29/05/2026
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి వేడుకలను దాచేపల్లి టౌన్ లోని విజయభాస్కర కళ్యాణ మండపం (04వ క్లస్టర్) నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీ జంగా కృష్ణమూర్తి గారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, "పేదల పెన్నిధి, సంక్షేమ సారథి" అయిన ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు.
ఈ వేడుకల అనంతరం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న రెండవ రోజు 'మహానాడు' కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలుగువారి ఖ్యాతిని, ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన అన్న నందమూరి తారక రామారావు గారి సేవలను, ఆయన ప్రాముఖ్యతను కొనియాడారు. అలాగే 44 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయాలను, ప్రజలకు చేకూర్చిన సంక్షేమాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
Yarapathineni Srinivasarao