బిజెపి జనతా వారధి-పశ్చిమ గోదావరి జిల్లా

  • Home
  • India
  • Bhimavaram
  • బిజెపి జనతా వారధి-పశ్చిమ గోదావరి జిల్లా

బిజెపి జనతా వారధి-పశ్చిమ గోదావరి జిల్లా Try to resolve Public Grievance by BJP West Godavari District Committee through Government Officials.

13/07/2026
లో-ఓల్టేజీ, హై-టెన్షన్ మరియు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగల సమస్యలు పరిష్కరించాలి!! బిజెపి జనతా వారధి ద్వారా ప్రభుత్వ...
13/07/2026

లో-ఓల్టేజీ, హై-టెన్షన్ మరియు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగల సమస్యలు పరిష్కరించాలి!!
బిజెపి జనతా వారధి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి!
******
భీమవరం, జూలై 13: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో భాగంగా జిల్లా కన్వీనర్ తోట గంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కలిదిండి వినోద్ కుమార్ వర్మ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్ప కి లో-ఓల్టేజీ, నివాస ప్రాంతాల్లో హై-టెన్షన్ మరియు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు, ఆక్వా రైతులకు రాయితీపై సకాలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు, విద్యుత్ బిల్లులు, ఆధార్ మరియు ఇతర సాంకేతిక లోపాలను ప్రత్యేక డ్రైవ్ ద్వారా పరిష్కరించి వినియోగదారుల సేవలను మెరుగుపరచాలని కోరుతూ వినతిపత్రం అందించింది.
ఈ కార్యక్రమంలో జనతా వారధి కో కన్వీనర్స్ ఇంజేటి వెంకటేశ్వర్లు, గాదిరాజు వెంకటేశ్వర రాజు, అడబాల శివ, బుద్దరాజు బలరామ కృష్ణంరాజు, పాకా ధనుంజయ, బి.హెచ్.సుబ్బరాజు, చెన్నంశెట్టి నాగరాజు, శ్రీనివాస్, వి.వెంకటేష్, ములపాక వెంకటేశ్వర రావు,తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇట్లు,
తోట గంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి & జిల్లా కన్వీనర్,
బిజెపి జనతా వారధి
పశ్చిమ గోదావరి జిల్లా.

నేడు పశ్చిమ గోదావరి జిల్లా బిజెపి కార్యాలయం, భీమవరం నందు నిర్వహించిన జనతా వారథి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్య...
10/07/2026

నేడు పశ్చిమ గోదావరి జిల్లా బిజెపి కార్యాలయం, భీమవరం నందు నిర్వహించిన జనతా వారథి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి సాలగ్రామ లక్ష్మీప్రసన్న గారు ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి అర్జీలు స్వీకరించడమైనది.
ఇట్లు,
తోట గంగరాజు,
జిల్లా కన్వీనర్,
బిజెపి జనతా వారధి, పశ్చిమగోదావరి జిల్లా.

09/07/2026

ఉపాధి హమీ చట్టంలా రైతు హమీ చట్టం తీసుకురావాలి!
ఇట్లు,
తోట గంగ రాజు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి, పశ్చిమ గోదావరి జిల్లా.

09/07/2026

ఇరుపక్షాల రైతుల మధ్య కుదిరిన రాజీ!
నష్టపోయిన రైతులకు పరిహారంగా వరి విత్తనాలు మరియు భవిష్యత్తులో వ్యర్ధ జలాలను వదలకుండా స్పష్టమైన హామీ!
****
తుందుర్రు: జూలై,09: భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో తుమ్మకోడు పంట బోదె ఆధారంగా 130 ఎకరాల వరి భూమి సాగు జరుగుతున్న నేపథ్యంలో పది రోజులక్రితం నారుమళ్లు వేయగా, రొయ్యల చెరువుల వ్యర్ధ జలాలను నేరుగా పంట పొలాల్లోకి వదలటం కారణంగా నారు మళ్ళు మొల కెత్తకుండా తీవ్ర నష్టానికి గురి అయిన నేపథ్యంలో ఇరుపక్షాల రైతుల మధ్య జరిగిన చర్చల్లో నష్టపోయిన వరి రైతులకు విత్తనాలు పరిహారంగా ఇచ్చేలా మరియు భవిష్యత్తులో రొయ్యల చెరువుల వ్యర్ధ జలాలను వరి పొలాల్లోకి వదలకుండా స్పష్టమైన హామీ ఇచ్చినందున రాజీ కుదిరింది. రైతుల సమస్య తమ దృష్టికి వచ్చిన వెంటనే స్పందించిన భీమవరం తహసిల్దార్ గారికి, రెవిన్యూ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులకు రైతులు ధన్యవాదాలు తెలిపారు. తుమ్మకోడు పంట బోదెలను త్రవ్వేలా, ఆక్వా చెరువులకు ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేలా సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది.
ఈ చర్చల్లో నాతో పాటు తుందుర్రు నీటి సంఘం డైరెక్టర్ తిరుమల శ్రీనివాస నాయుడు, కురెళ్ళ శ్రీరాములు, కర్రి సోమేశ్వరరావు, చీడే చిన్న, కొట్టు ప్రసాద్, పుచ్చకాయల జోసెఫ్, పులి సత్యనారాయణ, అడ్డాల పద్దయ్య మరియు ఇరుపక్షాల రైతులు పాల్గొన్నారు.
ఇట్లు,
తోట గంగ రాజు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి & జనతా వారధి జిల్లా కన్వీనర్, పశ్చిమ గోదావరి జిల్లా.

డా.శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా యువ మోర్చా ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన సమ్మేళనంలో వక్తగా...
06/07/2026

డా.శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా యువ మోర్చా ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన సమ్మేళనంలో వక్తగా...

డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారితో..
06/07/2026

డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారితో..

Address

Bhimavaram, West Godavari District
Bhimavaram
534201

Website

Alerts

Be the first to know and let us send you an email when బిజెపి జనతా వారధి-పశ్చిమ గోదావరి జిల్లా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share