TDP Pallamalli- పల్లామల్లి

TDP Pallamalli- పల్లామల్లి మన గ్రామ స్వరాజం కోసం - తెలుగుదేశం తో కలిసి ముందుకు నడుద్దాం ✌️

28/09/2025

మన ఊరు - మన నీరు

08/07/2025

రైతులకు అత్యవసర సూచన!

అన్నదాత సుఖీభవ పథకం - అర్హత తనిఖీ మరియు ఫిర్యాదుల సమర్పణకు చివరి అవకాశం

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా, అర్హులైన రైతుల జాబితాలు అన్ని రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచబడ్డాయి. రైతులు తమ అర్హతను నిర్ధారించుకోవడానికి ఈ కేంద్రాల్లోని జాబితాలను పరిశీలించవచ్చు. అంతేకాకుండా, అర్హత కలిగిన రైతులు ఈ కేంద్రాల నుండి తమ పేర్ల ప్రింట్ కాపీలను కూడా పొందవచ్చు.

మీ అర్హతను తెలుసుకోవడానికి మూడు మార్గాలు:

* రైతు సేవా కేంద్రాలలో ప్రత్యక్ష తనిఖీ: సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న జాబితాలలో మీ పేరును తనిఖీ చేసుకోండి.

* అన్నదాత సుఖీభవ పోర్టల్ ద్వారా: మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్లలేని పక్షంలో, అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోకి వెళ్లి, మీ ఆధార్ నంబర్ ద్వారా "Know Your Status" (మీ స్థితిని తెలుసుకోండి) ఆప్షన్‌ను ఉపయోగించి మీ అర్హతను తనిఖీ చేసుకోవచ్చు.

* 'మన మిత్ర' వాట్సాప్ సేవ ద్వారా: రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో పారదర్శకతను పెంచడానికి ప్రవేశపెట్టిన 'మన మిత్ర' వాట్సాప్ సేవ ద్వారా కూడా మీ అర్హతను తెలుసుకోవచ్చు. ఇందుకోసం, మీ ఆధార్ నంబర్‌ను 9552300009 అనే 'మన మిత్ర' వాట్సాప్ నంబర్‌కు పంపితే, మీకు వాట్సాప్ ద్వారానే అర్హత వివరాలు తెలుపబడతాయి.

ముఖ్య గమనిక: ఫిర్యాదుల సమర్పణకు చివరి తేదీ జూలై 13

అర్హుల జాబితాలో మీ పేరు లేనప్పటికీ, మీరు ఈ పథకానికి అర్హులమని భావిస్తే, వెంటనే అప్రమత్తం అవ్వండి! సంబంధిత రైతు సేవా కేంద్రంలో మీ అర్జీతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించి, అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోని "గ్రీవెన్స్ మాడ్యూల్" (ఫిర్యాదుల విభాగం)లో నమోదు చేసుకోవచ్చు.

ఈ అవకాశం కేవలం జూలై 13 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష మేరకు, అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకంలోని ఆర్థిక సహాయం అందాలని, ఏ ఒక్క రైతు కూడా లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గ్రీవెన్స్ పరిష్కార మాడ్యూల్ ద్వారా నమోదు చేసుకునే అవకాశాన్ని రైతులందరికీ చేరేలా ముమ్మర ప్రచారం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అర్హులైన రైతులందరూ పథకం ప్రయోజనాలను పొందాలని కోరుకొంటున్నాను.

26/05/2025

సంతనూతలపాడు నియోజకవర్గం మహానాడు ఆహ్వానితులకు వసతి మరియు పార్కింగ్ వివరాలు: Proddatur నియోజకవర్గంలో పోట్లదుర్తి, యెర్గంట్ల రోడ్డు లో గెస్ట్ హౌస్ / హాస్టల్ / ఇన్స్టిట్యూషన్ పేరు - రెడ్ల కళ్యాణమండపం , వసతి లొకేషన్ - https://stiny.in/TDPSMS/Mnd15 , సంప్రదించండి: వెంకటేష్ - 9392970020 , మరియు పార్కింగ్ లొకేషన్ - https://stiny.in/TDPSMS/MndP2 పార్కింగ్ కొరకు సంప్రదించండి: కె బాలు యాదవ్ 9959758929 , మొత్తం వివరాలు కొరకు సంప్రదించండి- శ్రీనివాస్ రెడ్డి 9989623192 9959600000 టిడిపి

23/05/2025

అందరికి నమస్కారం..
ఈరోజు 23-05-2025.శుక్రవారం సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ.బి.ఎన్.విజయ్ కుమార్ గారి పోగ్రామ్స్ వివరాలు....

రాత్రి.9.00 గంటలకు చీమకుర్తి మం పల్లమల్లి గ్రామంలో పారా గోపాల్ కృష్ణ గారి కుమారుడి వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొంటారు.

ఇట్లు
ఎమ్మెల్యే గారి కార్యాలయం, సంతనూతలపాడు నియోజకవర్గం.

20/05/2025

ఏపీలో గర్భిణీ స్త్రీలకు శుభవార్త.. ఎన్టీఆర్ బేబీ కిట్లు పథకం తిరిగి పునరుద్ధరణ:

➥ 51 కోట్ల 14 లక్షల 77 వేలు నిధులు విడుదల. ఒక్కో కిట్ కు 1410/- ఖర్చు పెట్టనున్న ప్రభుత్వం.

➥ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ పేరుతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవం అయిన తల్లులకు కిట్లు అందించనున్నారు. 2016లో ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం ప్రారంభించారు. అయితే 2019 తరువాత బేబీ కిట్ పథకం ఆగిపోయింది.

✧ బేబీ కిట్ పథకంలో ఏమేమి ఉంటాయి ✧

➥ బేబీ కిట్‌లో దోమతెర, దుప్పటి, స్లీపింగ్ బెట్, యాంటీసెప్టిక్ లోషన్‌తో పాటుగా నాప్‌కిన్, డైపర్లు, షాంపూ వంటి 11 రకాల సామాగ్రి ఉంటుంది.

➥ ఈ కిట్‌లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఉచితంగా అందజేస్తారు.

అందరికి నమస్కారం..*ఈనెల 22-05-2025.గురువారం ఉదయం.10.00 గంటలకు త్రోవగుంట దగ్గర విష్ణు ప్రియా ఫంక్షన్ హాల్లో సంతనూతలపాడు న...
18/05/2025

అందరికి నమస్కారం..
*ఈనెల 22-05-2025.గురువారం ఉదయం.10.00 గంటలకు త్రోవగుంట దగ్గర విష్ణు ప్రియా ఫంక్షన్ హాల్లో సంతనూతలపాడు నియోజకవర్గ మహానాడు కార్యక్రమం జరుగును.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ.బి. ఎన్. విజయ్ కుమార్ గారు పాల్గొననున్నారు.*

*కావున ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు,గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ నాయకులు,తెలుగు మహిళలు, కార్యకర్తలు అందరూ పాల్గొన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.*

ఇట్లు
*ఎమ్మెల్యే గారి కార్యాలయం,సంతనూతలపాడు నియోజకవర్గం.*

22/04/2025

22-04-2025.మంగళవారం..
*చీమకుర్తి మండలం పల్లమల్లి గ్రామంలో జడ్పీ హై స్కూల్ లో ఏపీ మిడ్ వెస్ట్ గ్రానైట్ వారి సేవ కార్యక్రమంలో భాగంగా 45 మంది విద్యార్థులకు సైకిల్స్ పంపిణి చేసిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ. బి. ఎన్. విజయ్ కుమార్ గారు.*
ఈ కార్యక్రమంలో మిడ్ వెస్ట్ మేనేజర్ అంబటి శ్రీనివాసరావు గారు,APMDC డైరెక్టర్ నతానియెల్ గారు, mro బ్రాహ్మయ్య గారు, amc చైర్మన్ మన్నం ప్రసాద్ గారు, మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు గారు, Meo గారు, స్కూల్ ప్రిన్సిపాల్ గారు, అన్నంనేని రాఘవయ్య గారు, కరిచేటి వెంకటేశ్వర్లు గారు, అంకయ్య గారు,శ్రీనివాసరావు గారు, వేల్పుల శ్రీనివాసరావు గారు, మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Prakasam Police
01/03/2025

Prakasam Police

'సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్ళు' అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన  మానవతావాది... నిరుపేదల జీవితాల్లో...
18/01/2025

'సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్ళు' అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది... నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది...స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త...స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుని స్మృతికి నివాళులర్పిద్దాం. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనతో... "అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం" అని నిరూపించిన మాననీయులు ఎన్టీఆర్ ఆశించిన సమసమాజాన్ని సాధించుకుందాం. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని...తెలుగు జాతిని నెంబర్ వన్ చేసేందుకు కంకణబద్ధులై ఉన్నామని తెలుపుతూ...ఆ యుగపురుషుని వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.

#పల్లామల్లి

23/12/2024

ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం చదువుతూ సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టాము. నిర్ణీత రుసుముతో ఈ నెల 31 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించాం. వివిధ కారణాలవల్ల పరీక్ష ఫీజు చెల్లించని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.

Address

Addanki
523263

Alerts

Be the first to know and let us send you an email when TDP Pallamalli- పల్లామల్లి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share