Rotary Club of Gudivada

Rotary Club of Gudivada Our Club is active in conducting various Service-oriented programs for the benefit of people living in Gudivada and its suburbs.

Come and join us, Be a part of the club and bring change to the society

07/09/2026
రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన ఉచిత మెడికల్ క్యాంపు నందు సుమారు 64 మంది కి గుండె మరియు జనరల్ వ్యాధులకు...
07/09/2026

రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన ఉచిత మెడికల్ క్యాంపు నందు సుమారు 64 మంది కి గుండె మరియు జనరల్ వ్యాధులకు సంబందించిన పరీక్షలు నిర్వహించి వారికి తగిన సలహాలు మరియు ఉచిత మందులు అందిచడం జరిగింది.
ఈ కార్యక్రమం లో క్లబ్
పిన్నమనేని సిద్దార్ద మెడికల్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ వైద్యులు, క్లబ్ ప్రెసిడెంట్ G. కిరణ్ బాబు, సెక్రటరీ G. నరేష్,ట్రెసరర్ K. శ్రీనివాస్,Rtn. Y. నాగేశ్వరరావు, Rtn. Dr.Ch. సూర్యచంద్ర రావు, Rtn. K.వెంకటేశ్వరరావు,Rtn. B.శంకరరావు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

రోటరీ యువజన వారోత్సవ పత్రిక చీఫ్ గెస్ట్ మరియు క్లబ్ లీట్రసీ చైర్ చేతుల మీదుగా ఆవిష్కరణ
07/09/2026

రోటరీ యువజన వారోత్సవ పత్రిక చీఫ్ గెస్ట్ మరియు క్లబ్ లీట్రసీ చైర్ చేతుల మీదుగా ఆవిష్కరణ

07/09/2026
*గుడివాడ రోటరీ క్లబ్* ఆధ్వర్యంలో నిరుపేద మహిళలు, దివ్యాంగులకు *నిత్యావసర సరుకుల పంపిణీ* గుడివాడ: పేదవారికి, అవసరమున్న వా...
07/09/2026

*గుడివాడ రోటరీ క్లబ్* ఆధ్వర్యంలో నిరుపేద మహిళలు, దివ్యాంగులకు *నిత్యావసర సరుకుల పంపిణీ*
గుడివాడ: పేదవారికి, అవసరమున్న వారికి అండగా నిలవాలనే సంకల్పంతో గుడివాడ రోటరీ క్లబ్ చేపడుతున్న శాశ్వత సేవా కార్యక్రమాల్లో భాగంగా నేడు ఉదయం 9 గంటలకు సత్యనారాయణపురంలోని శ్రీ *పుట్టపర్తి సాయిబాబా మందిరం* వద్ద *40 మంది* నిరుపేద మహిళలు మరియు దివ్యాంగులకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు.
రూ.20,000 విలువైన ఈ కిట్లను క్లబ్ సభ్యులు స్వయంగా నిధులు సమకూర్చి, లబ్ధిదారులకు అందించి వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించారు. క్లబ్ అధ్యక్షులు గుళ్లపల్లి కిరణ్ బాబు మాట్లాడుతూ, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు చేయూతనందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమని తెలిపారు.
కార్యదర్శి గండు నరేష్ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ ఎప్పటికప్పుడు సమాజ శ్రేయస్సు కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపడుతూనే ఉంటుందని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు రోటేరియన్ చి.సూర్యచంద్రరావు, రోటేరియన్ ముళ్లపూడి రమణమూర్తి, ఇతర క్లబ్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిరుపేద, దివ్యాంగుల సంక్షేమం కోసం తమ వంతు సేవలు నిరంతరం కొనసాగిస్తామని సభ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

27/08/2026

📌 Inauguration of Rotary Children Park

Rotary Club of Gudivada Inauguration of Rotary Children's Park Gudivada, August 27, 2026: The Rotary Club of Gudivada grandly conducted the inauguration ceremony of the newly constructed "Rotary…

🏛 Rotary Club of Gudivada
📍 RI District 3020
🔗 https://rizones45678.org/projects/31059?yearId=52

*రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ*  *రోటరీ పిల్లల పార్క్ ప్రారంభోత్సవం* గుడివాడ, ఆగస్టు 27, 2026:రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యం...
27/08/2026

*రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ*

*రోటరీ పిల్లల పార్క్ ప్రారంభోత్సవం*

గుడివాడ, ఆగస్టు 27, 2026:
రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో, గుడ్లవల్లేరు మండలం గురజ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో నూతనంగా నిర్మించిన “రోటరీ పిల్లల పార్క్” ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.

దివంగత శ్రీ యలమంచిలి వీర రాఘవయ్య గారు మరియు శ్రీమతి లక్ష్మీకాంతమ్మ గారి స్మారకార్థం, వారి కుమారుడు, రోటరీ పూర్వ అధ్యక్షులు శ్రీ యలమంచిలి నాగేశ్వరరావు గారి సహకారంతో 2025–26 రోటరీ సంవత్సరంలో ఈ పిల్లల పార్కును నిర్మించారు.

సుమారు రూ.80,000/- వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ పార్కును 27-08-2026 గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులకు ఆటవిడుపుతో పాటు శారీరక, మానసిక ఉల్లాసాన్ని అందించే విధంగా పార్కును తీర్చిదిద్దారు.

ఈ కార్యక్రమంలో IPP Rtn. యలమంచిలి నాగేశ్వరరావు, రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ అధ్యక్షులు Rtn. గుళ్ళపల్లి కిరణ్ బాబు, కార్యదర్శి Rtn. గండు నరేష్, కోశాధికారి Rtn. కొల్లి శ్రీనివాసరావు, Rtn. బలుసు శంకరరావు, Rtn. అట్లూరి జనార్ధన ప్రసాద్, Rtn.ఆవుల మారుతీ కుమార్ మరియు ఇతర రోటరీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆరోగ్యకరమైన వికాసానికి ఆటలు ఎంతో అవసరమని, పాఠశాలల్లో ఇటువంటి సదుపాయాల కల్పన పిల్లల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తుందని రోటరీ ప్రతినిధులు పేర్కొన్నారు.

కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, రోటరీ సభ్యులు మరియు ప్రతి ఒక్కరికీ రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ కృతజ్ఞతలు తెలిపింది.

*Rotary Club of Gudivada
Create Lasting Impact*

Address

Purna Chandra Rao Auditorium
Gudivada
521301

Website

Alerts

Be the first to know and let us send you an email when Rotary Club of Gudivada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rotary Club of Gudivada:

Shortcuts

Share

Category