Telugu Professionals Zone 3

Telugu Professionals Zone 3 TDP Guntur Parliament

28/05/2026

సమాజమే దేవాలయం - పేద ప్రజలే దేవుళ్ళు..అన్న మీ మాటలే మాకు శిరోధార్యం..మీ స్పూర్తితో ముందుకుసాగుతాం.. మీ ఆశయాలను కొనసాగిస్తాం....ప్రజాసేవలో పునరంకితం అవుతాం....విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ *శ్రీ నందమూరి తారక రామారావు గారి* జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు.
💐💐💐🙏🏼

19/05/2026

భారతదేశంలో పార్లమెంట్ సభ్యునికి (MP) లభించే ప్రయోజనాలు.

1. మూల వేతనం - నెలకు రూ. 1,24,000.

2. ఫోన్ మరియు ఇంటర్నెట్ వినియోగం - సంవత్సరానికి రూ. 1,50,000.

3. సంవత్సరానికి 34 ఉచిత దేశీయ విమాన ప్రయాణాలు.

4. ఉచిత ఫస్ట్-క్లాస్ రైలు ప్రయాణం.

5. సంవత్సరానికి 50,000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.

6. సంవత్సరానికి 4,000 కిలోలీటర్ల ఉచిత నీటి సరఫరా.

7. కార్యాలయ భత్యం - నెలకు రూ. 75,000.

8. గృహవసతి - అద్దె లేని వసతి.

9. పింఛనుకు అర్హత: నెలకు రూ. 31,000.

10. ఎంపీకి మరియు కుటుంబానికి ఉచిత వైద్య సంరక్షణ.

👌👌👌
17/05/2026

👌👌👌

16/05/2026

AP Fiber Net ని గాలికొదిలేసిన ప్రభుత్వం..

2 రోజులుగా నిలిచిపోయిన ప్రసారాలు..

ఎప్పుడు వస్తుందో తెలియక MSO లని బూతులు తిడుతున్న వినియోగదారులు..

మెయింటెయిన్ చేతకానప్పుడు ప్రయివేట్ వ్యక్తులకి ఇస్తే గాడిలో పడుతుంది కదా..

గాడి తప్పిన వ్యవస్థని ప్రక్షాళన చేయాలని చూసిన GV రెడ్డి గారిని సాగనంపి సాధించిన ప్రగతి ఇదేనా..!!

15/05/2026

*పల్నాడు జిల్లాలో AMRపై రైతుల ఆగ్రహం..!*

*చిలకలూరిపేట నియోజకవర్గం సాతులూరులో ఉద్రిక్త పరిస్థితులు.*

*పొలాల్లో మట్టి తీసుకుంటున్న రైతుల ట్రాక్టర్లను నిలిపివేసిన AMR సిబ్బంది.. సెస్ చెల్లించాలని కోరడంపై రైతుల తీవ్ర నిరసన.*

*“సొంత పొలంలో మట్టి తీసుకుంటే సెస్ ఎందుకు?” అంటూ రైతుల ప్రశ్నలు.. రంగంలోకి దిగిన పోలీసులు, మైనింగ్ అధికారులు.*

*ఫిర్యాదు స్వీకరించి, మట్టి తవ్వకాలకు అనుమతించడంతో తాత్కాలికంగా సద్దుమణిగిన వివాదం.*

*రైతుల పక్షాన నిలిచిన అధికార పార్టీ నేతల వ్యవహారం చర్చనీయాంశం.*

👌👌👌
14/05/2026

👌👌👌

గుంటూరులో ఎండిపోతున్న మొక్కలు.. చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలుగుంటూరు నగరంలో రహదారి డివైడర్లు, జంక్షన్లు, పార్కుల పరిసరాల...
14/05/2026

గుంటూరులో ఎండిపోతున్న మొక్కలు.. చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు
గుంటూరు నగరంలో రహదారి డివైడర్లు, జంక్షన్లు, పార్కుల పరిసరాల్లో నాటిన అనేక మొక్కలు సరైన సంరక్షణ లేక ఎండిపోతున్నాయి. లక్షలాది రూపాయలతో చేపట్టిన పచ్చదనం కార్యక్రమాలు నీటి సరఫరా, నిర్వహణ లోపాలతో విఫలమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
______________
కలెక్టర్ గారు, అఫీషియల్స్ తిరిగే ఏరియాలో మాత్రమే మెయింటెనెన్స్ చేస్తున్నారు.

మిగతా చోట అంత మాయ చేస్తున్నారు..
అసలు వెళ్లిపోయిన అధికారి మళ్లీ ఎందుకు వచ్చారు..

జీతం తీసుకోకుండా ప్రకృతి పై మేము ప్రేమ చూపిస్తున్నాం..
మరి హార్టికల్చర్ అధికారులు జీతాలు తీసుకొని మరి మొక్కలపై నిర్లక్ష్యం చూపిస్తున్నారు.
________________

08/05/2026

రైతు సోదరులారా నమస్కారం. మాది సాతులూరు గ్రామం. నాదెండ్ల మండలం. చిలకలూరిపేట నియోజకవర్గం.

పార్టీపరంగా ఆలోచించి సహనంతో వున్నాము. తెలుగుదేశం అధికారంలో లేనప్పుడు / చంద్రబాబుగారు జైళ్ళో వున్నప్పుడు పార్టీ తరఫున సోషల్ మీడియాలో ధైర్యంగా ఎన్నో పోస్టులు పెట్టాము.
పార్టీ అధికారంలోకి రాగానే పరిస్టితులు చూసి చాలా భాధ కలుగుతుంది.

జగన్ గారి గవర్నమెంటులో వాలంటీర్స్ వచ్చి మానాన్నగారికి గానీ అమ్మగారికిగానీ వృద్ధాప్య పు ఫించన్ తీసికొమ్మని అడిగినా సున్నితంగా తిరస్కరించాము.
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే జగన్ గారి గవర్నమెంటులో ఏ మాత్రం ఇబ్బ 0ది లేకుండా మేము అడిగినన్ని మ0దు కట్టలు ఇచ్చి ఉన్నారు. శనగలు మా ఊరిలోనే జల్లెడలు పట్టుకొని గవర్నమెంటు తరఫున ప్రతి రైతు దగ్గర మొత్తం కొనుగోలు చేశారు.

కానీ ఇప్పటి పరిస్థితి చూడండి. రైతు సోదరులారా! నేను 20 ఎకరాలు సేధ్యం చేస్తున్నాను. నాకు ఒక్క కట్ట యూరియా కూడా ఇవ్వలేదు. 40 కట్టలు 20:20 మాత్రము ఇచ్చారు.

సరే పండిన పంట అయినా గవర్నమెంటుకు అమ్ముకోవాలని ఆలోచనతో శనగ పంట ఈ క్రాప్ చేయించుకోన్నాము. ఈ క్రాప్ చేయించటానికి ఎంత విసిగిపోయా మొ చెప్పాలంటే అదొక స్టోరీ అవుతుంది.
ఈ క్రాప్ చేసే రమేష్ అనే అతను చాలా రిస్కు తీసికొని నెల రోజులు చేలల్లోనే తిరుగుతూ ప్రతి రైతు కష్టపడి ఈ క్రాప్ చేసి పెట్టాడు.
కానీ శనగల కొనుగోలును MLA పుల్లారావు గారు ఒక నాయకుడు గారికి అప్పచెప్పారు. ఆ పేరు వినగానే మా ఊరి వాళ్ళం అంతా భయ పడ్డాము. మేము భయపడ్డ ట్టే జరిగినది. ఈయనగారి సోస్తిటీలో ఒక్క కట్ట యూరియా సంపాదించలేక పోయామే / ఇ క శనగలు అమ్ముకోవటం సాధ్యమా?
ఊరిలో మారు బేరానికి కొని అమ్ముకోనే నవర్నమెంటు రైతుల వి నలుగురి సరుకు మాత్రం కొనుగోలు చేసి ఇండింట్ అయిపోయిందని కొనుగోలు ఆపివేశారు. నిజంగా కష్టపడి పండించిన రైతుల శనగలు ఒక్కక్కింటా కూడా కొనలేదు.
ఇదేమి అన్యాయం అని అడిగితే సమాధానం చెప్పిన నాయకుడు లేడు.
నేను పండించిన 220 క్కింటాళ్ళకుగాను ఒక పేరు మీద 40 క్రింటాళ్ళు అమ్ముకునే అవకాశం ఇచ్చారు. అది కూడా జనసేన పార్టీ రంగిశెట్టి మల్లీశ్యరరావు పేరు చూసి పిలిచారు. అతని పేరుమీద 40 క్కింటాళ్ళు అతని అనుమతితో నేను అమ్ముకోవటం జరిగినది. ఈ కాసిని అమ్ముకోవటానికి మేము పడ్డ బాధ చెప్పుతాను వినండి.
ట్రాక్టరుకు 40 క్కింటాళ్ళు లోడ్ చేసుకొని నాదెండ్ల వెళ్ళాము. నాదెండ్లలో ఉదయం పదిగంటలకు పూర్తిగా చెకింగ్ చేశారు. ట్రాక్టరు ఎదురుగా ఖైదీని నిలబెట్టినట్లు నిలబెట్టి ఫోటోలు తీసారు. ఇక కాగితాలు చెకింగ్ చేశారు. ఈ చెకింగ్ లో గెలవటానికి మరలా ఒకసారి సాతులూరు రావలసి వచ్చింది.. ఆ సోదంతా మీకు చెప్పలేను. చెకింగు లన్నీ అయిపోయిందాకా చేతులు కట్టుకొని వారు చెప్పినదంతా విన్నాము. మా వల్ల ఏమీ తప్పులు లేవని వాళ్ళు త్రప్తి పడి అప్పుడు 80 గోతాలు ఇచ్చారు.
ఈ 80 గోతాలు తీసికొని దేవుడికి దణ్ణం పెట్టుకొని వారు చెప్పిన డీస్టోన్ మిల్లుకు చిలకలూరిపేట వెళ్ళాము.
ఇక డి స్టోన్ వద్ద భాధలు రాయాలంటే చేట భారతం అవతుంది. ఆ ఎండలో విపరీతమైన దుమ్ములో ఎదురుచూస్తూ చతికిలపడ్డాం.

ఈ రోజు మేము పోయ లేము. రేపురండి అని డిస్టోన్ ఒనరు రాత్రి 10 గంటలకు చావు కబురు చల్లగా చెప్పాడు. ట్రాక్టరు అక్కడ నే వదిలి రాత్రి 12 గంటలకు మా ఊరు చేరాము.
మరలా ఉదయం 9 గంటలకు వెళ్ళిగా ఆడీ స్టోన ఓనర్ దయామయుడు మమ్మల్ని కరుణించి డిస్టోన్ పోసి క్కింటాకు 150 వసూలు చేశాడు.
క్కింటాకు 90 రూపాయ లేకదా అని అడిగాము దానికి ఆయన.. మీరు పర్శనల్ గా వచ్చి పోయించుకొంటే 90 మాత్రమే. గవర్నమెంటుకు కాబట్టి 150 తీసుకో౦టున్నాము. మీకు తెలియందేముంది? మాకష్టం మేము ఉంచుకొని మిగిలింది మీ వాళ్ళకే ముట్టి చెప్పాలి కదా! మేము ఏం చేస్తాం చెప్పండి అన్నాడు. మీరు పర్శనల్ గా వస్తే 90 రూపాయలకు పోసి పెడతానని, వేరే చోటకు వెళ్ళవద్దని ప్రదేయపడ్డాడు.

ఎలాగోలాగా ఒక్క 40 క్కింటాళ్ళు ఒక్క పేరు మీద అమ్మటానికి రెండు రోజులు కంటిమీద కునుకు లేదు.
గతం గుర్తుకు వచ్చింది. వైసిపి నాయకుడు గద్దె
కోటయ్య ప్రతి రైతు ని అడిగి ఇంట్లో పది క్కింటాళ్ల ఉన్న రైతుకు కూడా గవర్నమెంటుకు అమ్ముకోనీ దానికి సహాయపడ్డ ఘటన గుర్తుకు వచ్చి సిగ్గుపడ్డాము. తెలుగుదేశం రైతుల మైన మమ్మల్ని కూడా గవర్నమెంటుకు అమ్ముకోనేట్లు చేసి చిలకలూరిపేట యార్డులో 'మేము వద్దన్నా వినకుండా మమ్మల్నందరినీ తీసికెళ్ళి భోజనాల చేసిందాకా వదిలిపెట్టలేదు.
ఇక్కడ ఇంకొక విషయం గమనించండి. నాకు సొంత టాక్టరు కాబట్టి వెయిటింగ్ 2 రోజులు ఇబ్బంది లేదు. మరి బాడుగ టాక్టర్ లో సరుకు తెచ్చుకొన్న రైతు బాధ మరిఘోరం.

అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనిస్తే పుల్లారావుగారికి అనుకూలమైన ఇద్దరు ముగ్గురు రైతులు మాత్రం వారి సొంత సరుకే గాక క్కింటా 4800 మీద కొనుగోలు చేసినవర్నమెంటుకు 5875 చేసి మా కళ్ళ ముందే అమ్ముకొని మమ్మల్ని హేళనగా చూశారు.
ఆన్లైన్ లో అదేమి విచిత్రమో కానీ వారి పేర్లు మాత్రమే వరుసగా వచ్చినవని చెప్పారు. ఇందులో మోసమేమీ లేదని అన్నారు.
వారి కన్నా వారం ముందు బుక్ చేసిన మా పేర్లు రాకుండా వారి పేర్లు ఎలా ముందుగా వరసగా వచ్చామో మాకు ఇప్పటికీ అర్ధం కాలేదు.

ఇంకా ఆశ్చర్యమేమంటే !క్షమించండి రాయటానికి నాకే ఛీదర పుడుతుంది. సిగ్గుగా కూడా ఉంది.
ఈ పోస్టు గురించి నాకు కలుగబోయో భాధలు భరించటానికి సిద్దపడి దైర్యంగా ప్రశ్నిస్తునాను. రైతు సోదరులారా ఆలోచించండి మనం ఏం చేద్దాం.
పైన చంద్రబాయిగారు, లోకేషగారు మనగురించి ఎంత శ్రమపడుతున్నారో రోజూ చూస్తునే ఉన్నారు.

రాజధాని పనులు చూస్తుంటే కళ్ళు తిరిగి పోతున్నవి. రోజుకు 30,000 నుంచి 60,000 మంది కూలీలు రాత్రింబగళ్ళు రాజధాని నిర్మాణం గురించి కష్టపడుతునారు.
కానీ క్రింద గ్రౌండ్ లెవెల్ లో ఏ మాత్రం రైతులకు న్యాయం జరుగుటలేదు. ఈ పోస్టు పైన అధిష్టానం
దృష్టికి లోకేష్ గారికి చేరేటట్లుగా షేర్ చేయండి.
నరనరాన తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ నరనరాన జీర్ణించుకోని మరో ఆలోచన లేకుండా పార్టీకి స్టాంపింగ్ గా ఓట్లు వేసే మాకే నోటాకు ఓటు వేయాలని ఆలోచన కలుగుతుందంటే, ఒక్కసారి గ్రామీణ తెలుగుదేశం నాయకులారా మీ ఇగోలని ప్రక్కన పెట్టి పార్టీని బ్రతికించమని రైతులందరం వేడుకొంటునాము.

-gottipati Srinivasarao

04/05/2026

కార్యకర్తలను దూరం చేసుకుంటే పుట్టగతులు ఉండవు
ఏ పార్టీకైనా కానీ

Address

Guntur
522006

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Professionals Zone 3 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share