to know and let us send you an email when AV9 News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to AV9 News:

Shortcuts

  • Want your organization to be the top-listed government service?

Share