KAPU SRINIVAS

KAPU SRINIVAS https://youtube.com/?si=iYeB7fkCqzMynil8
� సబ్ స్క్రయిబ్ చేయండి
(1)

వలసలకు మతం ఎక్కడిది?ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఇప్పుడు ఒక నినాదం ఎక్కువగా వినిపిస్తోంది.ప్రధానపార్టీల్లో కొన్ని ఆ నినాదం...
02/06/2026

వలసలకు మతం ఎక్కడిది?

ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఇప్పుడు ఒక నినాదం ఎక్కువగా వినిపిస్తోంది.ప్రధానపార్టీల్లో కొన్ని ఆ నినాదం చుట్టూనే రాజకీయాలను నడుపు తున్నాయి. ప్రజల్లో ఉద్వేగాలనూ శత్రుత్వ భావనలనూ రెచ్చగొట్టి అధికారం లోకి వచ్చిన జనాకర్షక నాయకులందరూ ఆ నినాద మంత్రాన్నే జపించారు. అధికార పీఠాన్ని అందుకోటానికి తహతహలాడుతున్న నేతలూ అదే అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమికొడతామన్నదే ఆ నినాదం.

వ్యక్తీకరణలో ఎన్ని తేడాలైనా ఉండొచ్చు.. కానీ సారాంశంలో మాత్రం వలసదారుల లక్ష్యంగానే రాజకీయ ప్రచారం ఊపందుకుంటోంది. దీనికి ఏ ప్రజాస్వామ్య దేశమూ మినహాయింపు కాదు.అన్ని ప్రజాస్వామ్య దేశాలకూ బయట నుంచి వచ్చే వలసల సమస్య తీవ్రమవుతూ ఉంది. దీన్ని కాదనలేం.

ఉద్యోగాలు, ఉపాధికోసం వచ్చే సక్రమ వలసలను బాగా తగ్గించాలనే డిమాండు ఒకవైపు ఉంటే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపాలనే లక్ష్యం కొన్నిచోట్ల విపరీత పోకడలు పోతోంది.అమానవీయంగా తయారవుతోంది. ఇటీవల జరిగిన బెంగాల్‌, అసాం అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమ వలసల సమస్యే బీజేపీకీ ప్రధాన ప్రచార ఆయుధంగా మారింది.

బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వస్తోన్న ముస్లింలతో బెంగాల్‌, అసాంల్లో జనాభా ముఖచిత్రం మారిపోతోందన్న ప్రచారానికే అది పరిమితం అవ్వలేదు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోకీ అక్రమ వలసదారులు చొచ్చుకుపోతున్నారనీ అనేకచోట్ల స్థానికుల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నారనీ ఆరోపించింది. ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతోందనీ సాక్షాత్తూ కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోటానికి మే 26న ఒక ఉన్నత స్థాయి కమిటీని (హైలెవల్‌ కమిటీ ఆన్‌ డెమొగ్రాఫిక్‌ చేంజ్‌) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఒక సంవత్సరంలోపు నివేదికను ఇవ్వాలని ఆ కమిటీకి నిర్దేశించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రకాశ్‌ ప్రభాకర్‌ నావ్లేకర్‌ చైర్మన్‌గా ఏర్పాటైన ఆ కమిటీలో మరో నలుగురు సభ్యులు ఉన్నారు. అందులో భారత జనగణన కమిషనర్‌ కూడా ఒకరు.

విచిత్రం ఏమిటంటే కమిటీ చైర్మన్‌కు జనాభాలో వచ్చే అనేక రకాల మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేసే డెమొగ్రఫీ వ్యవహారంతో అంతకుముందు పెద్దగా పరిచయం లేదు. మధ్యప్రదేశ్‌లో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న తనను ఉన్నతస్థాయి కమిటీకి చైర్మన్‌గా ప్రకటించటం ఆశ్చర్యం కలిగించిందని ఆయన వ్యాఖ్యానించినట్లు ‘ద హిందూ’ పత్రిక పేర్కొంది. కమిటీలో ఉన్న మిగతా ముగ్గురు కూడా (జనగణన కమిషనర్‌ మినహా) జనాభా అధ్యయన శాస్త్రంలో జాతీయ స్థాయిలోనూ అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవారేమీ కాదు.

పొట్టచేతపట్టుకుని సరిహద్దులను దాటుకుని వచ్చి కూలీనాలీ చేసుకోవటం ఈనాటి సమస్య కాదు. స్వాతంత్ర్యానికి ముందు నుంచీ ఉంది. ఉమ్మడి బెంగాల్‌ రాష్ట్రం నుంచి అసాంలోకి ముస్లింల వలసలను బ్రిటిష్‌ పాలకులు బాగా ప్రోత్సహించారు. అంతకుముందు అసాం రాజులూ ఆ పనిని చేశారు.

ఇక స్వాతంత్ర్యానంతరం తూర్పుబెంగాల్‌లో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తం అయినప్పుడల్లా ఉపాధికోసం భారత భూభాగంలోకి ప్రజలు వలసలు రావటం సర్వసాధారణంగా మారింది. ఆ వలసలు బంగ్లాదేశ్‌ యుద్ధమప్పుడు ఇంకా ఉధృతం అయ్యాయి.ఆ తర్వాతా కొనసాగాయి.

వలసలూ ఇతర కారణాలతో క్రమేపీ ముస్లిం జనాభా పెరగటం అసాం మధ్యతరగతిలో తీవ్ర అభద్రతా భావాన్ని సృష్టించింది. అసాం విద్యార్థుల సంఘం నేతృత్వంలో బెంగాలీయులకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ఎన్నో ఆటుపోట్లకు లోనైనా చివరకు వలసప్రజల విషయంలో ఒక ఒప్పందానికి దారితీసింది.

1985 ఆగస్టు 15న కుదిరిన ఆ ఒప్పందం ప్రకారం... 1971 మార్చి 24 అర్ధరాత్రి తర్వాత దేశంలోకి ప్రవేశించిన వారందరినీ అక్రమ వలసదారులుగా ప్రకటించి ఓటర్ల జాబితా నుంచి వాళ్ల పేర్లను తొలగించాలి. ఒప్పందం కుదిరి 40 ఏళ్లు గడిచిపోయింది. ఇప్పటికీ ఆ సమస్యకు పరిష్కారం లభించలేదు. 1971 మార్చి 24 అర్ధరాత్రి నాటికి అసాంలో అర్హులైన పౌరులనూ వారి వారసులనూ గుర్తించి నేషనల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌సీ) నవీకరించటం 2019లోనే పూర్తయినా దాన్ని ఇంకా నోటిఫై చేయలేదు.

ఎన్నో వివాదాలు, అభ్యంతరాలతో ట్రైబ్యునళ్లు, కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి.అక్రమ వలసదారులందరూ ముస్లింలేనని విపరీతంగా ప్రచారం జరిగినా ఎన్‌ఆర్‌సీ కసరత్తులో అది నిజం కాదని తేలింది. ఎన్‌ఆర్‌సీలో చోటుదక్కని ప్రజల సంఖ్య 19.06 లక్షలని నిర్ధారించారు. దాని ప్రకారం అక్రమ వలసదారులు అసాంలో అంతమంది మాత్రమే ఉన్నట్లు లెక్క. మిగతా 3.11 కోట్ల మంది అసాం స్థానికులే. 1,600 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చేసిన కసరత్తులో తేలిన నిజం అదే.

అక్రమ వలసదారుల్లో ఏ మతం వారు ఎంతమంది ఉన్నారో ఎన్‌ఆర్‌సీ తుదిజాబితాలో అధికారికంగా పేర్కొనలేదు. అనధికారిక అంచనాల ప్రకారం హిందువులే ఆ జాబితాలో ఎక్కువగా ఉన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి హిందువులు వలసలు రావటం ఎప్పుడూ ఉంది. అన్ని పత్రాలూ పుచ్చుకుని వలసలు వచ్చే పరిస్థితి భారత ఉపఖండంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు.

అక్రమ వలసదారుల్లో హిందువులు ఎక్కువగా ఉండటానికి ప్రధానకారణం బంగ్లాదేశ్‌లో వారి సంఖ్య గతంలోనూ ఇప్పటికీ అధికంగానే ఉంది.అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 1.3 కోట్ల మంది హిందువులు బంగ్లాదేశ్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్‌ జనాభాలో హిందువుల శాతంలో తగ్గుదల ఉన్నా సంఖ్యాపరంగా చూస్తే పెరుగుదలే కనిపిస్తుంది.

1951లో 92 లక్షల హిందూ జనాభా ఉంటే, ఇప్పుడది 1.3 కోట్లు అయింది. అసాం ఒప్పందం ప్రకారం అక్రమ వలసదారులను మతపరంగా విభజించి చూడటానికి వీల్లేదు. 1971 మార్చి 24 అర్ధరాత్రి తర్వాత దేశంలో కాలుపెట్టిన వాళ్లందరినీ అక్రమ వలసదారులుగానే భావించాలి. హిందువులకూ ముస్లింలకూ ఇదే సూత్రాన్ని వర్తింపచేయాలి. ఎన్‌ఆర్‌సీ ప్రకారం అక్రమ వలసదారుల్లో హిందువులు అధికంగా ఉన్నట్లు స్పష్టంగా తేలటంతో కేంద్ర ప్రభుత్వం అసాం ఒప్పందానికి విరుద్ధంగా అడుగులు వేసింది.

ముస్లింలను పక్కనబెట్టి హిందువులకూ మరో అయిదు మతవర్గాల వారికి మాత్రమే పౌరసత్వం కల్పించటానికి పౌరసత్వ చట్టానికి సవరణను తీసుకువచ్చింది. ముస్లింలు తరలిపోటానికి చాలా దేశాలు ఉన్నాయనీ హిందువులకు అట్లాంటి అవకాశం లేదనీ వారికి ఉన్నదల్లా ఒక్క భారతేనన్న విచిత్ర వాదనతో చట్ట సవరణను సమర్థించుకుంది.

ఒక్క ఇజ్రాయెల్‌ తప్ప ఏ దేశమూ మతం ఆధారంగా ఇతర దేశాల వారికి పౌరసత్వాన్ని కట్టబెట్టటానికి ఎప్పుడూ పూనుకోలేదు.ఇక భారత రాజ్యాంగ చరిత్రలో గతంలో ఎప్పుడూ మతపరమైన భేదభావాన్ని చూపిస్తూ చట్టానికి సవరణను తీసుకురావటమూ జరగలేదు.

పౌరసత్వ చట్ట సవరణతో మరో కీలక మార్పునకూ కేంద్రం శ్రీకారం చుట్టింది.అసాం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 తర్వాత వలసలు వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వకూడదు. పౌరసత్వ చట్టానికి తీసుకువచ్చిన సవరణ ప్రకారం, 2014 డిసెంబర్‌ 31 నాటికి దేశంలో అడుగుపెట్టిన హిందువులకూ ముస్లింయేతర ఇతర వర్గాలకూ దాన్ని ఇవ్చొచ్చు.

అక్రమంగా వలస వచ్చిన హిందువులందరికీ పౌరసత్వం కల్పించి ముస్లింలందరినీ బంగ్లాదేశ్‌ పంపించటం సాధ్యం అవుతుందా? అన్నదానికి ప్రభుత్వం దగ్గర జవాబులేదు. అసాం తరహాలోనే పశ్చిమబెంగాల్‌లో కూడా ఎన్‌ఆర్‌సీ కసరత్తుని ఆరంభించి పూర్తిచేస్తే అక్కడా పరిస్థితిలో మార్పు కనపడకపోవచ్చు.

సరైన పత్రాల్లేని హిందువులు బెంగాల్‌లో కూడా పెద్ద సంఖ్యలోనే తేలే అవకాశం ఉంది.గట్టిగా ప్రయత్నిస్తే వేలల్లో అక్రమ వలసదారులను బయటికి పంపొచ్చు. లక్షల మందిని అట్లా పంపటం సాధ్యం కాదు. భారత్‌లోని అక్రమ వలసదారులందరూ తమ దేశం నుంచి వెళ్లిన వారేనని బంగ్లాదేశ్‌ అంగీకరించటానికి సిద్ధంగా ఉంటేనే సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అసాధ్యం.

అసాం,బెంగాల్లో అక్రమ వలసల వల్ల ముస్లింల జనాభా పెరిగి ఉండొచ్చు. దానికంటే కీలకమైంది.. ముస్లింల్లో సంతానసాఫల్యత రేటు ఎక్కువగా ఉండటం. ముస్లింల జనాభా గణనీయంగా పెరగటానికి అదే ప్రధాన కారణం. విద్యావ్యాప్తి పెరుగుతున్న కొద్దీ, ఆరోగ్యచైతన్యం విస్తరిస్తున్న కొద్దీ అది అన్ని మతాల్లోనూ తగ్గుతోంది.

2000 సంవత్సరం నుంచి ముస్లింల్లో సంతాన సాఫల్యతా రేటు గణనీయంగా తగ్గుతోంది.1992–93 నాటికి అది 4.4 (ఒక మహిళ సగటున కనే పిల్లల సంఖ్య) ఉంటే 2021 నాటికి 2.36కి తగ్గింది. హిందువుల్లో అది 3.3 నుంచి 1.94కి తగ్గింది. తాజా కుటుంబ ఆరోగ్యసర్వేలో వివరాలు సమగ్రంగా వెల్లడైతే ముస్లింల సంతాన సాఫల్యతా రేటు తగ్గుదల ఇంకా స్పష్టంగా కనపడే అవకాశం ఉంది.

నిజానికి భారత జనాభాతో పోల్చితే అక్రమ వలసదారుల సమస్య అంత తీవ్రమైంది కాదు. ఎక్కువలో ఎక్కువగా అరశాతానికి మించరు. వాళ్లందరూ శ్రమజీవులే. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పడుతున్నవారే. చౌకగా శ్రమను అందిస్తున్నవారే.

అక్రమ వలసజీవుల సమస్యను ఒక మతంతో ముడిపెట్టి ఆ మతానికి చెందిన వారందరినీ అభద్రతా భావంలోకి నెట్టివేయటమే అసలు ప్రమాదంగా మారుతోంది. దేశంలోని అన్ని సమస్యలకు మైనారిటీలను వేలెత్తి చూపటం వల్ల ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది.

కశ్మీర్‌లో పరిస్థితులూ,పశ్చిమాసియాలో పరిస్థితులూ ఎన్ని భావోద్వేగాలు కలిగించినా భారత్‌లోని మెజారిటీ ముస్లింలు వాటికి తీవ్రంగా ప్రభావితం కాలేదు. తీవ్రవాద చర్యల్లో పాల్గొన్న వారి సంఖ్య చాలా స్వల్పం. ఈ విషయాన్ని విస్మరించి వాళ్లని అనుమానంతో చూసి, వాళ్లకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా చేసి, ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన చోటు లేకుండా చేస్తే సమస్యలను కొనితెచ్చుకోవటమే అవుతుంది.

జనాభాలో ఏ మతం వాళ్లు ఎంత మంది ఉన్నారన్న దానికంటే ఎలాంటి మత సంకుచిత భావాలతో ఎంత మంది ఉన్నారన్నదే ప్రధానం.ముస్లింలను ఓటు బ్యాంకులుగా చూడటాన్ని విమర్శించిన వాళ్లు హిందువులను కనీవినీ ఎరగని రీతిలో మతప్రాతిపదికగా ఓటు బ్యాంకులుగా మార్చుకోవటం అంతకంటే అనర్థాన్ని తెచ్చిపెడుతుంది.

రాజకీయాల్లో మత ప్రభావం పెరిగిన చోట ప్రజాస్వామ్యం క్షీణించటమే గానీ ఎదగటం ఎక్కడా జరగలేదు. మంచికీ చెడుకీ మతపరమైన ముద్రలు వేసేచోట లౌకిక దృష్టితో, హేతుబుద్ధితో చర్చలు తగ్గిపోతాయి. కొత్త ఆలోచనలు అడుగంటిపోతాయి. అవి లేని చోట మనవని చెప్పుకొనే నవీన ఆవిష్కరణలూ ఉండవు. సాంకేతిక ప్రగతీ కనపడదు. అనుకరణలే మిగులుతాయి.

దేశ జనాభాలో ముస్లింల శాతం పెరగకూడదని భావిస్తే ముందు వాళ్లను అభివృద్ధిపథంలో నడిపించటానికే ప్రాధాన్యం ఇవ్వాలి.అది చేయకుండా ఎన్ని కమిటీలు వేసినా ప్రయోజనం ఉండదు.అక్రమ వలసలను ఆపటం అమెరికాకే సాధ్యం కావటం లేదు. ఇప్పటికీ అక్కడ 1.4 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారు. ఆ సంఖ్యతో పోల్చితే మనది చాలా తక్కువ.

అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వాళ్లది ఫలానా దేశమని గుర్తించటానికి ఏదో ఒక పత్రం దొరుకుతుంది. అలాంటివి ఉండబట్టే 7 లక్షల మంది భారతీయులను అక్రమ వలసదారులుగా గుర్తించారు. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన బడుగు జీవులకు అట్లాంటి పత్రాలు ఉండటం చాలా అరుదు.

✍️రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

మన గ్యాస్… ఎవరి పాలు? రూ.3.3 లక్షల కోట్ల ప్రశ్న!✍️కృష్ణ కానూరి ▪️కేజీ బేసిన్ నుంచి వెలికితీసిన గ్యాస్, చమురు విలువ రూ.3....
02/06/2026

మన గ్యాస్… ఎవరి పాలు? రూ.3.3 లక్షల కోట్ల ప్రశ్న!

✍️కృష్ణ కానూరి

▪️కేజీ బేసిన్ నుంచి వెలికితీసిన గ్యాస్, చమురు విలువ రూ.3.3 లక్షల కోట్లకు పైగా.

▪️పక్కనే ఉన్న ఓఎన్జీసీ గ్యాస్ నిల్వల నుంచి రూ.13 వేల కోట్ల విలువైన గ్యాస్ అక్రమంగా తరలించారనే వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.

▪️ఇంతటి సంపద ఉన్న రాష్ట్రంలో ఆస్పత్రులకు, సాగునీటి ప్రాజెక్టులకు డబ్బు లేదని ఎందుకు చెబుతున్నారు?

▪️ప్రతి ఏటా ‘లోటు బడ్జెట్’ ఎందుకు అంటూ చేతులెత్తేస్తున్నారు.

▪️ప్రభుత్వ రంగ సంస్థలను పక్కనబెట్టి ప్రైవేట్ కంపెనీలకు ఎర్ర తివాచీ పరుస్తున్న విధానం ఎవరికి ఉపయోగపడుతోంది?

▪️ఇది అభివృద్ధా? లేక ప్రజా సంపద దోపిడీయా?

▪️లక్షల కోట్ల గ్యాస్ దోపిడీపై విశాలాంధ్ర ఎడిట్ పేజీలో ఈ రోజు వచ్చిన ప్రత్యేక కథనం ఇది.
—-----

మన గ్యాస్.. ఎవరి పాలు? ఆంధ్రుల హక్కులపై కార్పొరేట్ సునామీ!

ప్రజలకు లోటు బడ్జెట్… ప్రైవేట్ కంపెనీలకు ఎర్ర తివాచీ!
కేజీ బేసిన్ లో యథేచ్ఛగా గ్యాస్‌ దోపిడీ

పర్యావరణ సంతులనాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే కార్పొరేట్ ప్రయోజనాలకు సాగిలపడటం జీవవైవిధ్యానికి పెను ముప్పు. కేజీ బేసిన్ నుంచి లక్షల కోట్ల విలువైన గ్యాస్‌ను తరలిస్తూ, తీరప్రాంత జీవవైవిధ్యాన్ని ఛిద్రం చేస్తోన్న రిలయన్స్ వంటి సంస్థలు.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన వనరుల వాటా విషయంలో దశాబ్దాలుగా కోర్టుల చుట్టూ తిరగడం చట్టాన్ని అపహాస్యం చేయడమే.

పక్కనే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ బావుల నుంచి 1.55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 13,000 కోట్లు) విలువైన గ్యాస్‌ను అక్రమంగా తరలించారనే ‘గ్యాస్ మైగ్రేషన్ వివాదం”పై నేడు సుప్రీంకోర్టులో తుది విచారణ జరగడం వనరుల దోపిడీకి నిలువెత్తు నిదర్శనం. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీని కాదని కార్పొరేట్‌కు పట్టం కట్టడం వల్ల కలిగే అనర్థాలకు ఈ నిగూఢ వాస్తవాలే ప్రత్యక్ష ఉదాహరణ

➡️గుండె కోత మిగులుస్తున్న గుత్తాధిపత్యం

ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరప్రాంతంలో, కృష్ణా-గోదావరి బేసిన్ గర్భంలో దాగున్న సహజ వాయువు మన రాబోయే తరాల సంపద. కానీ, గత పాతికేళ్లుగా సాగుతున్న కథ చూస్తే గుండె తరుక్కుపోక మానదు.2000 సంవత్సరం నుంచి కేజీ-డి6 బ్లాక్ నుంచి సుమారు 2.8 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల సహజ వాయువును, 33 మిలియన్ బారెల్స్ ముడి చమురును ప్రైవేట్ కార్పొరేట్ దిగ్గజాలు తరలించుకుపోయాయి.

దీని అంతర్జాతీయ మార్కెట్ విలువ అక్షరాలా రూ. 3,30,000 కోట్లకు పైమాటే! ఇది కేవలం ఒక ఆర్థిక గణాంకం కాదు… ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చగలిగిన అపార ప్రజాసంపద.

కానీ ఈ సంపదతో రాష్ట్రానికి నిజంగా ఏమి దక్కింది? తీరప్రాంత గ్రామాల్లో పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందిందా? రైతు పొలాలకు నీళ్లు చేరాయా? మత్స్యకారుల జీవితాలు పచ్చబడ్డాయా? స్థానిక యువతకు శాశ్వత ఉద్యోగాలు వచ్చాయా? సమాధానం వెతికితే కనిపించేది ఒక చేదు వాస్తవం మాత్రమే.

గ్యాస్ వెలికితీసిన నేలపై ఇప్పటికీ పేదరికం,నిరుద్యోగం, కాలుష్యం, వలసలే కనిపిస్తున్నాయి. లక్షల కోట్ల విలువైన సహజ వనరులు కార్పొరేట్ కంపెనీల లాభాలుగా మారగా… ప్రజలకు మాత్రం సముద్ర కాలుష్యం, జీవనోపాధి సంక్షోభం, పెరిగిన అప్పులు మాత్రమే మిగిలాయి.

‘ప్రజల సంపద ప్రజలకే ఉపయోగపడాలి’ అనే రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతూ సహజ వనరులను కొద్దిమంది చేతుల్లోకి నెట్టివేసిన దోపిడీ వ్యవస్థకు కేజీ బేసిన్ నేడు సజీవ ఉదాహరణగా మారింది.

➡️న్యాయస్థానాల్లో దోపిడీపై పోరాటం

ఈ వనరుల అపహరణ ఎంత దారుణంగా సాగిందంటే, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్జీసీకి చెందిన గ్యాస్ నిల్వల నుంచి రిలయన్స్ కన్సార్టియం అక్రమంగా గ్యాస్‌ను తరలించిందని కేంద్ర ప్రభుత్వం రూ.1.55 బిలియన్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేయాల్సి వచ్చింది.

దీనిపై ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్డర్ ఇచ్చింది.ఈ తీర్పును సవాలు చేస్తూ రిలయన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.అయితే, సుప్రీంకోర్టులో ‘కేంద్రంతో మేము మధ్యవర్తిత్వానికి వెళ్తాం, విచారణ ఆపండి’ అంటూ కార్పొరేట్ దిగ్గజాలు సాకు వెతుకుతుండటం, వారి లొసుగులను బహిర్గతం చేస్తోంది.

➡️వేల కోట్ల పన్నుల ఎగవేత - ప్రభుత్వాల మౌనం

ఇది కేవలం కేంద్రంతో వివాదం కాదు.రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన వాటాల పైన కూడా సుప్రీంకోర్టు వరకు వివాదాలు నడిచాయి.

గ్యాస్ సరఫరాపై రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ. 20,000 కోట్లపైగా పన్ను బకాయిల విషయంలో ఇరు రాష్ట్రాల వ్యాట్ చట్టాలను సాకుగా చూపిస్తూ కార్పొరేట్ కంపెనీలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇంత జరుగుతున్నా,ఏ పార్టీ అధికారంలో ఉన్నా,గత ప్రభుత్వమైనా, ప్రస్తుత ప్రభుత్వమైనా రిలయన్స్ వంటి కార్పొరేట్ దిగ్గజాలపై గట్టిగా ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యాయి.

ప్రజాధనం వేల కోట్లలో తరలిపోతుంటే, పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు మౌనం వహించడం వెనుక ఏ ప్రయోజనాలు దాగున్నాయి?

➡️ప్రభుత్వ సంస్థ వద్దు... ప్రైవేటే ముద్దు!

ఒకవైపు ప్రైవేట్ కార్పొరేట్లు మన సహజ వాయువును పిప్పి చేస్తుంటే, మరోవైపు మన సంపదను కాపాడాల్సిన ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ లోపల 'ఇంటి దొంగలు' ప్రైవేట్ శక్తులతో చేతులు కలిపి వందల కోట్ల కుచ్చుటోపీ పెడుతున్నారు.

చమురు బావుల తవ్వకంలో భూమి ఉష్ణోగ్రతను చల్లబరచడానికి వాడే అత్యంత కీలకమైన 'బెరైటీస్ పౌడర్' (ముగ్గురాయి పొడి) కొనుగోలు లో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీ ని కాదని, ప్రైవేటు కంపెనీలనే నమ్ముకుంటూ ఓఎన్జీసీ నిలువునా మోసపోతోంది.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మంగంపేట బెరైటీస్ గనుల నిర్వహణ ఏపీఎండీసీ చేతిలో ఉన్నా, ప్రైవేట్ కంపెనీలకు ఎర్ర తివాచీ పరచడం వెనుక పెద్ద కుంభకోణమే దాగుంది.

➡️కమీషన్లకు కక్కుర్తి.. అంతర్గత విలువ లీక్!

2018 వరకు ఓఎన్జీసీ తమకు అవసరమైన బెరైటీస్‌ను ఏపీఎండీసీ నుంచే నేరుగా కొనుగోలు చేసేది.అప్పట్లో నాణ్యతపై ఎలాంటి విమర్శలు లేవు,అవినీతి మరకలు అస్సలు లేవు.

కానీ ఆ తర్వాత కేంద్రంలో పలుకుబడిని ఉపయోగించి ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేసేలా ఒత్తిళ్లు తెచ్చారు. కమీషన్లకు కక్కుర్తి పడిన ఓఎన్జీసీలోని కొందరు ఉన్నతాధికారులు రూ. 340 కోట్ల విలువైన టెండర్లలో అంతర్గత బెంచ్ మార్క్ విలువను ముందే లీక్ చేశారు.

మార్కెట్‌లో టన్ను ధర రూ. 8,000 లోపు ఉంటే, ఏపీఎండీసీ రేటు కూడా అదే అయినా,ప్రైవేట్ కంపెనీలు ఏకంగా రూ. 12,050 కోట్ చేశాయి.ఈ సిండికేట్ వల్ల ఓఎన్జీసీకి రూ. 114 కోట్ల మేర నిఖర నష్టం వాటిల్లుతోంది.

➡️నిల్వలు లేకుండా లక్షల టన్నుల సరఫరా ఎలా?

ఈ కుంభకోణంలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. మంగంపేటలోని 70 పరిశ్రమల వద్ద ఉన్న మొత్తం నిల్వ 50 వేల టన్నులకు మించదు.ఏపీఎండీసీ నిబంధనల ప్రకారం టెండర్లలో పాల్గొన్న 10 కంపెనీలు కలిపి రెండేళ్లకు కొనగలిగేది కేవలం 33,000 టన్నులు మాత్రమే.

మరి నిల్వలే లేనప్పుడు, రెండేళ్లలో 28.2 లక్షల టన్నుల నాణ్యమైన బీ-గ్రేడ్ బెరైటీస్‌ను ఓఎన్జీసీకి ఈ ప్రైవేట్ కంపెనీలు ఎలా సరఫరా చేస్తాయి?

అంటే, బీ-గ్రేడ్ పేరిట కారుచౌకగా లభించే సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ల కల్తీ ముగ్గురాయిని, ఎందుకు పనికిరాని వేస్ట్ పౌడర్‌ను మిక్స్ చేసి ఓఎన్జీసీకి సరఫరా చేయడానికి రంగం సిద్ధమైంది.

దీని వెనుక "రూ. 5 కోట్లు ఇస్తే అగ్రిమెంట్లు పూర్తి చేయిస్తా" అంటూ ఒక కీలక వ్యక్తి సాగిస్తున్న బ్రోకరేజ్ దందా వ్యవస్థల పతనానికి అద్దం పడుతోంది.

➡️లోటు బడ్జెట్ అబద్ధం.. కార్పొరేట్ అనుకూల నిజం

తెలుగు రాష్ట్రాల పాలకులు ప్రతీ ఏటా "లోటు బడ్జెట్" అంటూ ప్రజల ముందు కన్నీళ్లు పెడుతుంటారు.ప్రజా సంక్షేమ పథకాలకు డబ్బులు లేవని,కొత్త ప్రాజెక్టులకు నిధులు లేవని చేతులెత్తేస్తుంటారు.

కానీ,మన గడ్డపై,మన సముద్రంలో పుట్టిన గ్యాస్, ఖనిజాల ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల హక్కులను కార్పొరేట్ శక్తులకు ధారపోస్తూ,వారికి పరోక్షంగా సపోర్టు చేయడం ఏ రకమైన పాలన?

ఒకవైపు గ్యాస్ దోపిడీ, మరోవైపు ముగ్గురాయి పొడి పేరిట ఏపీఎండీసీకి రావాల్సిన వందల కోట్ల వ్యాపారాన్ని ప్రైవేట్ పరం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోంది?

ఇది కేవలం రాజకీయ వైఫల్యం కాదు — ప్రజా హక్కులను, ప్రజా అవసరాలను బహిరంగంగా మోసం చేయడమే అన్న ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతోంది.

➡️ఈ డబ్బుతో 13 జిల్లాల్లో కార్పొరేట్ స్థాయి ఆస్పత్రులు

రాష్ట్రానికి రావాల్సిన ఈ వేల కోట్ల రూపాయల సొమ్ము గనుక మన ఖజానాకు చేరి ఉంటే,ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగం స్వరూపమే మారిపోయేది.ప్రభుత్వ కమిటీల అంచనాల ప్రకారం.. ప్రతి జిల్లాలో రూ. 350 నుంచి రూ. 500 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించవచ్చు. రాష్ట్రంలోని 13 పాత జిల్లాల్లో అధునాతన ఉచిత వైద్యం అందిస్తూ, పేదవాడు వైద్యం కోసం ఇల్లు, ఒళ్లు అమ్ముకునే పరిస్థితి రాకుండా అడ్డుకోవడానికి ఈ ఒక్క కార్పొరేట్ దోపిడీ సొమ్ము సరిపోతుంది.

➡️​ఎండిపోతున్న పొలాలు - పెండింగ్ ప్రాజెక్టుల శాపం

కేవలం వైద్యమే కాదు.. రాష్ట్ర సాగునీటి రంగాన్ని కుదిపేస్తున్న పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల సమస్యకు కూడా ఇందులో పరిష్కారం ఉంది. నిపుణులు పదేపదే చెబుతున్న లెక్కల ప్రకారం, దాదాపు రూ. 50,000 కోట్లు ఉంటే రాష్ట్రంలో దశాబ్దాలుగా మూలనపడ్డ అన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయి.

రాయలసీమ గడ్డకు నీరందించే ప్రాజెక్టులైనా, వంశధార, తోటపల్లి వంటి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులైనా ఈ గ్యాస్, ఖనిజాల సంపదతో సులభంగా పూర్తి చేసి, లక్షలాది ఎకరాలను పచ్చగా మార్చవచ్చు.కానీ,పొలాలు ఎండిపోతున్నా పాలకులు మాత్రం కార్పొరేట్ లాభాలకే ఎర్ర తివాచీ పరుస్తున్నారు.

➡️ప్రజా సంపదపై ప్రజల హక్కు ఎప్పుడు?

కేజీ బేసిన్ సంపద నిజంగా ప్రజల ప్రయోజనాలకు వినియోగిస్తే —ప్రతి జిల్లాలో ప్రపంచస్థాయి ఆస్పత్రులు ఉండేవి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేవి
మత్స్యకారులకు రక్షణ లభించేది. గ్రామీణ యువతకు ఉద్యోగాలు వచ్చేవి. ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థ బలోపేతం అయ్యేది.

కానీ నేడు జరుగుతున్నది దీనికి పూర్తి విరుద్ధం.ప్రజల సహజ సంపదను… కొద్దిమంది కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం తాకట్టు పెడుతున్నారన్న భావన రోజురోజుకూ బలపడుతోంది.

“మన వనరులు… మన హక్కు” అనే ప్రజా ఉద్యమం బలపడకపోతే ఈ దోపిడీ ఆగదు.

➡️యువత చేతుల్లో సహకార విప్లవం - ఏకైక పరిష్కారం

ఈ వ్యవస్థీకృత దోపిడీకి,నిరుద్యోగానికి,ఆర్థిక అసమానతలకు ఒకే ఒక్క శాశ్వత పరిష్కారం ఉంది. గనులు, ఇసుక రేవులు,గ్యాస్,గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ మాఫియాలకు కాకుండా స్థానిక యువతకు సహకార సంఘాల ద్వారా అప్పగించాలి.

ఓఎన్జీసీ ప్రైవేట్ సిండికేట్లను కాదని ఏపీఎండీసీ లాంటి ప్రభుత్వ సంస్థల ద్వారానే కొనుగోళ్లు జరిపేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి.వనరులపై అధికారం కార్పొరేట్ల చేతుల్లోంచి స్థానిక సహకార సంఘాల హస్తగతం అయినప్పుడే పర్యావరణానికి నిజమైన రక్షణ, సమాజానికి ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తాయి.

01/06/2026

పవన్ కళ్యాణ్ కి సూటి ప్రశ్నలు

01/06/2026

వర్జినియా పొగాకు కేజీ 360 రూపాయలు కొనుగోలు చేయాలని చుట్టుగుంట సెంటర్ నుండి గుంటూరు పొగాకు బోర్డు ఆఫీసు వరకు ర్యాలీ చేస్తున్న పొగాకు రైతులు

మనరాష్ట్రమే ఫస్ట్. పెట్రోల్,డీజిల్ రేట్లలో. ఎన్నికలకు ముందు జగన్ ఆయిల్ రెట్లు పై పన్నులు పెంచి దోపిడి చేస్తున్నాడు మేము ...
01/06/2026

మనరాష్ట్రమే ఫస్ట్. పెట్రోల్,డీజిల్ రేట్లలో. ఎన్నికలకు ముందు జగన్ ఆయిల్ రెట్లు పై పన్నులు పెంచి దోపిడి చేస్తున్నాడు మేము అధికారంలోకి వస్తె తగ్గిస్తామన్నారు. తగ్గించలేదు. కనీసం ఇతర రాష్ట్రాల స్థాయి తగ్గించక పోగా పొదుపు కతలు చెబుతున్నారు.

కింద పోస్టర్ లో ఉన్నవి మన ఏపీ రేట్లు. జమిని ఇచ్చిన పోస్టర్.

01/06/2026

★ NTA అసమర్థత, నీట్ పేపర్ లీక్

★ UGC NET దరఖాస్తుల నిర్వహణలో అవకతవకలు

★ CBSE పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు

★ CUET-UG పరీక్షలను చివరి నిమిషంలో రద్దు

Address

Guntur

Website

Alerts

Be the first to know and let us send you an email when KAPU SRINIVAS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share