21/06/2025
ఎస్ డి పి ఐ ఆవిర్భవ దినోత్సవం 17వ పతాక ఆవిష్కరణ
చిత్తూరు జిల్లా : 21-06-2025
ఈరోజు స్థానిక దర్గా సర్కిల్ నందు*SDPI సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా* 17వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దర్గా సర్కిల్ వద్ద గొప్పగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో Sdpi స్టేట్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ గని గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ ఎస్ డి పి ఐ గత 16 సంవత్సరాలుగా పార్టీ గళం లేని వారికి గళం కావాలన్న ఆశయంతో స్థాపించబడింది ఆకిలి నుండి స్వేచ్ఛ భయం నుండి స్వేచ్ఛ అనే నినాదంతో అన్ని వర్గాలకు ఆకలి భయాలను దూరం చేసే విధంగా పేద బడుగు బలహీన వర్గాలకు మద్దతుగా వాళ్ల యొక్క ఆశయ సాధనలకు నిరంతరం కృషి చేస్తూ 16 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిందని తెలిపారు నేడు 17వ ఆవిర్భవ దినోత్సవం జరుపుకుంటుందని తెలిపారు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి పూర్తిస్థాయిలో కృషి చేయాలని కార్యకర్తలకు హితవు చేశారు. అనంతరం అన్నదనం కార్యక్రమం చేయడం జరిగింది ఈ సమావేశంలో అసెంబ్లీ ప్రెసిడెంట్ ఆసిఫ్ వైస్ ప్రెసిడెంట్ కరీం జనరల్ సెక్రెటరీ తౌఫిక్ మరియు కార్యకర్తలు అబ్దుల్లా, నూరుద్దీన్, షబ్బీర్, సుహెల్, అబ్దుల్ గఫార్, ఆరిఫ్, బీఎస్పీ నాయకులు అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలపడం జరిగింది.