28/05/2026
పదేపదే కార్యకర్తలను, మద్దతుదారులను అవమానపరిచే తత్వం ఏమాత్రం మంచిది కాదు.
ఎందుకంటే ఒక నాయకుడి బలం పదవి కాదు… అతని వెంట నిలిచే మనుషులు.
కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధానం కొనసాగితే,
తాత్కాలికంగా అధికారం నిలిచినా
దీర్ఘకాలంలో సంస్థల మూలాలకే ముప్పు ఏర్పడుతుంది.
ఒక వ్యక్తి వల్ల సంస్థ ఎదగొచ్చు…
కానీ అదే వ్యక్తి అహంకారం వల్ల సంస్థ కూలిపోవచ్చు కూడా.
మన తర్వాత కూడా మనుగడ సాగించాల్సిన సంస్థలను
వ్యక్తిగత కోపాలు, అవమానాలు తో బలహీనపరచడం ప్రమాదకరం.
గౌరవం ఇచ్చే నాయకత్వం సంస్థలను నిలబెడుతుంది…
అవమానించే నాయకత్వం ఒంటరితనాన్ని మాత్రమే మిగులుస్తుంది.