27/04/2025
**ఉగ్ర దాడిని వ్యతిరేకించిన SSF స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్**
పహల్గాం ఉగ్రదాడిలో మరణించినటువంటి భారత పర్యాటకుల ఆత్మకు శాంతి కలగాలని అమరవీరుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తూ
స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుండి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ యాక్టివ్ వింగు సభ్యులు మీడియాతో మాట్లాడుతూ దేశ ఐక్యమత్యాన్ని శాంతిని దెబ్బతీసే ఏ విషయాన్ని అయినా తీవ్రంగా ఖండించాలని రాజకీయాలకి కుల మతాలకి అతీతంగా ఖండించి దేశం మొత్తం ఏకధాటిగా నడవాలని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం శాంతియుత వాతావరణాన్ని కాశ్మీర్లో సృష్టించే విధంగా బలమైన చర్యలు చేపట్టాలని. కేంద్ర ప్రభుత్వం చేపట్టే దేశ రక్షణ కోసం ఏ చర్యనైనా అందరూ ఏకతాటిగా మద్దతు ప్రకటించాలని మీడియాతో పేర్కొన్నారు .
ఇట్టి కార్యక్రమంలో స్పోర్ట్స్ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ అడ్వైజర్ వంగూరి దామోదర్ గారు స్టూడెంట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ శాగంటి రాజేష్ గారు మరియు జనరల్ సెక్రటరీ
శలికంటి వినోద్ కుమార్ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ స్పోక్స్ పర్సన్ జక్కుల వెంకటేష్ యాదవ్ గారు గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీ అన్వేష్ మరియు లెనిన్ బీరప్ప వంశీ సురేష్ ప్రసాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు. పాల్గొనడం జరిగింది.