MADHU CPI

MADHU CPI Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MADHU CPI, Political Party, Dharmavaram.

అందరికి హోలీ శుభాకాంక్షలు,
14/03/2025

అందరికి హోలీ శుభాకాంక్షలు,

ఆర్డిఓ ఆఫీస్ ఎదుట సిపిఐ  ధర్నా 650-2 సర్వే నంబర్ లో ప్లంబర్లకు ఇచ్చిన స్థలాలలో అవినీతి అక్రమాలపై విచారణ జరపాలి సిపిఐ  ని...
12/03/2025

ఆర్డిఓ ఆఫీస్ ఎదుట సిపిఐ ధర్నా

650-2 సర్వే నంబర్ లో ప్లంబర్లకు ఇచ్చిన స్థలాలలో అవినీతి అక్రమాలపై విచారణ జరపాలి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు

శ్రీ సత్య సాయి ధర్మవరం పట్టణం ఆర్డీవో ఆఫీస్ ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 650 - 2 సర్వే నంబర్ లో ప్లంబర్లకు ఇచ్చిన స్థలాలలో అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని సిపిఐ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు మీడియాతో మాట్లాడుతూ, ధర్మవరం పట్టణంలో సర్వేనెంబర్ 650-2 లో కొంతమంది నాయకులు దొంగ పట్టాలు తీసుకుని ప్లంబర్ కాకపోయినా వారు అందరూ కూడా ప్రభుత్వ భూమిని అన్యక్రాంతం చేసుకుంటే అధికారులు మరియు మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పందించకపోవడంతో మీకు ఏమైనా వాటాలు అందుతున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున అడుగుచున్నాము అని అన్నారు.మరి ప్రభుత్వ భూమి కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అన్యాక్రాంతం అవుతున్న కూడా అధికారులు ఒకపక్క మంత్రి సైలెంట్ గా ఉండడానికి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు.ఇవాళ నిజమైన ప్లంబర్స్ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న కూడా ప్లంబర్స్ ను పట్టించుకునే పాపాన పోలేదు అని అధికారులపై మండిపడ్డారు.650-2 సర్వే నెంబర్ లో అనేక అక్రమాలు జరిగినాయని ప్రధాన పత్రికల్లో వచ్చినా కూడా అధికార యంత్రాంగం చర్యలు లేకపోవడం సిగ్గుచేటు అని అదేవిధంగా ఇవాళ అధికారుల దగ్గరకు ప్రజలు వారి కష్టాలతో వస్తే అధికారులకు ముడుపులు ఇస్తే గాని పనిచేస్తామని అధికార యంత్రాంగం అంత కూడా తయారవుతుంది.ఇప్పటికైనా సరే మంత్రి సత్తి కుమార్ యాదవ్ ఇక్కడ జరుగుతున్నటువంటి భూ అక్రమాలపై స్పందించాలి లేకపోతే పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్టు పార్టీ బాధితులతో పేదలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్,సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు,పోలా లక్ష్మీనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు,వెంకటస్వామి,యువజన సంఘం జిల్లా కార్యదర్శి సకల రాజా,ఆదినారాయణ,మల్లి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, సన్న పెద్దన్న, నాగభూషణ,మహిళా సమైక్య పట్టణ నాయకులు లలిత, లింగమ్మ, ఈరమ్మ,ఎలక్ట్రానిక్స్ ప్లంబర్స్, గోవిందు రాజు, తాజ్, సుబ్బయ్య,రామక్రిష్ణ, శ్రీరాములు, నాగరాజు, మనోహర్, బాబావలి, మసూద్, మస్తాన్, కేశవ,రామాంజి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

12/03/2025

మంత్రి ఇలాకాలో భూ అక్రమాలపై విచారణ జరిపించండి..

ధర్మవరం పట్టణంలో సర్వేనెంబర్ 650-2 జరిగిన అక్రమాల పై విచారణ జరిపించండి సిపిఐ నియోజక వర్గం కార్యదర్శి ముసుగు మధు

Address

Dharmavaram
515671

Website

Alerts

Be the first to know and let us send you an email when MADHU CPI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share