Telugu Desam Party: Chandragiri

Telugu Desam Party: Chandragiri Official Page of TDP Chandragiri

02/06/2026

దశాబ్దాల కల విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి నేతృత్వంలో కూటమి నేతల సంబరాలు..


02/06/2026

డేటా సెంటర్లు మంచివి కావని అంటూ కొంతమంది సృష్టిస్తున్న అపోహలపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు.

"డేటా సెంటర్లు మంచివి కావు" అంటూ అమెరికా ఉదాహరణ చెబుతున్నారు. అమెరికాను చూసుకుంటే, మన దేశంలో వన్ నేషన్ - వన్ గ్రిడ్ ఉంది. అమెరికాలో అది లేదు.

నీటి విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం గోదావరి నుంచి దాదాపు 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఇది వియత్నాం లేదా బ్రెజిల్ దేశాల మొత్తం వార్షిక నీటి వినియోగంతో సమానం.

మేము నిర్మించాలనుకుంటున్న 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే అవసరం. ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్, ఒక గిగావాట్ డేటా సెంటర్ కంటే 7 రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుంది.

కానీ ప్రతి ఒక్కరూ డేటా సెంటర్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప, థర్మల్ పవర్ ప్లాంట్ల గురించి మాట్లాడటం లేదు. కాబట్టి యువతతో ఈ విషయాలపై చర్చించడం, వారి భయాలు మరియు అపోహలను తొలగించడం చాలా ముఖ్యం.

02/06/2026

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఖండించారు.

డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను నోటిఫై చేయగా, అందులో 3 శాతం క్రీడా కోటా కింద 421 పోస్టులను కేటాయించాం. ఈ నియామక ప్రక్రియలో 3,600 మంది అభ్యర్థులు మొత్తం 5,326 దరఖాస్తులు సమర్పించగా, తుది ఎంపికలో 382 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 39 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి.

అన్ని పోస్టులు భర్తీ కాకపోవడమే ఎంపికలు పూర్తిగా అర్హత, ప్రాధాన్యత, ప్రభుత్వ నిబంధనల ఆధారంగానే నిర్వహించబడినట్లు స్పష్టం చేస్తోంది.


• ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ. 65, 887 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేశాం.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం ...
02/06/2026

• ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ. 65, 887 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేశాం.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం పర్యటనలో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు

• నియోజకవర్గాల అభివృద్ధిపై దిశానిర్దేశం చేసేందుకు నేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు

• రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యం.. ముంబయి సదస్సులో స్పష్టం చేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• ఉపాధ్యాయ నియామకాలపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాలను ఎండగడుతూ విశాఖ తీరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన డీఎస్సీ అభ్యర్థులు

• కోటిమంది భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాలు యోగాంద్ర కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు.. మంత్రి సత్య కుమార్ యాదవ్

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/QE0HV


01/06/2026

"అమ్మా.. నువ్వు కుట్టు మిషన్ కుట్టుకోవటం కాదు.. అవసరం అయితే చదువుకో, ఏదో ఒక రోజు నిన్ను నేను టీచర్ గా చూడాలని అనుకుంటున్నా.."

పేదల సేవలో కార్యక్రమంలో పీ4లో భాగంగా మార్గదర్శులు బంగారు కుటుంబాలతో సంభాషించిన సీఎం

#పేదలసేవలో






01/06/2026

కూటమి ప్రభుత్వం ప్రగతి దారులైన రోడ్లకు ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది ఒక ఉదాహరణ.

అరకు లోయ నుండి పాడేరు వెళ్లేందుకు ఉపయోగపడే జాతీయ రహదారి 516Eని చక్కగా అభివృద్ధి చేశారు . కొయ్యూరు, చింతపల్లి, లంబసింగి, పాడేరు, అరకు వంటి ప్రధాన ఏజెన్సీ ప్రాంతాల మీదుగా వెళ్లే ఈ రోడ్డు ప్రయాణాలకు మరింత సురక్షితం కానుంది.


• నేటి నుంచే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభం. ఫలించిన సీఎం చంద్రబాబు పట్టుదల • సింగపూర్ బ...
01/06/2026

• నేటి నుంచే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభం. ఫలించిన సీఎం చంద్రబాబు పట్టుదల

• సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2026 పురుషుల డబుల్స్ లో చిరాగ్ తో కలిసి స్వర్ణ పథకం సాధించిన కోనసీమ కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

• నంద్యాల జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ధ్వంసం వైసీపీ కార్యకర్త పనే.సీసీ కెమెరాల ఫుటేజీ తో బట్టబయలైన సైకో బ్యాచ్ నాటకం. వైసీపీ తీరుపై ధ్వజమెత్తిన ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• నేడు కాకినాడ జిల్లా చామవరం లో "ప్రజావేదిక" లో పాల్గొని ,ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

• పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రేపటి నుంచి ఆరు రోజులపాటు రష్యాలో పర్యటించనున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/oc1l


30/05/2026

మహా నాయకుడు ఎన్టీఆర్ స్ఫూర్తి..
దార్శనికుడు చంద్రబాబు దిశా నిర్దేశం..
యువసారధి లోకేష్ కార్యాచరణ..
ప్రతిబింబించిన మహానాడు 2026
లక్షలాది టీడీపీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషితో మహా వేడుకగా విజయవంతమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలోనూ
హైబ్రిడ్ విధానంలో 24 లక్షల మందిపైగా డిజిటల్ అటెండెన్స్ నమోదైన ఈ మహానాడు రికార్డు సృష్టించింది.





#నాతెలుగుదేశంనాబాధ్యత

30/05/2026

ఆంధ్రప్రదేశ్‌లో కొట్టేసిన భూములు మీ గొడ్డలి పార్టీకి సరిపోలేదా ?
ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర భూములపై కూడా గొడ్డలి పార్టీ కన్ను పడింది. రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు గొడ్డలి పార్టీ నేత బొల్లా బ్రహ్మనాయుడు రంగంలోకి దిగాడు. తమ అధినేత జగన్ రెడ్డి నేర్పిన విద్యతో ఫేక్ జీవోలు సృష్టించి దొరికిపోయాడు.
పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
ఇంతకీ... ఏ ప్యాలెస్‌లో దాచిపెట్టావ్ జగన్?


30/05/2026

సమాజం పట్ల బాధ్యత లేనివాళ్లే యువతను, మహిళలను నిర్లక్ష్యం చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీకి వారి శక్తి సామర్థ్యాల గురించి బాగా తెలుసు. అందుకే మొదటినుంచీ రాజకీయాల్లోకి యువతను, మహిళలను ప్రోత్సహిస్తుంది టీడీపీ. దానికి కొనసాగింపే ఇప్పుడు చట్టసభలలో స్త్రీలకు 33% రిజర్వేషన్.




#నాతెలుగుదేశంనాబాధ్యత

Address

Chandragiri
517101

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Chandragiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Chandragiri:

Share